CAMPA COLA
-
ఉడాన్‌లో విక్రయానికి సిద్దమైన కాంపా డ్రింక్స్ - మరో రెండు నెలల్లో..
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: బిజినెస్ టు బిజినెస్ ఈ-కామర్స్ పోర్టల్ ఉడాన్ తాజాగా రిలయన్స్ కంజ్యూమర్ ప్రొడక్ట్స్‌తో భాగస్వామ్యం కుదుర్చుకుంది. ఇందులో భాగంగా రిలయన్స్ రిటైల్ ప్రమోట్ చేస్తున్న కాంపా పానీయాలను ఉడాన్ విక్రయించనుంది. తొలుత 50,000 పైచిలుకు రిటైలర్లు, కిరాణా స్టోర్లలో కాంపా ఉత్పత్తులు లభిస్తాయి. వచ్చే రెండు నెలల్లో ఈ కేంద్రాల సంఖ్యను 1 లక్షకు చేరుస్తారు. ప్రాజెక్ట్ విస్తార్లో భాగంగా 3,000 వరకు జనాభా ఉన్న గ్రామీణ ప్రాంతాలకు ఎఫ్ఎంసీజీ ఉత్పత్తులను ఉడాన్ చేరవేస్తోంది. 2022లో 1.5 లక్షల టన్నుల ఎఫ్ఎంసీజీ ఉత్పత్తులను దేశవ్యాప్తంగా సరఫరా చేసినట్టు వెల్లడించింది. -
రిలయన్స్ ‘చల్లటి’ కబురు... మార్కెట్లోకి రిఫ్రెష్ డ్రింక్స్
వేసవి సమీపిస్తున్న వేళ రిలయన్స్ చల్లటి కబురు చెప్పింది. 50ఏళ్లకు పైగా చరిత్ర కలిగిన ‘క్యాంపా’ బ్రాండ్ కూల్‌డ్రింక్స్‌ను మళ్లీ మార్కెట్లోకి తీసుకొచ్చింది. మూడు రకాల సాఫ్ట్డ్రింక్స్ను పరిచయం చేస్తూ రిలయన్స్ ఇండస్ట్రీస్ ఫాస్ట్ మూవింగ్ కన్జ్యూమర్ గూడ్స్ విభాగం రిలయన్స్ కన్సూమర్ ప్రొడక్ట్స్ లిమిటెడ్ ఓ ప్రకటన విడుదల చేసింది. ఇదీ చదవండి: బీటెక్ అమ్మాయి.. బుల్లెట్‌పై హైజీనిక్ పానీపూరి మూడు ఫ్లేవర్లు.. ఐదు ప్యాక్‌లు క్యాంపా కూల్‌డ్రింక్స్‌లో మూడు రకాల ఫ్లేవర్లను రిలయన్స్ విడుదల చేసింది. అవి క్యాంపా కోలా, క్యాంపా లెమన్, క్యాంపా ఆరెంజ్. మొత్తం ఐదు రకాల ప్యాక్‌లలో లభిస్తాయి. 200 ఎంఎల్ తక్షణ వినియోగ ప్యాక్, 500 ఎంఎల్, 600 ఎంఎల్ ఆన్-ది-గో షేరింగ్ ప్యాక్‌లు, 1,000 ఎంఎల్, 2,000 ఎంఎల్ హోమ్ ప్యాక్‌లు ఇందులో ఉన్నాయి. క్యాంపా డ్రింక్స్‌ను అన్ని వయసుల వారు ఇష్టపడతారని, ఎంతో చరిత్ర ఉన్న క్యాంపా పానీయాలను తిరిగి మార్కెట్లోకి తెస్తున్నందుకు సంతోషిస్తున్నామని రిలయన్స్ కన్సూమర్ ప్రొడక్ట్స్ లిమిటెడ్ ప్రతినిధి తెలిపారు. ఎఫ్ఎంసీజీ వ్యాపారానికి ఇది మరో సాహసోపేతమైన ముందడుగు అని పేర్కొన్నారు. ఈ శీతల పానీయాల పోర్ట్‌ఫోలియోను ఆంధ్రప్రదేశ్, తెలంగాణతో ప్రారంభించి దేశం అంతటా విస్తరించనున్నట్లు చెప్పారు. ఇదీ చదవండి: టాప్ సీక్రెట్ చెప్పిన గూగుల్ మాజీ వైస్ ప్రెసిడెంట్... ఇది ఉంటే జాబ్ పక్కా! -
ఎడతెగని క్యాంపా..గోల..!
