
భెల్ సీఎండీ పదవీకాలం పొడిగింపు
బీహెచ్‌ఈఎల్ సీఎండీ బి. ప్రసాదరావు పదవీ కాలాన్ని ప్రభుత్వం రెండేళ్ల పాటు పొడిగించనున్నది. 2009, అక్టోబర్ 1న భెల్ సీఎండీగా బాధ్యతలు స్వీకరించిన ప్రసాదరావు మంగళవారం పదవీ విరమణ చేయనున్నారు.
న్యూఢిల్లీ: బీహెచ్‌ఈఎల్ సీఎండీ బి. ప్రసాదరావు పదవీ కాలాన్ని ప్రభుత్వం రెండేళ్ల పాటు పొడిగించనున్నది. 2009, అక్టోబర్ 1న భెల్ సీఎండీగా బాధ్యతలు స్వీకరించిన ప్రసాదరావు మంగళవారం పదవీ విరమణ చేయనున్నారు. ఆయన పదవీ కాలాన్ని రెండేళ్ళపాటు పొడిగించాలని ప్రధాని కార్యాలయం(పీఎంవో) నియమించిన కార్యదర్శుల కమిటీ సోమవారం సూచించింది. కాగా ప్రసాదరావు వారసుడిగా ప్రస్తుతం భెల్ ఈడీగా పనిచేస్తున్న ప్రకాశ్ చాంద్‌ను పీఎస్‌ఈబీ ఎంపిక చేసింది. అయితే ఆయనకు బోర్డ్ స్థాయి అనుభవం లేదని, నిర్ణయాధికారం కొనసాగించాల్సిన అవసరం ఉండటంతో ప్రసాద రావు పదవీకాలాన్ని పొడిగించాలని కార్యదర్శుల కమిటీ భావించినట్లు సమాచారం.