శరీరానికి వ్యాయామం గురించి ఆలోచిస్తాం. అలాగే, జ్ఞాపకశక్తి బాగుండాలంటే మెదడుకూ వ్యాయామం అవసరం అని గ్రహించాలి. కండరాల కణాలు చురుగ్గా ఉండాలంటే మైండ్‌కూ వ్యాయామం త్పనిసరి. మైండ్‌కు బూస్ట్‌లా పనిచేసే సులువైన, సమర్ధవంతమైన వ్యాయామాలు ఇవి...
ధ్యానంతో స్పష్టత: రోజూ ప్రశాంత వాతావరణంలో కూర్చొని పది నిమిషాలసేపు శ్వాస మీద ధ్యాస ఉంచుతూ ధ్యానం చేయాలి. దీని వల్ల మన ఆలోచనల్లో స్పష్టత లభిస్తుంది. ఫలితంగా మైండ్ చురుగ్గా పనిచేస్తుంది.
పజిల్స్ నింపడం: క్రాస్‌వర్డ్స్, సుడోకో వంటి బ్రెయిన్ టీజర్స్ జ్ఞాపకశక్తికి పదునుపెడతాయి. ఎక్కడైనా జ్ఞాపకశక్తిలో సమస్యలు ఏర్పడినా త్వరగా పరిష్కారం లభిస్తుంది.
పుస్తకపఠనం: ఆసక్తిని పెంచే రచనలు, వ్యాసాలు, మైండ్‌కి ఛాలెంజింగ్‌గా అనిపించే పుస్తకాలు చదవడం వల్ల జ్ఞానానికి సంబంధించిన సామర్థ్యం పెరుగుతుంది.
సాధన: ప్రస్తుత మీ మానసిక స్థితి ఎలా ఉందో గ్రహించడంలో నిర్లక్ష్యంగా ఉండకూడదు. భావోద్వేగాలు, చుట్టూ ఉండే వాతావరణం మన మైండ్‌కు మరింత పదును పెట్టేలా ఉండాలి.
శారీరక వ్యాయామం మైండ్‌కు బూస్ట్: రోజూ వ్యాయామం చేయడం వల్ల రక్తప్రసరణ పెరిగి మెదడు పనితీరు బాగుంటుంది. జ్ఞానసంబంధమైన సామర్థ్యం పెరుగుతుంది. యోగా వంటి సాధనలు కూడా మనోవికాసాన్ని పెంచుతాయి.
నలుగురిలో కలవడం: సామాజిక కార్యకలాపాల్లో పాల్గొంటూ ఉండాలి. దీని వల్ల ఎదుటివారితో సంభాషణ, చర్చలు, ఆలోచనల విస్తృతి పెరుగుతుంది. భావోద్వేగాల పరంగా, మానసిక ఆరోగ్యం కూడా బాగుంటుంది. మెదడును ఎప్పుడూ చురుకుగా ఉండటానికి ప్రయత్నించాలి. బ్రెయిన్ ఎక్సర్‌సైజులతో, అవగాహనతో జ్ఞాపకశక్తికి ఎప్పుడూ పదునుపెడుతూ ఉండాలి. అది ఈ సమయం నుంచే మొదలుపెట్టండి.
Comments
Please login to add a commentAdd a comment