Reliance Launches Beverage Brand Campa - Sakshi
Sakshi News home page

Campa Cola: రిలయన్స్‌ ‘చల్లటి’ కబురు... మార్కెట్‌లోకి రిఫ్రెష్‌ డ్రింక్స్‌

Published Thu, Mar 9 2023 6:45 PM | Last Updated on Thu, Mar 9 2023 6:58 PM

Reliance Launches Beverage Brand Campa - Sakshi

వేసవి సమీపిస్తున్న వేళ రిలయన్స్ చల్లటి కబురు చెప్పింది. 50ఏళ్లకు పైగా చరిత్ర కలిగిన ‘క్యాంపా’ బ్రాండ్‌ కూల్‌డ్రింక్స్‌ను మళ్లీ మార్కెట్లోకి తీసుకొచ్చింది. మూడు రకాల సాఫ్ట్‌డ్రింక్స్‌ను పరిచయం చేస్తూ రిలయన్స్ ఇండస్ట్రీస్ ఫాస్ట్ మూవింగ్ కన్‌జ్యూమర్ గూడ్స్ విభాగం రిలయన్స్ కన్సూమర్ ప్రొడక్ట్స్ లిమిటెడ్ ఓ ప్రకటన విడుదల చేసింది.

ఇదీ చదవండి: బీటెక్‌ అమ్మాయి.. బుల్లెట్‌పై హైజీనిక్‌ పానీపూరి

మూడు ఫ్లేవర్లు.. ఐదు ప్యాక్‌లు 
క్యాంపా కూల్‌డ్రింక్స్‌లో మూడు రకాల ఫ్లేవర్లను రిలయన్స్‌ విడుదల చేసింది. అవి క్యాంపా కోలా, క్యాంపా లెమన్, క్యాంపా ఆరెంజ్. మొత్తం ఐదు రకాల ప్యాక్‌లలో లభిస్తాయి. 200 ఎంఎల్‌ తక్షణ వినియోగ ప్యాక్, 500 ఎంఎల్‌, 600 ఎంఎల్‌ ఆన్-ది-గో షేరింగ్ ప్యాక్‌లు, 1,000 ఎంఎల్‌, 2,000 ఎంఎల్‌ హోమ్ ప్యాక్‌లు ఇందులో ఉన్నాయి.

 

క్యాంపా డ్రింక్స్‌ను అన్ని వయసుల వారు ఇష్టపడతారని, ఎంతో చరిత్ర ఉన్న క్యాంపా పానీయాలను తిరిగి మార్కెట్‌లోకి తెస్తున్నందుకు సంతోషిస్తున్నామని రిలయన్స్ కన్సూమర్ ప్రొడక్ట్స్ లిమిటెడ్ ప్రతినిధి తెలిపారు. ఎఫ్‌ఎంసీజీ వ్యాపారానికి ఇది మరో సాహసోపేతమైన ముందడుగు అని పేర్కొన్నారు. ఈ శీతల పానీయాల పోర్ట్‌ఫోలియోను ఆంధ్రప్రదేశ్, తెలంగాణతో ప్రారంభించి దేశం అంతటా విస్తరించనున్నట్లు చెప్పారు.

ఇదీ చదవండి: టాప్‌ సీక్రెట్‌ చెప్పిన గూగుల్‌ మాజీ వైస్‌ ప్రెసిడెంట్‌... ఇది ఉంటే జాబ్‌ పక్కా!

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement