
న్యూఢిల్లీ: ప్రభుత్వ రంగ ఇంజినీరింగ్ సంస్థ బీహెచ్‌ఈఎల్ చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్‌గా నలిన్ షింగల్ నియమితులయ్యారు. ఈనెల ఒకటో తేదీ నుంచి ఐదేళ్లు ఈయన పదవీకాలం ఉండనుందని కంపెనీ ప్రకటించింది. ఉద్యోగ విరమణ, తదుపరి ఆదేశాలకు లోబడి పదవీకాలం ఉంటుందని స్టాక్ ఎక్సే్ఛంజీలకు ఇచ్చిన సమాచారంలో వివరించింది.