Sudhir Vasudeva
-
భెల్ సీఎండీ పదవీకాలం పొడిగింపు
న్యూఢిల్లీ: బీహెచ్ఈఎల్ సీఎండీ బి. ప్రసాదరావు పదవీ కాలాన్ని ప్రభుత్వం రెండేళ్ల పాటు పొడిగించనున్నది. 2009, అక్టోబర్ 1న భెల్ సీఎండీగా బాధ్యతలు స్వీకరించిన ప్రసాదరావు మంగళవారం పదవీ విరమణ చేయనున్నారు. ఆయన పదవీ కాలాన్ని రెండేళ్ళపాటు పొడిగించాలని ప్రధాని కార్యాలయం(పీఎంవో) నియమించిన కార్యదర్శుల కమిటీ సోమవారం సూచించింది. కాగా ప్రసాదరావు వారసుడిగా ప్రస్తుతం భెల్ ఈడీగా పనిచేస్తున్న ప్రకాశ్ చాంద్‌ను పీఎస్ఈబీ ఎంపిక చేసింది. అయితే ఆయనకు బోర్డ్ స్థాయి అనుభవం లేదని, నిర్ణయాధికారం కొనసాగించాల్సిన అవసరం ఉండటంతో ప్రసాద రావు పదవీకాలాన్ని పొడిగించాలని కార్యదర్శుల కమిటీ భావించినట్లు సమాచారం. -
ఓఎన్జీసీ చైర్మన్ వాసుదేవకు స్కోప్ అవార్డు
న్యూఢిల్లీ: ఓఎన్జీసీ చైర్మన్ సుధీర్ వాసుదేవకు స్కోప్ ఇండివిడ్యువల్ లీడర్షిప్ అవార్డు లభించింది. ప్రభుత్వరంగ సంస్థల పనితీరు ఆధారంగా స్కోప్ సంస్థ అవార్డులనందిస్తోంది. మహారత్న/నవరత్న పీఎస్‌యూల కేటగిరిలో వ్యక్తిగత నాయకత్వం కింద స్కోప్ ఎక్స్‌లెన్స్ అవార్డు సుధీర్ వాసుదేవకు లభించింది. మినీరత్న కేటగిరిలో ఈ అవార్డు ఇంజినీర్స్ ఇండియా హెడ్ ఏ.కె. పుర్వహ ఎంపికయ్యారు. లాభాలార్జిస్తున్న ఇతర పీఎస్‌యూల కేటగిరిలో ఈ అవార్డు జాతీయ బలహీనవర్గాల ఆర్థిక, అభివృద్ధి కార్పొరేషన్ ఎండీ ఏ.ఏ. నఖ్వీకి లభించింది. పీఎస్‌యూల్లో అద్వితీయ ప్రతిభ కనబరిచిన మహిళా మేనేజర్ అవార్డ్ కంటైనర్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియాలో గ్రూప్ జనరల్ మేనేజర్‌గా పనిచేస్తున్న నీరుకు లభించింది. -
2014 నుంచి షేల్ గ్యాస్ ఉత్పత్తి: ఓఎన్జీసీ
న్యూఢిల్లీ: ఓఎన్జీసీ కంపెనీ వాణిజ్యపరంగా షేల్ గ్యాస్ ఉత్పత్తిని వచ్చే ఏడాది ప్రారంభించనున్నది. ఈ ఏడాది 10 బావులను డ్రిల్ చేయాలని యోచిస్తున్నామని, వచ్చే ఏడాది నుంచి వాణిజ్యపరంగా ఉత్పత్తిని చేపట్టే అవకాశాలున్నాయని ఓఎన్జీసీ చైర్మన్ సుధీర్ వాసుదేవ శుక్రవారం చెప్పారు. ఇండియన్ చాంబర్ ఆఫ్ కామర్స్(ఐసీసీ) నిర్వహించిన ఇండియా ఆయిల్ అండ్ గ్యాస్ సమ్మిట్‌లో ఆయన మాట్లాడారు. నామినేషన్ ప్రాతిపదికన ఓఎన్జీసీ, ఆయిల్ ఇండియాలకు కేటాయించిన బ్లాకుల్లో షేల్ గ్యాస్ ఉత్పత్తికి ఆర్థిక వ్యవహారాల కేబినెట్ కమిటీ(సీసీఈఏ) ఇటీవలనే అనుమతించిన విషయం తెలిసిందే. ఈ నెలలోనే గుజరాత్లో షేల్‌గ్యాస్ ఉత్పత్తిని ప్రారంభించాలనుకుంటున్నామని, దీని కోసం కొనాకొ ఫిలిప్స్ సంస్థ నుంచి సాంకేతిక సహకారాన్ని తీసుకుంటున్నామని వాసుదేవ వివరించారు. గుజరాత్‌లోని కాంబే బేసిన్లో తొలి షేల్ గ్యాస్ బావిని ఈ సంస్థే డ్రిల్లింగ్ చేస్తోంది.