BHEL Recruitment 2021 For Engineers: Trainee Engineer Vacancy In BHEL Recruitment 2021 - Sakshi
Sakshi News home page

బెల్‌లో 16 ట్రెయినీ ఇంజనీర్‌ పోస్టులు

Published Wed, Feb 10 2021 2:27 PM | Last Updated on Wed, Feb 10 2021 3:02 PM

BHEL Recruitment 2021: Trainee Engineer Posts in Bengaluru - Sakshi

బెంగళూరులోని భారత ప్రభుత్వ రక్షణ మంత్రిత్వశాఖకు చెందిన  భారత్‌ ఎలక్ట్రానిక్స్‌ లిమిటెడ్‌(బెల్‌).. ఒప్పంద ప్రాతిపదికన ట్రెయినీ ఇంజనీర్‌ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

»    మొత్తం పోస్టుల సంఖ్య: 16
»    పోస్టుల వివరాలు: ట్రెయినీ ఇంజనీర్‌ (సివిల్‌) –10, ట్రెయినీ ఇంజనీర్‌(ఎలక్ట్రికల్‌) –06.

ట్రెయినీ ఇంజనీర్‌(సివిల్‌): 
»    అర్హత: సివిల్‌ సబ్జెక్టుల్లో ఫుల్‌ టైం బీఈ/ బీటెక్‌ డిగ్రీ ఉత్తీర్ణులవ్వాలి. సంబంధిత పనిలో కనీసం 6 నెలల అనుభవం ఉండాలి.
»    వయసు: 01.01.2021 నాటికి 25ఏళ్లు మించకూడదు. ఎస్సీ/ఎస్టీలకు ఐదేళ్లు, ఓబీసీలకు మూడేళ్లు, పీడబ్ల్యూడీ అభ్యర్థులకు పదేళ్లు గరిష్ట వయసులో సడలింపు ఉంటుంది.
»    వేతనం: మొదటి ఏడాది నెలకు రూ.25,000, రెండో ఏడాది–రూ.28,000, మూడో ఏడాది–రూ.31,000 చెల్లిస్తారు.

ట్రెయినీ ఇంజనీర్‌(ఎలక్ట్రికల్‌):
»    అర్హత: ఎలక్ట్రికల్‌ సబ్జెక్టుల్లో ఫుల్‌ టైం బీఈ/ బీటెక్‌ డిగ్రీ ఉత్తీర్ణులవ్వాలి. సంబంధిత పనిలో కనీసం 6 నెలల అనుభవం ఉండాలి.
»    వయసు: 01.01.2021 నాటికి 25 ఏళ్లు మించకూడదు. ఎస్సీ/ ఎస్టీలకు ఐదేళ్లు, ఓబీసీలకు మూడేళ్లు, పీడబ్ల్యూడీ అభ్యర్థులకు పదేళ్లు గరిష్ట వయసులో సడలింపు ఉంటుంది.
»    వేతనం: మొదటి ఏడాది నెలకు రూ.25,000, రెండో ఏడాది–రూ.28000, మూడో ఏడాది–రూ.31,000 చెల్లిస్తారు.
»    పని ప్రదేశాలు: ఏఆర్‌కోణం, వైజాగ్, కొచ్చి, పోర్ట్‌బ్లెయిర్, గోవా, ముంబై.
»    ఎంపిక విధానం: బీఈ/బీటెక్‌ మార్కులు, గత అనుభవం, ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక ప్రక్రియ ఉంటుంది. వివిధ విభాగాలకు కింద సూచించిన విధంగా వెయిటేజ్‌ ఉంటుంది. –బీఈ/బీటెక్‌ మార్కులకు75శాతం; –పోస్టు క్వాలిఫికేషన్‌ అనుభవానికి 10శాతం; ఇంటర్వ్యూకు 15శాతం వెయిటేజీ ఉంటుంది. ఇంటర్వ్యూకి ఎంపికైన అభ్యర్థుల వివరాలు వెబ్‌సైట్‌లో పొందుపరుస్తారు. 
»    దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి. 
»    ఆన్‌లైన్‌ దరఖాస్తులకు చివరి తేది: 16.02.2021
»    వెబ్‌సైట్‌: https://careers.bhel.in/bhel/jsp/

బీహెచ్‌ఈఎల్ భోపాల్‌లో 300 అప్రెంటిస్‌ ఖాళీలు
భోపాల్‌లోని భారత ప్రభుత్వరంగ సంస్థ భారత్‌ హెవీ ఎలక్ట్రికల్‌ లిమిటెడ్‌ (బీహెచ్‌ఈఎల్‌).. 2021–2022 విద్యా సంవత్సరానికి సంబంధించి అప్రెంటిస్‌ ఖాళీల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
»    మొత్తం పోస్టుల సంఖ్య: 300
»    ట్రేడుల వారీగా ఖాళీలు: ఎలక్ట్రీషియన్‌–80, ఫిట్టర్‌–80, మెషినిస్ట్‌ కంపోజిట్‌–30, వెల్డర్‌(గ్యాస్‌–ఎలక్ట్రిక్‌)–20, టర్నర్‌–20, కంప్యూటర్‌(కోపా/పాసా)–30, డ్రాఫ్ట్‌మెన్‌ (మెకానిక్‌)–05, ఎలక్ట్రిక్‌ మెకానిక్‌–05, మెకానికల్‌ మోటార్‌ వెహికిల్‌–05, మెషినిస్ట్‌(గ్రైండర్‌)–05, మాసన్‌–05, పెయింటర్‌(జనరల్‌)–05, కార్పెంటర్‌–05, ప్లంబర్‌–05.
»    అర్హత: పదో తరగతితోపాటు సంబంధిత ట్రేడుల్లో ఐటీఐ ఉత్తీర్ణులవ్వాలి.
»    వయసు: 14–27ఏళ్ల మధ్య ఉండాలి. నిబంధనల ప్రకారం–బీసీ/ఎస్సీ/ఎస్టీ/ పీడబ్ల్యూడీ అభ్యర్థులకు గరిష్ట వయసులో  సడలింపు ఉంటుంది.
»    దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌/ఆఫ్‌లైన్‌ ద్వారా 
»    ఆన్‌లైన్‌ దరఖాస్తులకు చివరి తేది: 22.02.2021
»    దరఖాస్తు హార్డ్‌కాపీలను పంపడానికి చివరి తేది: 01.03.2021. » చిరునామా: బీహెచ్‌ఈఎల్, భోపాల్‌ (మధ్యప్రదేశ్‌)– 462022.
»   వెబ్‌సైట్‌: https://bpl.bhel.com/bplweb_new/careers/index.html

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement