vegtables
-
కూరగాయలు వండుకొనలేం..
ఇల్లెందురూరల్: జిల్లాలో వర్షాభావం వల్ల కూరగాయల ధరలకు రెక్కలొచ్చాయి. ఏ కూరగాయలు కొనాలన్నా అమాంతం వాటి ధర పెరిగిపోవడంతో అన్ని వర్గాలు ఆందోళన చెందుతున్నాయి. ఇప్పటి వరకు ఎండల కారణంగా కూరగాయల దిగుబడులు ఆశించిన మేర లేవు. వర్షాకాలం ప్రారంభమైనా వరణుడి కరుణ లేకపోవడంతో వాటి ఉత్పత్తి తగ్గి ధరలు చుక్కల సరసన చేరాయి. విపణిలో వాటిని కొనుగోలు చేయడానికి వెళ్లిన వారికి ధరలు చూసి కళ్లు బైర్లు కమ్ముతున్నాయి. వర్షాకాలం ప్రారంభంలోనే ధరలు ఇలా ఉంటే మున్ముందు పరిస్థితి ఏమిటన్నది ప్రశ్నార్థకంగా మారింది. అసలే నిత్యావసర ధరలు నింగినంటుతుంటే కనీసం కూరగాయలు తినే పరిస్థితి లేకపోవడంపై వంటింటి గృహిణులు పెదవి విరుస్తున్నారు. 12 వేల ఎకరాల్లో సాగు టమాట ధర అప్పుడే కిలో రూ.40 నుంచి రూ.50 వరకు పెరిగిపోయింది. బీరకాయలు కిలో రూ.80, చిక్కుడుకాయలు కిలో రూ.100 వరకు పలుకుతున్నాయి. నాలుగైదు రకాలు తప్ప ప్రతి కూరగాయ ధర కొండెక్కుతోంది. జిల్లావ్యాప్తంగా ఏటా 12 వేల ఎకరాల్లో కూరగాయలు సాగవుతాయని ఉద్యానశాఖ అధికారులు చెపుతున్నారు. వర్షాకాలంలో 6 వేల ఎకరాల్లో.. వేసవిలో 2,500 ఎకరాల్లో.. చలికాలంలో 3,500 ఎకరాల విస్తీర్ణంలో రైతులు కూరగాయల పంటలను సాగుచేస్తుంటారని పేర్కొంటు న్నారు. ఉద్యాన పంటల్లో అంతర్పంటగా కొంద రు, సీజన్‌కు అనుగుణంగా కూరగయాల సాగు చే సే రైతులు మరికొందరు ఉన్నారని వివరిస్తున్నారు. కూరగాయలు సాగయ్యే గ్రామాలివే.. జిల్లాలో ఇల్లెందు మండలంలోని కొమరారం, పోచారంతండా, పోలారం, మాణిక్యారం, రేపల్లెవాడ, రాఘబోయినగూడెం తదితర గ్రామపంచాయతీల నుంచి కూరగాయలు అత్యధిక విస్తీర్ణంలో సాగవుతుంటాయి. ఆ తరువాత అశ్వారావుపేట మండలంలో సాగవుతున్నట్లు ఉద్యానశాఖ అధికారులు చెబుతున్నారు. వీటితోపాటు చండ్రుగొండ, అన్నపురెడ్డిపల్లి, తిప్పనపల్లి, మాచినేనిపురం, వినోభానగర్, గుండ్లరేవు, సుజాతనగర్, సింగభూపాలెం, రాఘవాపురం, బంగారుచెలక, జగన్నాథపురం, జగ్గారం, అశ్వాపురం, ఇరవండి, పట్టేనగర్, చిన్నబండరేవు, పెద్దబండరేవు, దుమ్ముగూడెం, గుమ్మారం, తీగలేరు, జానంపాడు, కరకగూడెం, సంపత్‌నగర్, ఆళ్లపల్లి, మామకన్ను తదితర గ్రామాల్లో సాగుచేస్తుంటారు. ఇతర ప్రాంతాల నుంచి దిగుమతి వర్షాకాలం ప్రారంభమైనా సరైన రీతిలో వర్షాల్లేక కూరగాయల పంటలు దెబ్బతింటున్నాయి. ప్రస్తుతం ఉన్న సాగు విస్తీర్ణం జిల్లా అవసరాలకు ఏమాత్రం సరిపోదు. చాలా వరకు