apprenticeship
-
రాహుల్ ‘యువ న్యాయ్’
జైపూర్: సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తున్న వేళ కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ పలు నూతన హామీలను ప్రకటించారు. గురువారం భారత్ జోడో న్యాయ్ యాత్ర మధ్యప్రదేశ్‌లో పూర్తిచేసుకుని రాజస్థాన్‌లో అడుగుపెట్టిన సందర్భంగా బాంసవాడా పట్టణంలో ఏర్పాటుచేసిన సభలో రాహుల్ హామీల జల్లు కురిపించారు. ‘‘మేం అధికారంలోకి వస్తే కేంద్ర ప్రభుత్వంలో ఖాళీగా ఉన్న 30 లక్షల ఉద్యోగాలను మొట్టమొదట భర్తీచేస్తాం. డిగ్రీ, డిప్లొమా చేసి ఖాళీగా ఉన్న పాతికేళ్లలోపు యువతకు అప్రెంటిస్‌షిప్ కింద శిక్షణ ఇప్పించి ప్రభుత్వ, ప్రైవేట్ ఉద్యోగాలు వచ్చేలా చూస్తాం. అప్రెంటిస్ కాలంలో వారికి సంవత్సరానికి రూ.1 లక్ష స్టైపండ్ అందిస్తాం. ప్రభుత్వ ఉద్యోగాల ప్రవేశ పరీక్షా పేపర్ల లీకేజీ ఉదంతాలు పునరావృతంకాకుండా కఠిన చట్టం తీసుకొస్తాం. తాత్కాలిక ఉద్యోగాలు చేసుకునే గిగ్ వర్కర్లకు సామాజిక భద్రత కల్పిస్తాం. యువత ఏర్పాటుచేసే అంకుర సంస్థల తోడ్పాటు కోసం రూ.5,000 కోట్లతో ప్రత్యేక నిధిని ఏర్పాటుచేస్తాం’’ అని రాహుల్ అన్నారు. యువతకు ఇచ్చిన ఈ ఐదు హామీలకు రాహుల్ ‘యువ న్యాయ్’గా అభివరి్ణంచారు. ‘‘ డ్రైవర్, గార్డ్, డెలివరీ బాయ్ ఉద్యోగాలు చేసే గిగ్ వర్కర్లకు సామాజిక భద్రత కలి్పస్తూ రాజస్థాన్‌లో ఇప్పటికే చట్టం తెచ్చారు. ఇదే తరహా చట్టాన్ని దేశమంతటా అమలుచేస్తాం. ఔట్సోర్సింగ్ విధానానికి స్వస్తిపలికి ప్రభుత్వ రిక్రూట్మెంట్ పరీక్ష విధానంలో ప్రమాణాలను పటిష్టంచేస్తాం. లీకేజీలకు తావులేకుండా కఠిన చట్టం తెస్తాం’ అని అన్నారు. ‘‘ ఢిల్లీ చలో ఉద్యమబాటలో పయనిస్తున్న రైతాంగానికి మేలు చేకూర్చేలా పంటల కనీస మద్దతు ధరకు చట్టబద్ధత కల్పిస్తాం. కులగణన చేపడతాం’’ అని రాహుల్ అన్నారు. డబుల్ ఇంజిన్ ప్రభుత్వాల నుంచి న్యాయం కోరడం కూడా నేరమేనని ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్‌లో మహిళల రేప్, ఆత్మహత్యలను ప్రస్తావిస్తూ రాహుల్ విమర్శించారు. -
టెక్ కంపెనీల్లో కొత్త ఉద్యోగాలు వారికే..