సాక్షి, ముంబై: క్యాంపాకోలా భవన సముదాయంలో అక్రమంగా నిర్మించిన 140 ఫ్లాట్లకు మంచినీరు, గ్యాస్ కనెక్షన్లను నిలిపివేసేందుకు శుక్రవారం వచ్చిన అధికారులను క్యాంపాకోలా వాసులు గేటు బయటే నిలువరించారు. మూడు గంటల పాటు హైడ్రామా అనంతరం అధికారులు ఎటువంటి చర్యలు తీసుకోకుండానే వెనుదిరిగారు. దీంతో క్యాంపాకోలా వాసులు తాత్కాలికంగా ఊరట పొందగలిగారు. ఈ నేపథ్యంలో ముంబైతోపాటు రాష్ట్రవ్యాప్తంగా చర్చల్లోకెక్కిన వర్లీలోని క్యాంపాకోలా భవన సముదాయంలో శుక్రవారం ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు ఉద్రిక్త వాతావరణం నెలకొంది. సుప్రీం కోర్టు ఇచ్చిన గడువు పూర్తికావడంతో క్యాంపాకోలా అక్రమ కట్టడాలను తొలగించనున్నట్టు నోటీసులు బీఎంసీ జారీచేసిన సంగతి తెలిసిందే. దీంతో ఈ విషయంపై అందరి దృష్టి కేంద్రీకృతమైంది. తాము మంగళవారమే చర్యలు తీసుకుంటామని బీఎంసీ పేర్కొన్నప్పటికీ క్యాంపాకోలా నివాసి ఒకరు మరణించడంతో చర్యలను శుక్రవారానికి వాయిదా వేశారు. ఇలా ముందునుంచీ ప్రకటిస్తూ వచ్చిన ప్రకారం శుక్రవారం బీఎంసీ సిబ్బంది పోలీసు బలగాలతో గ్యాస్, విద్యుత్ కనెక్షన్లను తొలగించేందుకు ఉదయం సుమారు 11 గంటల ప్రాంతంలో క్యాంపాకోలా సొసైటీ వద్దకి చేరుకున్నారు. ఓవైపు పోలీసులు, మరోవైపు క్యాంపాకోలా వాసులతోపాటు మీడియా, ఇతర ప్రజలతో ఆ ప్రాంతంలో పెద్ద ఎత్తున రద్దీ కన్పించింది. అధికారులు వచ్చేసరికి క్యాంపాకోలా వాసులు కాంపౌండ్ గేటును మూసేసి అక్కడే బైఠాయించారు. దేవుళ్ల ఫొటోలు ఉంచి గేటు ముందు హోమాలు, యాగాలు చేశారు. ఇలా క్యాంపాకోలా వాసులనుంచి బీఎంసీ అధికారులకు తీవ్ర వ్యతిరేకత ఎదురైంది. బాధితుల నినాదాలతో పరిసరాాలు మారుమోగాయి. సుమారు మూడు గంటలపాటు ఆ ప్రాంతంలో హైడ్రామా నడిచింది. బీఎంసీ అధికారులు అక్కడి నుంచి వెనుదిరిగి వెళ్లేంతవరకు కాంపౌండ్ నివాసులు తమ ఆందోళనను కొనసాగిస్తూనే ఉన్నారు. క్యాంపాకోలా వాసుల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవ్వడంతో బీఎంసీ అధికారులు చివరికి వెనుదిరిగారు. మహాకూటమి మద్దతు... క్యాంపాకోలా నివాసులకు మహాకూటమి మద్దతుగా నిలిచింది. శివసేన, బీజేపీ, ఆర్‌పిఐకి చెందిన పలువురు కార్యకర్తలు ఘటన స్థలానికి చేరుకున్నారు. బీఎంసీ చర్యలకు వ్యతిరేకంగా నిరసన వ్యక్తం చేశారు. వీరిలో 12 మంది ఆర్పిఐ కార్యకర్తలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఉన్నతాధికారులతో చర్చించి నిర్ణయం తీసుకుంటాం... క్యాంపాకోలా వాసులపై చర్యలు నిలిపివేయలేదని బీఎంసీ అధికారులు పేర్కొన్నారు. ఘటన స్థలంలో చర్యలు చేపట్టేందుకు వచ్చిన అధికారులు మీడియాతో మాట్లాడుతూ ప్రస్తుతం వారికి నచ్చజెప్పే ప్రయత్నం చేశామని కాని వారు విన్పించుకోలేదని చెప్పారు. ఎట్టిపరిస్థితిల్లోనూ చర్యలు తీసుకోకతప్పదన్నారు. ఈ విషయం కాలనీవాసులకూ తెలుసని అయినప్పటికీ వ్యతిరేకిస్తున్నారని బీఎంసీ సిబ్బంది పేర్కొన్నారు. మరోవైపు ఈ విషయంపై ఉన్నతాధికారులతో చర్చించి మళ్లీ చర్యలు ఎప్పుడు చేపట్టనున్నదనే విషయంపై నిర్ణయం తీసుకోనున్నామన్నారు. 1986లో వెలుగులోకి... 1980 ప్రాంతంలో క్యాంపాకోలా భవన సముదాయాన్ని నిర్మించారు. అందులో అక్రమ అంతస్తులను నిర్మించినట్టు తెలుసుకున్న బిఎంసీ 1986లో బిల్డర్‌కు రూ. 6.60 లక్షల జరిమానా విధించింది. బిల్డర్ ఆ సొమ్ము చెల్లించిన అనంతరం మళ్లీ రూ. 11.20 లక్షలు జరిమానా చెల్లించాలని బీఎంసీ నోటీసులు జారీ చేసింది. ఇది జరిగిన 15 ఏళ్ల వరకు ఎలాంటి ఇబ్బంది రాలేదు. అయితే 2000 సంవత్సరంలో ఇక్కడ ఉండేందుకు వచ్చినవారు అధికారికంగా నీటి కనెక్షన్ల కోసం దరఖాస్తు చేసుకున్నారు. దీంతో మరోసారి బీఎంసీ ఈ విషయంపై దృష్టి సారించింది. అక్రమ ఫ్లాట్లపై చర్యలు తీసుకోనున్నట్టు నోటీసులు జారీచేసింది. ఈ నోటీసులపై క్యాంపాకోలా నివాసులు కోర్టును ఆశ్రయించారు. ముంబై హైకోర్టుతోపాటు సుప్రీం కోర్టులో కూడా క్యాంపాకోలా వాసులకు ఊరట లభించలేదు. వారికి వ్యతిరేకంగానే తీర్పువచ్చింది. 140 ఫ్లాట్లు అక్రమం..? క్యాంపాకోలా భవన సముదాయంలో మొత్తం ఏడు భవనాలున్నాయి. వీటిలో మొత్తం 35 అంతస్తులు అక్రమంగా నిర్మించారు. వీటిలోని 140 ఫ్లాట్లను కూల్చేసేందుకు గత ఏడాది 2013 నవంబర్‌లో బీఎంసీ యత్నించింది. అయితే అన్ని పార్టీలు ఈ విషయంపై వీరికి మద్దతుకు ముందుకువచ్చాయి. మానవతా దృక్పథంతో సుప్రీంకోర్టు కూడా వీరికి ఏడు నెలల గడువు ఇచ్చింది. అయితే ఆ గడువు మే 31వ తేదీతో ముగిసింది. దీంతో మళ్లీ క్యాంపాకోలాపై చర్యలు తీసుకునే ప్రక్రియను బీఎంిసీ ప్రారంభించింది. -
క్యాంపాకోలా వాసులకు లతా మంగేష్కర్ మద్దతు