కూరగాయలను ఇతర జిల్లాల నుంచి దిగుమతి చేసుకోవాల్సిన పరిస్థితి నెలకొందని హోల్‌సేల్ వ్యాపారులు చెబుతున్నారు. టమాట మదనపల్లి నుంచి, మిర్చి బాపట్ల నుంచి.. ఇలా పలు చోట్ల నుంచి కూరగాయలను దిగుమతి చేసుకుంటున్నారు. అయితే స్థానికంగా లభ్యమయ్యే కూరగాయల ధరలు కూడా తక్కువేం లేకపోవడం గమనార్హం. ఎందుకీ పరిస్థితి జనాభా అవసరాలకు అనుగుణంగా కూరగాయల ఉత్పత్తికి అవసరమైన ప్రోత్సాహం రైతులకు అందడం లేదు. కనీసం ఉప ఉత్పత్తులపైనన్నా ప్రజలను పూర్తిస్థాయిలో అధికారులు చైతన్యం చేయడం లేదు. 12 వేల ఎకరాల్లో కూరగాయల పంటలు సాగవుతున్నా జిల్లాలో ఒక్కటంటే ఒక్కటి కూడా కూరగాయలు నిల్వ చేసుకునేందుకు కోల్డ్‌స్టోరేజ్ లేదు. పండించిన పంట మార్కెట్‌కు తప్ప నిల్వ చేసుకునేందుకు వేరే మార్గం కనిపించడం లేదు. జిల్లాలో ప్రతి నియోజకవర్గానికి మార్కెట్ కమిటీలు ఉన్నాయి. కానీ ఏఒక్క కమిటీ కూడా కూరగాయలు నిల్వ చేసేందుకు కూల్చాంబర్ల నిర్మాణానికి ప్రాధాన్యమివ్వలేదు. జిల్లాలో ఎక్కువగా చిన్న కమతాల్లోనే కూరగాయలు పండిస్తున్నారు. హెక్టార్ల కొద్ది విస్తీర్ణంలో సాగు జరగడం లేదు. -
ఆమె నిన్నటి మేటి హీరోయిన్.. కళ్ళతోనే నటించేది! ఇప్పుడు ఎందుకిలా?
ఆమె నిన్నటి మేటి హీరోయిన్. కళ్ళతోనే నటించేది. ఆకాశంలో ఆశల హరివిల్లు కట్టుకొంది. ఇప్పుడు మెమరీ లాస్‌తో బాధపడుతోంది. స్టెప్స్ మర్చిపోయింది. డాన్స్‌కు దూరం అయ్యింది. డాన్స్ స్కూల్ పెట్టాలనే ఆలోచన కూడా విరమించుకొంది. డైలాగులు కూడా గుర్తు చేసుకోలేక సీరియల్స్‌కు కూడా దూరం అయ్యింది. తన భర్త మరణించిన తరువాత ఇలా మెమరీ లాస్ అయ్యిందని అనుకొంటోంది. ఏది.. ఏ కారణం చేత జరిగిందో తెలుసుకోలేని దౌర్భాగ్యపు సమాజంలో మనం ఉన్నాము. మీకందరికీ పరిచయం ఉన్న నలుగురు మహిళా టీవీ యాంకర్లకు ఇదే సమస్య ఎదురయ్యింది. ఏం చేయాలి? 1 . రోజుకు నాలుగైదు వాల్ నట్స్ తినాలి. అదే విధంగా పిస్తా, బాదం చెరి నాలుగైదు తినాలి . 2 . మాంసాహారులైతే సముద్రపు చేపలు అప్పుడప్పుడు తినాలి. 3 . కార్బ్స్ తగ్గించాలి. ప్రోటీన్ ఎక్కువగా తీసుకోవాలి. రోజుకు మూడు నాలుగు లీటర్ల మంచి నీరు తాగాలి. 4 . పనిలో ఎప్పుడు బిజీగా ఉండేలా చూసుకోవాలి. వీలైనంత ఎక్కువగా మాట్లాడాలి. ఇది అన్నిటికంటే ముఖ్యం. ఒంటరి జీవనం కూడదు. 5 . అవిశె, గుమ్మడి ... గింజెలు, ఆకుకూరలు, కాయగూరలు, తాజా పళ్ళు తరచూ తీసుకోవాలి . 6 . బాగా నిద్ర పోవాలి. లేదంటే డెమెన్షియా! ఇలా చేస్తే ఆమెకైనా, మెమరీ లాస్ అవుతున్న ఎవరికైనా తిరిగీ కొత్తగా రెక్కలు వస్తాయి. లేదంటే డెమెన్షియా. అది ఏ స్థాయిలో ఉంటుందంటే తన పేరు, ఇంటి అడ్రెస్స్ మరచిపోయి ఏదో ఆలోచనలతో ఇంటినుంచి వెళ్లి పోయి తిరిగి రాలేక ఫుట్ పాత్ ల పై అనాథలా బతికి.... తనువు చాల్సించాల్సి వస్తుంది. భయంకరం... చెబితే కొంతమంది ఏడుస్తారు కానీ అండీ ... 78 ఏళ్ళు వచ్చినా ఆరోగ్యం గా ఒక బృందావనం అంటూ జీవిస్తోన్న ఆ మధుర గాయని ఉన్నట్టుండి కళ్ళుతిరిగి డ్రెస్సింగ్ టేబుల్ పై పడి మరణించడానికి కారణం ఏంటని ఎవరైనా చెప్పారా ? రక్తంలో క్లోట్స్ ఉంటే అది మెదడు పోటుకు దారి తీయొచ్చు. ముందుగా కళ్ళు తిరుగుతాయి. మమూలుగా కళ్ళు తిరగడానికి ఇలా రక్తంలో క్లోట్స్ వల్ల వచ్చిన దానికి తేడా ఉంటుంది. అందుకే ఆమె అంత బలంగా పడిపోయింది. రక్తంలో క్లోట్స్ ఎందుకు వచ్చాయి? వయసు అయిపొయింది .. వాతావరణ మార్పులు .. చెన్నై చలి .. చెన్నై ఎండలు .. నీరు తాగడం వల్ల.. ఉపవాసం ఉండడం వల్ల .. జింకు పోవడం వల్ల .. చెన్నై పక్కనే సముద్రం ఉండడం వల్ల ..... ఇలా సోది కారణాలు ఎన్నైనా చెబుతారు జనాలు. అది అంతే ! -వాసిరెడ్డి అమర్ నాథ్, మానసిక నిపుణులు, పాఠశాల విద్య పరిశోధకులు (వ్యాసకర్త వ్యక్తిగతానుభవసారం ఇచ్చిన కథనం) - ఇటీవల ఓ ఇంటర్వ్యూలో తాను మొమరీ లాస్‌తో బాధపడుతున్నట్లు సీనియర్ నటి భానుప్రియ చెప్పిన విషయం తెలిసిందే! -
కూరగాయలమ్మే పొలిమేరాస్.. రూ.250 కోట్ల డీల్ !
కూరగాయలు, పాలు, పండ్లు, గుడ్ల అమ్మకాలు సాగించే పొలిమేరాస్ రికార్డు సృష్టించింది. వ్యాపారం ప్రారంభించిన అనతి కాలంలోనే కోట్ల రూపాయల విలువైన మార్కెట్ వ్యాల్యూని సృష్టించుకుంది. స్టార్టప్‌గా మొదలై హైదరాబాద్, బెంగళూరులలో విస్తరించిన పొలిమేరాస్‌ని హైదరాబాద్‌కి చెందిన జీఎస్ఎస్ ఇన్ఫోటెక్ అనే సంస్థ రూ.250 కోట్ల రూపాయలకు సొంతం చేసుకుంది. పొలిమేరాస్‌లో వంద శాతం వాటాలను దక్కించుకుంది. పొలిమేరాస్‌కి బెంగళూరు, హైదరాబాద్‌లలో కలిసి ప్రస్తుతం 70 వరకు స్టోర్లు ఉన్నాయి. ఈ కంపెనీకి నెలకు 21వేల మంది కస్టమర్ బేస్ ప్రస్తుతానికి ఉంది. రాబోయే రోజుల్లో ఈ స్టోర్ల సంఖ్యను వందకు పెంచాలని నిర్ణయించారు. అతి త్వరలోనే టెక్నాలజీ ఉపయోగిస్తూ యాప్ ద్వారా డోర్ డెలివరీ సర్వీసులను ప్రారంభించే యోచనలో ఉన్నారు. -
వైరల్ వీడియో: శారద.. నీకు సెల్యూట్
సాక్షి, హైదరాబాద్ : అసలే పేదరికం.. కుటుంబం గడవడమే కష్టం. అంతలోనే కరోనా.. చేస్తున్న సాఫ్ట్వేర్ ఉద్యోగం పోయింది. తల్లిదండ్రులకు అసరాగా ఉంటునన్న ఆనందం ఆవిరైపోయింది. ఆపై ఆర్థికంగా ఇబ్బందులు. కానీ ఇవేమి ఆ పేదింటి ఆడబిడ్డను అంగుళం కదిలించలేకపోయాయి. ఈ కరోనా కాలంలో వచ్చిన కష్టాలతో కుంగిపోలేదు. సాఫ్ట్వేర్ ఉద్యోగం పోతేనేం కూరగాయలమ్మి కుటుంబానికి అండగా ఉంటాననని నడుం బిగించింది ఓరుగల్లు పోరుబిడ్డ శారద. ఉద్యోగం కోల్పోయిన ఏ మాత్రం వెనకడుగు వేయకుండా స్వశక్తితో కుటుంబాన్ని పోషించేందుకు కూరగాయలు అమ్ముతూ యువతకు ఆదర్శంగా నిలుస్తోంది. కూరగాయలను అమ్ముతున్నందుకు ఏ మాత్రం నామోషి పడటం లేదంటోంది యువ సాఫ్ట్వేర్ ఇంజనీర్. దేశ రాజధాని ఢిల్లీలో రెండేళ్లు సాప్ట్వేర్ ఉద్యోగినిగా విధులు నిర్వర్తించిన శారద ఇటీవల హైదరాబాద్‌లో కొత్త జాబ్‌లో జాయిన్ అయ్యారు. మంచి వేతనంతో తొలి మూడు నెలల పాటు ట్రైనింగ్ పూర్తి చేసిన ఆమెకు.. కరోనా వెంటాడింది. లాక్డౌన్ విధించడంతో కంపెనీ యాజమన్యం ఆమెను ఉద్యోగంలో నుంచి తొలగించింది. దీంతో ఎలాంటి కుంగుబాటకు గురికాని శారద.. తల్లిదండ్రులకు తోడుగా కూరగాయల వ్యాపారం ప్రారంభించింది. ఉద్యోగం కోల్పోయి మానసిన వేదనతో ఆత్మహత్యకు పాల్పడుతున్న ఎంతోమందికి ఆదర్శంగా ఉంటున్న యువ సాప్ట్‌వేర్‌ను ‘సాక్షి’ పలకరించింది. సోషల్ మీడియాలో వైరల్‌గా మారిన ఆమె మాటలపై పలువురు ప్రముఖులు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. శభాష్ తల్లీ అంటూ పొగడ్తల్లో ముంచెత్తుతున్నారు. కాగా దేశంలో రోజు రోజుకరూ నిరుద్యోగం పెరిగిపోతోంది. కరోనా కారణంగా అమలు చేస్తున్న లాక్‌డౌన్‌తో కూలీలు ఉపాధికి దూరమయ్యారు. వివిధ రంగాల్లో అనేక మంది ఉద్యోగాలు కోల్పోయారు. కరోనా వైరస్ దేశానికి ఆర్థికంగా తీవ్ర నష్టం చేస్తోంది. ముఖ్యంగా లాక్డౌన్ విధించినప్పటి నుంచి దేశంలో పేద, సామాన్య ప్రజలు దిక్కులేనివారయ్యారు. అప్పటివరకూ కూలీనాలీ చేసుకొని బతికేవారంతా రోడ్డున పడ్డారు. లాక్‌డౌన్‌ను అంతకంతకూ పొడిగిస్తుంటే... మరింత మంది ఉద్యోగాలు పోతున్నాయి. ఫలితంగా ఇప్పటికే దేశంలో 12.2 కోట్ల మంది ఉద్యోగాలు కోల్పోయినట్లు తాజా లెక్కలు చెబుతున్నాయి. దేశంలో నిరుద్యోగం 27.1 శాతానికి చేరిందని తేలింది. Must watch video.. really very INSPIRING. You are great thalli. pic.twitter.com/Sj1hh4Fbgf — Gopi Ganesh (@MeGopiganesh) July 26, 2020 -
తారల్లో కూరలు
సిటీలో కూరగాయల ధరలు భగ్గుమంటున్నాయి. మరీ ముఖ్యంగా పచ్చిమిర్చి రేటు మూడు రోజుల్లోనే రెట్టింపైంది. బహిరంగ మార్కెట్లో కిలో రూ.80కు విక్రయిస్తున్నారు. నిన్నమొన్నటి వరకు రూ.10 కిలో ఉన్న టమాటా రూ.30కి చేరింది. బెండ, దొండ, బీన్స్, బీరకాయ ధరలు కిలో రూ.40 దాటాయి. దీంతో మధ్య తరగతి జనం బెంబేలెత్తుతున్నారు. గ్రేటర్ ప్రజల అవసరాలకు తగినట్లుగా శివార్లలో కూరగాయల సాగు ఉండడం లేదు. దీంతో అన్నీ దిగుమతి చేసుకోవాల్సి వస్తోంది. ఈ కారణంగానే రేట్లు పెరుగుతున్నాయని మార్కెట్ వర్గాలు అంటున్నాయి. ఈ ఏడాది పచ్చిమిర్చి సాగు బాగా తగ్గిందని అందుకే ధర రెట్టింపైందని పేర్కొంటున్నాయి. – సాక్షి, సిటీబ్యూరో బాబోయ్ ఇవేం ధరలు. వేసవిలో ఎండలతో పాటు కూరగాయలూ మండుతున్నాయి. ధరలు కుతకుత ఉడుకుతూ సామాన్యుల గుండెల్లో దడ పుట్టిస్తున్నాయి. పచ్చిమిర్చి మిరామిరామంటోంది. బీన్స్ బెంబేలెత్తిస్తోంది. చిక్కుడు చికాకెత్తిస్తోంది. ఇలా ఒక కూరగాయని ఏమిటి అన్నీ తామేం తక్కువ తినలేదని తార పథానికి దూసుకుపోతున్నాయి. నెల రోజుల వ్యవధిలోనే కాయగూరల ధరల్లో భారీ వ్యత్యాసం కనిపిస్తోందంటే పరిస్థితి ఎంత దయనీయంగా మారిందో అర్థమవుతోంది. గడచిన వారం రోజుల్లో కూరగాయల ధరలు రెట్టింపు కావడమే ఇందుకు నిదర్శనంగా చెప్పుకోవచ్చు. మే నెలలోనే ఇలా ఉంటే ఇక జూన్, జూలై నెలల్లో ధరలు ఇంకెలా ఉంటాయోనన్న ఆందోళన సగటు జీవుల్ని కలవరపాటుకు గురిచేస్తోంది. – సాక్షి, సిటీబ్యూరో ఈ నెల మొదటి వారంలో టమాటా కిలో 15 రూపాయలు ఉంటే ప్రస్తుతం రూ.30కి ఎగబాకింది. వంకాయ రూ.15 నుంచి రూ.50 చేరింది. బెండకాయ రూ.30 ఉంటే ప్రస్తుతం రూ.60 అయింది. దొండకాయ పరిస్థితి ఇలాగే ఉంది. బీరకాయ రూ.40 నుంచి రూ.80కి చేరింది. బీన్స్, చిక్కుడు ధరలు శతకానికి చేరువలో ఉన్నాయి. రెండు మూడు రోజుల క్రితం కిలో రూ.30– 40 ఉన్న కిలో పచ్చిమిర్చి సోమవారం రూ. 80కి ఆకాశాన్నంటింది. ఇలా కూరగాయల ధరల పరిస్థితి నెలకు అవతల, నెలకు ఇవతల డబులై కూర్చున్నాయి. దీంతో సామాన్యుల పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. మండిపోతున్న ధరలు కేవలం కొనుగోలుదారులనే కాదు అమ్మకపుదారులను కూడా కష్టాల్లోకి నెట్టేస్తోంది. పావుకిలో కూడా కొనుగోలు చేయకపోతే తమ పరిస్థితి ఏంటని వారు వాపోతున్నారు. ఏం కొనేటట్టు లేదు.. ఏం తినేటట్టు లేదు అంటూ సాధారణ కొనుగోలుదారులు ఆందోళన వ్యక్తంచేస్తుంటే.. ఏం అమ్మేటట్టు లేదు ఏం మిగిలేటట్టు లేదు అని కూరగాయల అమ్మకందారుల చెబుతున్నారు. పచ్చిమిర్చి ఘాటుకు కారణమిదే.. నగర ప్రజల పచ్చిమిర్చి అవసరాలు తీర్చడానికి శివారు ప్రాంతాల నుంచి మిర్చి దిగుమతి అవుతోంది. ఇటీవల అకాల వర్షాలతో మిర్చి పంటకు తీవ్ర ఇష్టం జరిగింది. దీంతో మిర్చి సరఫరా తగ్గిందని మార్కెటింగ్ శాఖ అధికారులు తెలిపారు. దీంతో నగరానికి మిర్చి సరఫరాల తగ్గింది. నగరానికి రోజు దాదాపు 12 వందల నుంచి 15 వందల క్వింటాళ్ల మిర్చి అవసరం. సోమవారం నగరానికి కేవలం సుమారు 850 క్వింటాళ్ల మిర్చి మాత్రమే వివిధ హోల్‌సేల్ మార్కెట్లకు దిగుమతి అయింది. మిర్చి తక్కువగా దిగుమతి అవడంతో వ్యాపారులు ధరలు పెంచేశారు. ప్రస్తుతం హోల్‌సేల్ మార్కెట్లో మిర్చి క్వింటాల్ ధర రూ.5 వేల నుంచి రూ.6వేలు పలుకుతోంది. తగ్గిన స్థానిక దిగుమతులు.. మార్కెట్‌కు ప్రస్తుతం పెద్ద మొత్తంలో టమాటా మాత్రమే దిగుమతి అవుతోంది. ఈ ఏడాది నగర శివారు జిల్లాలైన వికారాబాద్, రంగారెడ్డి, మెదక్, మహబూబ్‌నగర్ రైతలు టమాటా పండించటంతో ఎక్కువగా దిగుమతి అయ్యేవి. ఇతర రాష్ట్రాల నుంచి కూడా టమాటా దిగుమతులు ఎక్కువగా ఉండడంతో వీటి ధర కిలో రూ30 దాటలేదు. కాగా.. టమాటాతో పాటు మిగతా కూరగాయలు ఇతర జిల్లాలతో పాటు ఇతర రాష్ట్ర్రాల నుంచి దిగుమతి చేసుకోవడంతోనే ధరలు పెరుగుతున్నాయని హోల్‌సేల్ వ్యాపారులు చెబుతున్నారు. డిమాండ్‌కు సరిపడా సరఫరా లేదు గ్రేటర్ హైదరాబాద్ నగర జనాభా దాదాపు కోటిమంది. వీరికి ప్రతి రోజు దాదాపు 3 వేల టన్నుల వివిధ రకాల కూరగాయలు వినియోగమవుతున్నాయి. ప్రతి ఒక్కరికి 300 గ్రాముల కూరగాయలు అవసరం. వేసవి ఆఫ్ సీజన్లో నగర ప్రజల 70 శాతం కూరగాయల అవసరాలు ఇతర రాష్ట్రాల దిగుమతులతో పూర్తవుతాయి. దీంతో డిమాండ్‌కు సరిపడా కూరగాయలు మార్కెట్‌కు రాకపోవడంతో ధరలు మండుతున్నాయి. దిగుబడులు తగ్గడంతో ధరలు పెరిగాయి.. గత ఏడాదితో పోలిస్తే ఈ ఏడాది ధరలు ఆలస్యంగా పెరిగాయి. ఇందుకు కారణం వర్షాలు డిసెంబర్ వరకు కురిశాయి. స్థానికంగా కూరగాయల దిగుమతులు లేకపోవడంతో ఇతర రాష్ట్రాల నుంచి తెప్పిస్తున్నారు. దీంతో ధరలు పెరుగుతున్నాయి. శివారు ప్రాంతాల నుంచి మిర్చి, కూరగాయల దిగుబడి తగ్గడంతో ధరలు పెరిగాయి. – కె. శ్రీధర్, స్పెషల్ గ్రేడ్ కార్యదర్శి, గుడిమల్కాపూర్ మార్కెట్ -
మూసీ కాదు.. మూ‘ఛీ’
► పాల నుంచి కూరగాయల దాకా.. విషమే ► మూసీ జలం హాలాహలం! ► నిత్యం మూసీలో కలుస్తున్న 140 కోట్ల లీటర్ల వ్యర్థ జలాలు ► అందులో 60 కోట్ల లీటర్లే శుద్ధి.. అదీ అరకొరగా ► మిగతా 80 కోట్ల లీటర్లు నేరుగా నదిలోకే.. ► కాలుష్య కాసారమవుతున్న నది ► నదీతీరంలో గడ్డి తిన్న పశువుల పాలూ కలుషితం ► గరళంగా మారుతున్న భూగర్భ జలాలు ► వాటిని తాగిన జనాలను వెంటాడుతున్న రోగాలు సాక్షి, హైదరాబాద్: మూసీ.. ఆ నది నీళ్లు తాగిన మూగజీవాలు మృత్యువాత పడుతున్నాయి.. నదిలోని జలచరాల మనుగడ ప్రశ్నార్థకమవుతోంది.. నదీతీరంలో గడ్డి మేసినందుకు పశువుల పాలూ కలుషితమవుతున్నాయి.. పాలల్లోనే కాదు అక్కడ పండే కూరగాయల్లో సైతం విషపు ఆనవాళ్లు కనిపిస్తున్నాయి. అవన్నీ ప్రత్యక్షంగానో, పరోక్షంగానో మన ఒంట్లోకి చేరి రోగాలపాలు చేస్తున్నాయి. కాలుష్య కాసారంలా మారిన మూసీ దెబ్బకు పరిసర ప్రాంతాల్లోని భూగర్భ జలాలూ గరళంలా మారుతున్నాయి. ఈ నీటిని తాగే వారికి నిమోనియా, టైఫాయిడ్, కామెర్లు, విరేచనాలు, కోరింత దగ్గు, జీర్ణకోశ వ్యాధులు వస్తున్నాయి. పరిశ్రమల నుంచి వచ్చే రసాయన వ్యర్థాలు, ఇళ్ల నుంచి వచ్చే మురుగు కలిసి ఒక్కరోజులోనే 140 కోట్ల లీటర్ల జలాలు మూసీలో కలుస్తుండడంతో నది ప్రమాదకరంగా మారుతోంది. ఇందు లో కేవలం 60 కోట్ల లీటర్ల జలాలనే శుద్ధి చేస్తున్నారు. అదీ అరకొరగా. మిగతా 80 కోట్ల లీటర్ల వ్యర్థ జలాలు ఎలాంటి శుద్ధి లేకుండా నేరుగా మూసీలో కలిసిపోతున్నాయి. దీంతో అందులోని నీళ్లు విషతుల్యమవుతున్నాయి. తాజాగా మూసీ జలాలను పరీక్షించిన రాష్ట్ర కాలుష్య నియంత్రణ మండలి(పీసీబీ).. అవి నీళ్లు కాదు, గరళం అని తేల్చింది! మూసీ నీటిలో బయులాజికల్ ఆక్సిజన్ డివూండ్ (బీఓడీ), టోటల్ డిజాల్వ్డ్ సాలిడ్స్(టీడీఎస్) ప్రవూదకర స్థారుుకి చేరుకున్నట్లు ఈ పరీక్షలో స్పష్టమైంది. జలాల్లో ప్రాణవాయువు పరిమాణం అత్యంత కనిష్ట స్థాయికి చేరడంతోపాటు వ్యర్థ రసాయనాల వల్ల కెమికల్ ఆక్సిజన్ డిమాండ్(సీఓడీ ) విపరీతంగా పెరిగింది. సాధారణంగా నీటిలో సీఓడీ ఉండరాదు. ఇక నీటి క్షారత(పీహెచ్) అనూహ్యంగా ఏడు యూనిట్లను మించడం కలవరపెడుతోంది. మూసీ కాలుష్యంతో అటు పర్యావరణం ఇటు జీవావరణ సమతౌల్యం దెబ్బతింటోంది.శుద్ధి శుద్ధ దండగ ఒకప్పుడు స్వచ్ఛమైన జలాలతో గండిపేట్, ఉస్మాన్‌సాగర్, హుస్సేన్‌సాగర్ జలాశయాలకు మూసీ ఆదరువుగా ఉండేది. కానీ జీహెచ్ఎంసీ పరిధిలో 574.59 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలోని నాలాలు, పరిశ్రమల నుంచి వెలువడే వ్యర్థాలతో పూర్తిగా కలుషితమైంది. ఈ నదిలో కలుస్తున్న వ్యర్థ జలాలను జలమండలి, హెచ్ఎండీఏ ఆధ్వర్యంలో ఏడు చోట్ల(ఖైరతాబాద్ ఫ్లైఓవర్ దిగువన, కిమ్స్ ఎదురుగా