కొంతకాలంగా ఐటీ కంపెనీల్లో అనిశ్చిత పరిస్థితులు నెలకొంటున్నాయి. రష్యా-ఉక్రెయిన్, హమాస్-ఇజ్రాయెల్ యుద్ధ భయాలు, అమెరికాలో ఫెడ్ వడ్డీరేట్లు పెంచడం.. వంటి వాటితో అంతర్జాతీయ సంస్థలు వాటి సాఫ్ట్వేర్ అప్డేట్లు, కొత్త ఫీచర్లపై చేసే ఖర్చు తగ్గిస్తున్నాయి. దాంతో ఐటీ కంపెనీలు కాస్ట్‌కటింగ్ పేరుతో ఉద్యోగుల్లో కోత విధిస్తున్నాయి. ఆ రంగంలో చదువు పూర్తి చేసుకున్న యువతకు, వారికి వివిధ కంపెనీల్లో ఉంటున్న ఖాళీలకు భారీ వ్యత్యాసం ఏర్పడింది. కొన్ని కంపెనీలు నియామకాలను తాత్కాలికంగా నిలిపివేశాయి. దేశంలోని అనేక టెక్ కంపెనీలకు ప్రస్తుతం ఆదాయాలు తగ్గటంతో ఖర్చులు తగ్గించుకోవడానికి మొగ్గు చూపుతున్నాయి. ఈ క్రమంలో ఐటీ ఇండస్ట్రీలో పూర్తి సమయం ఉద్యోగులకు బదులు ఎక్కువ మంది అప్రెంటీస్లను నియమించుకునే దిశగా ఆలోచిస్తున్నట్లు తెలుస్తోంది. అప్రెంటీస్ స్కిల్ ట్రెండ్స్ రిపోర్ట్ నివేదిక ప్రకారం.. ఐటీ/ ఐటీఈఎస్ కంపెనీలు ఫుల్‌టైమ్ ఉద్యోగుల బదులుగా అప్రెంటిస్‌లను నియమించుకోవాలని యోచిస్తున్నాయి. అప్రెంటిస్ ఉద్యోగుల సంఖ్య వార్షికంగా 250 శాతానికి పైగా పెరిగినట్లు తాజా నివేదిక వెల్లడించింది. ఐటీ/ ఐటీఈఎస్ పరిశ్రమల్లోని దాదాపు 79 శాతం కంపెనీల మేనేజ్మెంట్ రాబోయే రోజుల్లో అప్రెంటిస్‌ల సంఖ్య పెంచనుందని అంచనా. అప్పుడే చదువు పూర్తై ఉద్యోగ వేటలో పడిన ప్రతిభావంతులైన ఉద్యోగార్థులకు అవకాశం కల్పించాలని కంపెనీలు భావిస్తున్నాయి. వారు ప్రారంభంలో కొంత తక్కువ జీతానికి పనిచేస్తారు. ఎలాగూ శిక్షణ ఇస్తారు కాబట్టి కొంత ప్రాజెక్ట్ ఆలస్యం అవుతుందనిపిస్తే ఎక్కువ సేపు పనిచేసేలా ప్రోత్సహిస్తారు. గత సంవత్సర కాలంలో ఈ ట్రెండ్ మెట్రో, టైర్-2 నగరాల్లో ఈ నియామకాలు గణనీయంగా పెరిగాయి. బ్యాంకింగ్ అండ్ ఫైనాన్షియల్ రంగంలో సైతం ఇదే జోరు కొనసాగుతోంది. ఈ కంపెనీలు అప్రెంటిస్ పూర్తైన వారిలో 75 శాతం మందిని పూర్తి స్థాయి ఉద్యోగులుగా మార్చాయి. 2023లో కోయంబత్తూర్, హైదరాబాద్, పుణె వంటి నగరాలు అప్రెంటిస్ నియామకానికి మార్గం సుగమం చేశాయి. టైర్-2 నగరంగా ఉన్న కోయంబత్తూర్ అంతటా అప్రెంటిస్‌షిప్ విధానం అధికం అవుతోంది. బెంగళూరు, చెన్నై, దిల్లీ, ముంబై, అహ్మదాబాద్ వంటి ఇతర మెట్రో నగరాలు అప్రెంటిస్ నియామకంలో దూకుడు పెంచాయి. రాష్ట్రాల పరంగా గుజరాత్, మహారాష్ట్ర, హరియాణా, ఉత్తర్‌ప్రదేశ్, తమిళనాడు, కర్ణాటక, తెలంగాణ అప్రెంటిస్‌షిప్ ఎంగేజ్మెంట్ చార్ట్‌లో అగ్రస్థానంలో కొనసాగుతున్నాయి. ఇదీ చదవండి: తప్పుమీద తప్పుచేస్తూ.. వేలకోట్ల సామ్రాజ్యం నాశనం.. ప్రస్తుతం అప్రెంటిస్‌లుగా ఉన్న 9 లక్షల మందికి పైగా యువత 23-26 ఏళ్ల మధ్య వయసు వారే. వీరికి రూ.11 వేలు నుంచి రూ.75 వేల వరకు చెల్లిస్తున్నారు. విద్యార్హతలను బట్టి ఇతర రంగాల్లో చెల్లించే స్టైపెండ్‌లో మార్పులు ఉన్నాయి. -
