
నోయిడా: అవసరం అన్నీ నేర్పిస్తుందంటారు. ఈ భారీ స్ప్రేయర్ కూడా అలాంటిదే. ఇది కరోనా స్పెషల్. తక్కువ సమయంలో ఎక్కువ భాగంలో రసాయనాలు స్ప్రే చేయడానికి భారత్ హెవీ ఎలక్ట్రికల్ లిమిటెడ్ (భెల్).. నాలుగే నాలుగు రోజుల్లో దీన్ని డిజైన్, ఉత్పత్తి పూర్తి చేసింది. దీని పేరు భెల్‌మిస్టర్.. రసాయనాలు వ్యర్థం కాకుండా వాటిని అతి సూక్ష్మ బిందువుల రూపంలో మార్చి ముఫ్పై అడుగుల దూరం వరకూ వెదజల్లుతుంది. ఈ భెల్‌మిస్టర్ ద్వారా వాహనాలపై రసాయనాలను స్ప్రే చేస్తారు. ఇప్పుడు దేశంలోని పలు రాష్ట్రాల్లో దీన్ని వాడుతున్నారు.
(భెల్‌మిస్టర్ మిషన్తో కరోనా నియంత్రణ)
Comments
Please login to add a commentAdd a comment