పాటిగడ్డ వద్ద, అంబర్పేట్, నాగోలు, నల్లచెరువు, అత్తాపూర్) మురుగు శుద్ధి కేంద్రాల్లో(ఎస్టీపీ) శుద్ధి చేస్తున్నారు. అయినా జలాల్లో విష రసాయనాలు, భార లోహాలు, హానికారక మూలకాలు తొలగకపోవడంతో శుద్ధి ప్రక్రియ అలంకారప్రాయంగా మారింది. మురుగు జలాలను ఎస్టీపీలకు తరలించే భారీ సీవర్ ట్రంక్ మెయిన్ పైప్లైన్లకు తరచూ గండి పడుతుండడంతో మురుగు నీరు మూసీకి చేరుతోంది. దీంతో ఈ నీటిని తాగిన పశుపక్ష్యాదులు, చేపల మనుగడ ప్రశ్నార్థకమౌతోంది. ఈ కలుషిత జలాలతోనే ఉప్పల్, ఫిర్జాదిగూడ, ప్రతాపసింగారం, పిల్లాయిపల్లి తదితర ప్రాంతాల్లో పంటలు సాగుచేస్తున్నారు. ఆయా ప్రాంతాల్లో సాగుచేస్తున్న ఆకుకూరలు, కాయగూరల్లోనూ కాలుష్య కారకాల ఆనవాళ్లు కనిపిస్తున్నాయి. అవసరమైన చోట్ల ఎస్టీపీలు లేకపోవడంతో ఎనభై కోట్ల లీటర్ల వ్యర్థ జలాలు ఎలాంటి శుద్ధి కాకుండానే నేరుగా మూసీ నదిలో కలుస్తున్నాయి. మూసీ జలాలతో పంటల సాగు నాగోలు, ఉప్పల్, ఫిర్జాదిగూడ, పిల్లాయిపల్లి, ప్రతాపసింగారం తదితర ప్రాంతాల్లో మూసీ నీళ్లతో కాయగూరలు పండిస్తున్నారు. ఇవన్నీ స్థానిక మార్కెట్లకు వ స్తున్నాయి. ప్రక్షాళన తక్షణావసరం జాతీయ నదీ పరిరక్షణ పథకం(ఎన్‌ఆర్‌సీడీ) రెండో దశ కింద రూ.950 కోట్లతో మూసీ ప్రక్షాళన చేసేందుకు మరో పది సీవరేజి ట్రీట్మెంట్ ప్లాంట్లను ఏర్పాటు చేయాల్సి ఉంది. వీటితోపాటు మరో మూడు ప్రాంతాల్లో రీసైక్లింగ్ యూనిట్లు ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉందని కేంద్ర అటవీ, పర్యావరణ శాఖ గతంలోనే స్పష్టం చేసింది. కానీ మూడేళ్లుగా ఈ ప్రాజెక్టు ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్న చందంగా ఉంది. మురుగు శుద్ధి కేంద్రాల అవసరం ఇక్కడే.. అంబర్పేట్, నాగోల్, నల్లచెరువు, హైదర్షాకోట్, అత్తాపూర్, మీరాలం, ఫతేనగర్, ఐడీపీఎల్ టౌన్షిప్, నాగారం, కుంట్లూర్ - హయత్‌నగర్. రీసైక్లింగ్ యూనిట్లు: ఫతేనగర్, ఐడీపీఎల్ టౌన్షిప్, నాగారం- కాప్రా అరకొర శుద్ధితో ప్రయోజనం లేదు మూసీలో కలుస్తున్న పారిశ్రామిక వ్యర్థ జలాలను ఎస్టీపీల్లో అరకొరగా శుద్ధి చేస్తున్నారు. దీనివల్ల ఉపయోగం లేదు. హానికారక రసాయనాలను తొలగించేందుకు ఈటీపీలు(ఎఫ్లుయెంట్ ట్రీట్మెంట్ ప్లాంట్లు) అవసరం. పారిశ్రామిక వాడల నుంచి వచ్చే వ్యర్థ జలాలను ఎక్కడికక్కడే శుద్ధి చేసి, ఆ తర్వాతే మూసీలో కలిసేలా చూడాలి. అప్పుడే మూసీకి విషం నుంచి విముక్తి. - సజ్జల జీవానందరెడ్డి, పర్యావరణ వేత్త