ముంబై: కాంప్యాకోలా వాసులకు ప్రముఖ గాయకురాలు లతామంగేష్కర్ మద్దతు పలికారు. బిల్డర్లు చేసిన తప్పులకు సామాన్యులు శిక్ష అనుభవించాల్సి వస్తోందని ట్విటర్లో ఆవేదన వ్యక్తం చేశారు. సుప్రీంకోర్టు నిర్ణయంతో తమ ఫ్లాట్లను ఖాళీ చేస్తున్నవారికి అండగా నిలవాలని, వారిని శిక్షించవ ద్దంటూ రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు. ‘రాష్ట్ర ప్రభుత్వానికి ఒకే విషయం అడగాలనుకుంటున్నా.. సుప్రీంకోర్టు నిర్ణయంతో వందలాదిమంది పిల్లలు, పెద్దలు నిరాశ్రయులయ్యారు. తీవ్ర ఒత్తిడికి లోనైన ముగ్గురు ఇప్పటికే మృతిచెందారు కూడా. ఇది అన్యాయం. బిల్డర్లు చేసిన తప్పులకు సామాన్య జనాలు ఇబ్బందులు పడాల్సి వస్తోంది. వారి సమస్యను రాష్ట్ర ప్రభుత్వం పరిష్కరించాల’ని ట్విటర్లో పేర్కొన్నారు. దక్షిణ ముంబైలోని క్యాంపాకోలా హౌసింగ్ సొసైటీలో 1981 నుంచి 1989 మధ్య కాలంలో ఏడు భవనాలను నిర్మించారు. ఇక్కడ కేవలం ఆరు అంతస్తుల వరకు మాత్రమే నిర్మించే అనుమతి ఉన్నా బిల్డర్లు నిబంధనలను అతిక్రమించారు. మిడ్‌టౌన్ బిల్డింగ్‌లో 20 అంతస్తులు, ఆర్చిడ్ బిల్డింగ్‌లో 17 అంతస్తులు నిర్మించారు. ఇలా మొత్తం ఏడు భవనాల్లో అక్రమంగా 102 ఫ్లాట్లు ఉన్నాయి. వీరంతా ఖాళీ చేయాలని, అదనంగా ఉన్న అంతస్తులను కూల్చివేయాలని సుప్రీం కోర్టు ఆదేశాలు జారీ చేయడంతో వారంతా ఇతర ప్రాంతాలకు వెళ్లిపోతున్నారు. -
క్యాంపాకోలా బాధితుల పిటిషన్‌పై 6న విచారణ
న్యూఢిల్లీ: గతంలో ఇచ్చిన ఉత్తర్వును వెనక్కితీసుకోవాలని అభ్యర్థిస్తూ దేశ వాణిజ్య రాజధాని నగరంలోని క్యాంపాకోలా వాసులు పెట్టుకున్న పిటిషన్‌ను వచ్చే నెల ఆరో తేదీన సుప్రీంకోర్టు పరిశీలించనుంది. కాగా క్యాంపాకోలా భవనంలోని కొన్ని అంతస్తులను అక్రమంగా నిర్మించినప్పటికీ క్రమబద్ధీకరణ కోసం బిల్డర్లు.. బృహన్ముంబై మున్సిపల్ కార్పొరేషన్ (బీఎంసీ)కి జరిమానా చెల్లించారని సీనియర్ న్యాయవాది ముకుల్ రోహ్తగి మంగళవారం జస్టిస్ హెచ్.ఎల్.దత్తు దృష్టికి తీసుకొచ్చారు. దీంతో న్యాయమూర్తి ఈ పిటిషన్‌ను విచారణకు స్వీకరించారు. జరిమానాకు సంబంధించిన సమాచారాన్ని ఆర్టీఐ కింద దరఖాస్తు చేయడంతో అందుబాటులోకి వచ్చిందని అంతకుముందు రోహ్తగి కోర్టుకు తెలిపారు. గతంలో జరిగిన వాదనల సమయంలో అది అందుబాటులో లేదని ఆయన న్యాయమూర్తి దృష్టికి తీసుకొచ్చారు. కాగా క్యాంపాకోలా హౌసింగ్ సొసైటీ కాంప్లెక్సులో అనుమతి లేకుండా నిర్మించిన అంతస్తులను వచ్చే ఏడాది మే, 31వ తేదీలోగా కూల్చివేయాలంటూ ఈ ఏడాది నవంబర్, 19వ తేదీన సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చిన సంగతి విదితమే. -