అప్రెంటిస్ జాబ్స్‌కు అనువుగా ఐటీ హబ్స్
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ఐటీ, సాంకేతిక పరిశ్రమలకు కేంద్రాలుగా ఉన్న హైదరాబాద్, ఢిల్లీ, బెంగళూరు నగరాలు అప్రెంటీస్‌ల నియామకం విషయంలో అత్యంత ఆశాజనక ప్రదేశాలుగా అవతరించాయి. టీమ్‌లీజ్ అప్రెంటిస్‌షిప్ ఔట్లుక్ నివేదిక ప్రకారం.. 14 నగరాల్లో 24 రంగాలకు చెందిన 597 కంపెనీలు ఇందులో పాలుపంచుకున్నాయి. 2022 జూలై–డిసెంబర్‌తో పోలిస్తే ఈ ఏడాది జనవరి–మార్చిలో అప్రెంటీస్‌ల నియామకాల కోసం ఆసక్తి 77 నుంచి 79 శాతానికి పెరిగింది. సర్వేలో పాల్గొన్న హైదరాబాద్ కంపెనీల్లో 83 శాతం అప్రెంటీస్‌ల నియామకాలను అధికం చేయాలని భావిస్తున్నాయి. ఢిల్లీ కంపెనీల్లో 82 శాతం, బెంగళూరులో 80, చెన్నై 81, ముంబై 77 శాతం కంపెనీలు ఆసక్తిగా ఉన్నాయి. మెట్రోయేతర నగరాలైన కోయంబత్తూరు 79 శాతం, నాగ్‌పూర్ 76, పుణే 76, అహ్మదాబాద్ 70 శాతం కంపెనీలు ఉత్సాహం కనబరిచాయి. వారి ప్రమేయమూ ఎక్కువే.. అప్రెంటీస్‌ల ప్రమేయం రంగాల వారీగా చూస్తే ఇంజనీరింగ్, ఇండస్ట్రియల్ కంపెనీల్లో 90 శాతం, ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్స్ 88, బ్యాంకింగ్, ఫైనాన్షియల్ సర్వీసెస్, ఇన్సూరెన్స్ 74 శాతం ఉంది. అప్రెంటీస్లను పెంచుకోవాలని ఇంజనీరింగ్, ఇండస్ట్రియల్ కంపెనీల్లో 94 శాతం, ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్స్ 93, బ్యాంకింగ్, ఫైనాన్షియల్ సర్వీసెస్, ఇన్సూరెన్స్ కంపెనీల్లో 85 శాతం ఆసక్తిగా ఉన్నాయి. 2023లో హైదరాబాద్, ఢిల్లీ, బెంగుళూరు వంటి నగరాల్లో నిరంతర వృద్ధితో దేశంలో అప్రెంటిస్‌షిప్ పట్ల ఆశాజనక దృక్పథాన్ని చూస్తాం’ అని నివేదిక వివరించింది. అప్రెంటిస్‌షిప్‌లో భాగంగా వేతనంతో కూడిన ఉద్యోగంతోపాటు శిక్షణ ఉంటుంది. అప్రెంటీస్‌లు తమ పని గంటలలో కొంత సమయాన్ని తరగతి గది ఆధారిత అభ్యాసాన్ని కళాశాల, విశ్వవిద్యాలయం లేదా కంపెనీలో పూర్తి చేయాల్సి ఉంటుంది. పుష్కల అవకాశాలు.. హైదరాబాద్, ఢిల్లీ, బెంగుళూరు నగరాలు ఐటీ, సాంకేతిక పరిశ్రమలకు కేంద్రాలుగా, ఈ రంగం వృద్ధికి దోహదపడుతున్నప్పుడు.. పరిశ్రమ నిర్దిష్ట నైపుణ్యాలు, జ్ఞానాన్ని పొందేందుకు అప్రెంటీస్లకు పుష్కల అవకాశాలను అందిస్తాయని టీమ్‌లీజ్ డిగ్రీ అప్రెంటిస్‌షిప్ చీఫ్ బిజినెస్ ఆఫీసర్ సుమిత్ కుమార్ వ్యాఖ్యానించారు. ‘అప్రెంటిస్‌షిప్ కార్యక్రమాలు కంపెనీ యజమానులు, అప్రెంటీస్లకు విజయవంతమైన పరిష్కారంగా ఉద్భవించాయి. నిరుద్యోగాన్ని తగ్గించడం, జీవనోపాధిని మెరుగుపరచడం, నైపుణ్యాభివృద్ధి ద్వారా సామాజికంగా సాధికారత వైపు నడుపుతున్నారు. వ్యాపారాల ఉత్పాదకత, ఆవిష్కరణలు, పోటీతత్వాన్ని ఆర్థికంగా పెంచుతున్నారు’ అని అన్నారు. -
