న్యూఢిల్లీ: గతంలో ఇచ్చిన ఉత్తర్వును వెనక్కితీసుకోవాలని అభ్యర్థిస్తూ దేశ వాణిజ్య రాజధాని నగరంలోని క్యాంపాకోలా వాసులు పెట్టుకున్న పిటిషన్‌ను వచ్చే నెల ఆరో తేదీన సుప్రీంకోర్టు పరిశీలించనుంది. కాగా క్యాంపాకోలా భవనంలోని కొన్ని అంతస్తులను అక్రమంగా నిర్మించినప్పటికీ క్రమబద్ధీకరణ కోసం బిల్డర్లు.. బృహన్‌ముంబై మున్సిపల్ కార్పొరేషన్ (బీఎంసీ)కి జరిమానా చెల్లించారని సీనియర్ న్యాయవాది ముకుల్ రోహ్తగి మంగళవారం జస్టిస్ హెచ్.ఎల్.దత్తు దృష్టికి తీసుకొచ్చారు. దీంతో న్యాయమూర్తి ఈ పిటిషన్‌ను విచారణకు స్వీకరించారు.
జరిమానాకు సంబంధించిన సమాచారాన్ని ఆర్‌టీఐ కింద దరఖాస్తు చేయడంతో అందుబాటులోకి వచ్చిందని అంతకుముందు రోహ్తగి కోర్టుకు తెలిపారు. గతంలో జరిగిన వాదనల సమయంలో అది అందుబాటులో లేదని ఆయన న్యాయమూర్తి దృష్టికి తీసుకొచ్చారు. కాగా క్యాంపాకోలా హౌసింగ్ సొసైటీ కాంప్లెక్సులో అనుమతి లేకుండా నిర్మించిన అంతస్తులను వచ్చే ఏడాది మే, 31వ తేదీలోగా కూల్చివేయాలంటూ ఈ ఏడాది నవంబర్, 19వ తేదీన సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చిన సంగతి విదితమే.
క్యాంపాకోలా బాధితుల పిటిషన్‌పై 6న విచారణ
Published Wed, Dec 18 2013 12:05 AM | Last Updated on Thu, Oct 4 2018 4:27 PM
Advertisement