భెల్ లాభం రూ. 456 కోట్లు | BHEL posts Rs 456 cr profit for Jul-Sept quarter | Sakshi
Sakshi News home page

భెల్ లాభం రూ. 456 కోట్లు

Published Thu, Nov 7 2013 2:50 AM | Last Updated on Sat, Sep 2 2017 12:20 AM

BHEL posts Rs 456 cr profit for Jul-Sept quarter

 న్యూఢిల్లీ: ప్రభుత్వరంగ దిగ్గజం ‘భెల్’ సెప్టెం బర్‌తో ముగిసిన మూడు నెలల కాలంలో రూ. 455.95 కోట్ల నికర లాభం ఆర్జించింది. అంతక్రితం ఏడాది సెప్టెంబర్ క్వార్టర్లో రూ.1,274.45 కోట్ల లాభం ఆర్జించింది. ఒకప్పటి భారత్ హెవీ ప్లేట్ అండ్ వెస్సల్స్ లిమిటెడ్‌ను హెచ్‌పీవీపీగా పేరు మార్చి ‘భెల్’లో విలీనం చేసినందున 2013-14 సెప్టెంబర్ త్రైమాసికం ఫలితాలను అంతకుముందు ఫలితాలతో పోల్చలేమని కంపెనీ బుధవారం ఒక ప్రకటనలో తెలిపింది. క్యూ-2లో మొత్తం ఆదాయం 10,692 కోట్ల నుంచి రూ.9,482 కోట్లకు తగ్గింది. సెప్టెంబర్ చివరినాటికి కంపెనీ వద్ద రూ.1,02,300 కోట్ల విలువైన ఆర్డర్లు ఉన్నాయి. బుధవారం బీఎస్‌ఈలో కంపెనీ షేర్లు దాదాపు 2% తగ్గి రూ.140.45 వద్ద ముగిసాయి.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement