మెమరీ లాస్‌తో బాధపడుతున్నానని ఇటీవల చెప్పిన భానుప్రియ
ఆమె నిన్నటి మేటి హీరోయిన్. కళ్ళతోనే నటించేది. ఆకాశంలో ఆశల హరివిల్లు కట్టుకొంది. ఇప్పుడు మెమరీ లాస్‌తో బాధపడుతోంది. స్టెప్స్ మర్చిపోయింది. డాన్స్‌కు దూరం అయ్యింది. డాన్స్ స్కూల్ పెట్టాలనే ఆలోచన కూడా విరమించుకొంది. డైలాగులు కూడా గుర్తు చేసుకోలేక సీరియల్స్‌కు కూడా దూరం అయ్యింది.
తన భర్త మరణించిన తరువాత ఇలా మెమరీ లాస్ అయ్యిందని అనుకొంటోంది. ఏది.. ఏ కారణం చేత జరిగిందో తెలుసుకోలేని దౌర్భాగ్యపు సమాజంలో మనం ఉన్నాము. మీకందరికీ పరిచయం ఉన్న నలుగురు మహిళా టీవీ యాంకర్లకు ఇదే సమస్య ఎదురయ్యింది. ఏం చేయాలి?
1 . రోజుకు నాలుగైదు వాల్ నట్స్ తినాలి. అదే విధంగా పిస్తా, బాదం చెరి నాలుగైదు తినాలి .
2 . మాంసాహారులైతే సముద్రపు చేపలు అప్పుడప్పుడు తినాలి.
3 . కార్బ్స్ తగ్గించాలి. ప్రోటీన్ ఎక్కువగా తీసుకోవాలి. రోజుకు మూడు నాలుగు లీటర్ల మంచి నీరు తాగాలి.
4 . పనిలో ఎప్పుడు బిజీగా ఉండేలా చూసుకోవాలి. వీలైనంత ఎక్కువగా మాట్లాడాలి. ఇది అన్నిటికంటే ముఖ్యం. ఒంటరి జీవనం కూడదు.
5 . అవిశె, గుమ్మడి ... గింజెలు, ఆకుకూరలు, కాయగూరలు, తాజా పళ్ళు తరచూ తీసుకోవాలి .
6 . బాగా నిద్ర పోవాలి.
లేదంటే డెమెన్షియా!
ఇలా చేస్తే ఆమెకైనా, మెమరీ లాస్ అవుతున్న ఎవరికైనా తిరిగీ కొత్తగా రెక్కలు వస్తాయి. లేదంటే డెమెన్షియా. అది ఏ స్థాయిలో ఉంటుందంటే తన పేరు, ఇంటి అడ్రెస్స్ మరచిపోయి ఏదో ఆలోచనలతో ఇంటినుంచి వెళ్లి పోయి తిరిగి రాలేక ఫుట్ పాత్ ల పై అనాథలా బతికి.... తనువు చాల్సించాల్సి వస్తుంది.
భయంకరం... చెబితే కొంతమంది ఏడుస్తారు కానీ అండీ ... 78 ఏళ్ళు వచ్చినా ఆరోగ్యం గా ఒక బృందావనం అంటూ జీవిస్తోన్న ఆ మధుర గాయని ఉన్నట్టుండి కళ్ళుతిరిగి డ్రెస్సింగ్ టేబుల్ పై పడి మరణించడానికి కారణం ఏంటని ఎవరైనా చెప్పారా ?
రక్తంలో క్లోట్స్ ఉంటే అది మెదడు పోటుకు దారి తీయొచ్చు. ముందుగా కళ్ళు తిరుగుతాయి. మమూలుగా కళ్ళు తిరగడానికి ఇలా రక్తంలో క్లోట్స్ వల్ల వచ్చిన దానికి తేడా ఉంటుంది. అందుకే ఆమె అంత బలంగా పడిపోయింది. రక్తంలో క్లోట్స్ ఎందుకు వచ్చాయి? వయసు అయిపొయింది .. వాతావరణ మార్పులు .. చెన్నై చలి .. చెన్నై ఎండలు .. నీరు తాగడం వల్ల.. ఉపవాసం ఉండడం వల్ల .. జింకు పోవడం వల్ల .. చెన్నై పక్కనే సముద్రం ఉండడం వల్ల ..... ఇలా సోది కారణాలు ఎన్నైనా చెబుతారు జనాలు. అది అంతే !
-వాసిరెడ్డి అమర్ నాథ్, మానసిక నిపుణులు, పాఠశాల విద్య పరిశోధకులు
(వ్యాసకర్త వ్యక్తిగతానుభవసారం ఇచ్చిన కథనం)
- ఇటీవల ఓ ఇంటర్వ్యూలో తాను మొమరీ లాస్‌తో బాధపడుతున్నట్లు సీనియర్ నటి భానుప్రియ చెప్పిన విషయం తెలిసిందే!
Comments
Please login to add a commentAdd a comment