
ప్రముఖ ప్రభుత్వ రంగ సంస్థ బీహెచ్‌ఈఎల్ రూ.3,500 కోట్ల భారీ కాంట్రాక్ట్‌ను దక్కించుకుంది. ఛత్తీస్‌గఢ్‌లోని రాయ్‌పూర్‌లో 1,600 మెగావాట్ల థర్మల్ పవర్ ప్లాంట్ (టీపీపీ) ఏర్పాటు కోసం అదానీ పవర్ నుండి రూ. 3,500 కోట్ల ఆర్డర్‌ను అందుకున్నట్లు బీహెచ్‌ఈఎల్ తెలిపింది.
ఛత్తీస్‌గఢ్‌లోని రాయ్‌పూర్‌లో 2x800 మెగావాట్ల టీపీపీని ఏర్పాటు చేసేందుకు అదానీ పవర్ లిమిటెడ్ (ఏపీఎల్) నుంచి బీహెచ్‌ఈఎల్ ఆర్డర్ దక్కించుకున్నట్లు బీహెచ్‌ఈఎల్ స్టాక్ ఎక్స్ఛేంజ్ ఫైలింగ్‌లో పేర్కొంది.
ఈ సందర్భంగా బీహెచ్‌ఈఎల్ సంస్థ తిరుచ్చి, హరిద్వార్ ప్లాంట్లలో బాయిలర్, టర్బైన్ జనరేటర్‌లను తయారు చేయనున్నట్లు వెల్లడించింది. కాగా, అదానీ-బీహెచ్‌ఈఎల్ మధ్య కుదిరిన ఒప్పందంతో జూన్ 5న బీహెచ్ఈఎల్ షేర్లు 3 శాతం లాభంతో రూ.253.85 వద్ద ముగియగా, అదానీ పవర్ షేర్లు రూ.723 వద్ద స్థిరపడ్డాయి.