అవధులు లేని ఆనందం
సాక్షి, ముంబై: కొద్దిరోజులుగా తీవ్ర ఆందోళనకు గురవుతున్న క్యాంపాకోలా భవన వాసులకు బుధవారం ఉపశమనం లభించింది. అనుమతి లేకుండా నిర్మించిన అంతస్తుల కూల్చివేతపై సుప్రీంకోర్టు బుధవారం స్టే ఇచ్చింది. 2014 మే 31 దాకా ఎటువంటి చర్యలు చేపట్టొద్దని తన ఉత్తర్వుల్లో పేర్కొంది. అక్రమ అంతస్తుల కూల్చివేతకు సంబంధించిన వార్తలను సుప్రీంకోర్టు సుమోటోగా స్వీకరించింది. బీఎంసీ తరఫున సీనియర్ న్యాయవాదులు ఫాలి. ఎస్. నారిమన్, పల్లవ్ సిసోడియాలు తమ తమ వాదనలను వినిపించారు. ఆ తర్వాత అటార్నీ జనరల్ వాహనవతి కూడా తన వాదనను సుప్రీంకోర్టు దృష్టికి తీసుకొచ్చారు. వీరి వాదనలను ఆలకించిన సుప్రీంకోర్టు న్యాయమూర్తి జి.ఎస్. సంఘ్వి నేతృ త్వంలోని ధర్మాసనం స్టే విధించడంతోపాటు క్యాంపాకోలా వాసులకు ప్రత్యామ్నాయ ఏర్పాట్లపై వివరణ ఇవ్వాలంటూ బిల్డర్, రాష్ట్ర ప్రభుత్వంతోపాటు నగరపాలక సంస్థను అత్యున్న త న్యాయస్థానం ఆదేశించింది. కాగా 1981-89 మధ్యకాలంలో నిర్మించిన క్యాంపాకోలా హౌసింగ్ కాలనీలో ఆరు అంతస్తుల నిర్మాణానికి మాత్రమే బృహన్ ముంబై మున్సిపల్ కార్పొరేషన్ (బీఎంసీ) అనుమతి ఇచ్చిన సంగతి విదితమే. కాగా జేసీబీతో ప్రధాన ద్వారం కూల్చిన అనంతరం పోలీసులు, క్యాంపాకోలా వాసుల మధ్య తోపులాటలు మరోవైపు మహిళల రోదనలతో బుధవారం ఉదయం ఆ పరిసర ప్రాంతాల్లో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. క్యాంపాకోలా వాసులు బీఎంసీ అధికారులను లోపలికి రాకుండా అడ్డుకునేందుకు ప్రధాన ద్వారాన్ని పూర్తిగా మూసివేయడమే కాకుండా కర్రలుకూడా కట్టారు. అంతేకాకుండా ఆయా ఫ్లాట్లలోని మహిళలు, యువతీ యువకులంతా వీధుల్లోకి వచ్చారు. ఉదయం 10.30 గంటల ప్రాంతంలో పోలీసులు, క్యాంపాకోలా వాసుల మధ్య తోపులాట జరిగింది. దీంతో పోలీసులు అనేకమందిని అదుపులోకి తీసుకున్నారు. సుమారు 10.40 గంటల ప్రాంతంలో జే సీబీ సహాయంతో క్యాంపాకోలా భవన సముదాయ ప్రధాన ద్వారాన్ని బీఎంసీ అధికారులు నేలమట్టం చేశారు. దీంతో అనేకమంది మహిళలు ఏమి తప్పు చేశామని తమకు ఈ శిక్ష విధిస్తున్నారంటూ బోరున విలపించారు. అయితే సుప్రీంకోర్టు ఆదేశించినందువల్ల నేలమట్టం చేయక తప్పదంటూ బీఎంసీ అధికారులు లోపలికి చొచ్చుకువెళ్లారు. అదే సమయంలో ఒక్కసారిగా సీన్ మారిపోయింది. ఈ తతంగమంతా మీడియాద్వారా తిలకి ంచిన సుప్రీంకోర్టు ఈ కేసును సుమోటోగా స్వీకరించింది. అనుమతి లేకుండా నిర్మించిన అంతస్తుల కూల్చివేతపై 2014, మే 31 దాకా స్టే విధించింది. ఈ సమాచారం అందగానే బీఎంసీ సిబ్బంది పనులను నిలిపివేశారు. ఈ విషయం తెలుసుకున్న క్యాంపాకోలా వాసుల్లో ఒక్కసారిగా ఆనందం వెల్లివిరిసింది. కొద్దిసేపు భారీ హైడ్రామా క్యాంపాకోలా హౌసింగ్ కాలనీలో బుధవారం ఉదయం కొద్దిసేపు హైడ్రామా నడిచింది. అక్రమ అంతస్తుల కూల్చివేత కోసం వచ్చిన నగర పాలక సంస్థ అధికారులు పోలీసుల సహాయంతో కాంపౌండ్ లోపలికి ప్రవేశించేందుకు యత్నిం చారు. దీంతో తీవ్ర ఆగ్రహానికి లోనైన బాధిత కుటుంబాలు పోలీసు బలగాలతో వాగ్వాదానికి దిగాయి. ఎంతసేపటికీ వినకపోవడంతో రంగంలోకి దిగిన పోలీసులు క్యాంపాకోలా వాసులను అక్కడి నుంచి నెట్టివేశారు. మహిళల పట్ల దురుసుగా వ్యవహరించారు. దీంతో తీవ్ర ఆగ్రహానికి లోనైన మహిళలు పోలీసులపై మండిపడ్డారు. తామేమైనా ఉగ్రవాదులమా అంటూ పోలీసులను నిలదీశారు. నగరంలో 55 వేలకు పైగా అక్రమ నిర్మాణాలు ఉన్నాయని, వాటి సంగతి పట్టించుకోకుండా తమను బజారుకీడుస్తారా అంటూ నిలదీశారు. ‘ఆర్చిడ్’లో అనుమతి లేని అంతస్తుల కూల్చివేత కాగా ఆర్చిడ్ భవనంలో అనుమతి లేని అంతస్తులను బీఎంసీ సిబ్బంది బుధవారం ఉదయం కూల్చివేశారు. వాస్తవానికి 17 అంతస్తులకే నగరపాలక సంస్థ అనుమతి ఇచ్చింది. అయితే బిల్డర్ 20 అంతస్తులను నిర్మించాడు. దీంతో అనుమతి లేకుండా నిర్మించిన మూడు అంతస్తులను బీఎంసీ సిబ్బంది కూల్చేశారు. పోలీసుల తీరుపై సీఎంకి ఫిర్యాదు చేస్తా సుప్రీంకోర్టు స్టే ఉత్తర్వులు ఇవ్వడంపై కాంగ్రెస్ నాయకుడు, దక్షిణ ముంబై ఎంపీ మిలింద్ దేవరా హర్షం వ్యక్తం చేశారు. క్యాంపాకోలపట్ల పోలీసులు వ్యవహరించిన తీరుపై ముఖ్యమంత్రి పృథ్వీరాజ్ చవాన్‌కు ఫిర్యాదు చేస్తానని చెప్పారు. ఎంపీ మిలింద్ దేవరా అదే ప్రాంగణంలో మరో భవననిర్మాణం..? క్యాంపాకోలా భవన సముదాయంలోని ఖాళీ స్థలంలో మరో భవనం నిర్మించేందుకు ఆస్కారం ఉంది. ఇందుకు క్యాంపాకోలా వాసులంతా బాధిత కుటుంబాలకు ఆ స్థలంలో ఇళ్లు నిర్మించి ఇవ్వవచ్చు. ఈ విషయాన్ని బిల్డర్ సుప్రీంకోర్టుకు తెలియజేసే అవకాశముందని తెలిసింది.