
కూరగాయలు, పాలు, పండ్లు, గుడ్ల అమ్మకాలు సాగించే పొలిమేరాస్ రికార్డు సృష్టించింది. వ్యాపారం ప్రారంభించిన అనతి కాలంలోనే కోట్ల రూపాయల విలువైన మార్కెట్ వ్యాల్యూని సృష్టించుకుంది. స్టార్టప్‌గా మొదలై హైదరాబాద్, బెంగళూరులలో విస్తరించిన పొలిమేరాస్‌ని హైదరాబాద్‌కి చెందిన జీఎస్‌ఎస్ ఇన్ఫోటెక్ అనే సంస్థ రూ.250 కోట్ల రూపాయలకు సొంతం చేసుకుంది. పొలిమేరాస్‌లో వంద శాతం వాటాలను దక్కించుకుంది.
పొలిమేరాస్‌కి బెంగళూరు, హైదరాబాద్‌లలో కలిసి ప్రస్తుతం 70 వరకు స్టోర్లు ఉన్నాయి. ఈ కంపెనీకి నెలకు 21వేల మంది కస్టమర్ బేస్ ప్రస్తుతానికి ఉంది. రాబోయే రోజుల్లో ఈ స్టోర్ల సంఖ్యను వందకు పెంచాలని నిర్ణయించారు. అతి త్వరలోనే టెక్నాలజీ ఉపయోగిస్తూ యాప్ ద్వారా డోర్ డెలివరీ సర్వీసులను ప్రారంభించే యోచనలో ఉన్నారు.
Comments
Please login to add a commentAdd a comment