National Apprenticeship Mela 2023: 9న పీఎం అప్రెంటిస్‌షిప్ మేళా
సాక్షి, న్యూఢిల్లీ: స్కిల్ ఇండియా మిషన్‌లో భాగంగా యువతకు కెరీర్ అవకాశాలను పెంపొందించేందుకు ఈ నెల 9న దేశవ్యాప్తంగా 242 జిల్లాల్లో ప్రధానమంత్రి జాతీయ అప్రెంటిస్‌షిప్ మేళా నిర్వహించేందుకు కేంద్ర ప్రభుత్వం సిద్ధమైంది. స్కిల్ డెవలప్మెంట్ అండ్ ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో జరిగే ఈ అప్రెంటిస్‌షిప్ మేళాలో వివిధ సంస్థలు పాల్గొని యువతకు కొత్త నైపుణ్యాలు నేర్చుకొనేందుకు అవకాశాలు ఇవ్వనున్నాయి. ఈ అప్రెంటిస్‌షిప్ మేళాను తెలంగాణలోని 6 జిల్లాల్లో, ఆంధ్రప్రదేశ్‌లోని 9 జిల్లాల్లో నిర్వహించనున్నారు. ఎలా దరఖాస్తు చేసుకోవాలి.. అభ్యర్థులు తమ పేర్లను apprenticeshipindia.gov.in వెబ్సైట్లో నమోదు చేసుకోవాలి. తమకు దగ్గరగా ఎక్కడ మేళా నిర్వహిస్తున్నారో కూడా తెలుసుకోవచ్చు. నైపుణ్య శిక్షణ సర్టిఫికెట్లు కలిగి.. 5వ నుంచి 12వ తరగతి వరకు ఉత్తీర్ణులైన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. ఐటీఐ డిప్లొమా హోల్డర్లు, గ్రాడ్యుయేట్లు ఈ అప్రెంటిస్‌షిప్ మేళాలో పాల్గొనవచ్చు. ఏమేమీ కావాలి.. రెజ్యూమ్ మూడు కాపీలు మార్క్షీట్లు, సర్టిఫికెట్ మూడు కాపీలు ఫోటో ఐడీ (ఆధార్ కార్డ్ / డ్రైవింగ్ లైసెన్స్) మూడు పాస్‌పోర్ట్ సైజు ఫోటోలు ఎక్కడెక్కడంటే... తెలంగాణలోని మణుగూరు ప్రభుత్వ ఐటీఐ (భద్రాద్రి కొత్తగూడెం), ముషీరాబాద్ ప్రభుత్వ ఐటీఐ(హైదరాబాద్), భూపాలపల్లి ప్రభుత్వ ఐటీఐ(జయశంకర్ భూపాలపల్లి), పెద్దపల్లి ప్రభు త్వ ఐటీఐ(పెద్దపల్లి), అల్వాల్ ప్రభుత్వ ఐటీఐ(రంగారెడ్డి), భువనగిరి ప్రభుత్వ ఐటీఐ(యాదాద్రి భువనగిరి)ల్లో మేళా జరుగనుంది. ఆంధ్రప్రదేశ్ లోని అనంతపురం ప్రభుత్వ ఐటీఐ(బీ) (అనంతపురం), కాకినాడ ప్రభుత్వ ఐటీఐ (కాకినాడ), విజయవాడ ప్రభుత్వ ఐటీఐ(ఎన్టీఆర్ కృష్ణా), మాచర్ల ప్రభుత్వ రెసిడెన్షియల్ ఐటీఐ (పల్నాడు), ఒంగోలు ప్రభుత్వ ఐటీఐ(బీ) (ప్రకాశం), ఎచ్చెర్ల ప్రభుత్వ ఐటీఐ(శ్రీకాకుళం), తిరుపతి ప్రభుత్వ ఐటీఐ(తిరుపతి), విశాఖపట్టణం ప్రభుత్వ ఐటీఐ (ఓల్డ్) (విశాఖపట్టణం), కడప ప్రభుత్వ ఐటీఐ (వైఎస్సార్ కడప)ల్లో ప్రధానమంత్రి జాతీయ అప్రెంటిస్‌షిప్ మేళా నిర్వహించనున్నారు. (క్లిక్ చేయండి: విదేశీ వైద్య విద్యార్థులకు వెసులుబాటు) -
ఆలిమ్కో, కాన్పూర్‌లో 74 అప్రెంటిస్‌లు
కాన్పూర్‌లోని ఆర్టిఫిషియల్ లింబ్స్ మాన్యుఫ్యాక్చరింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా(అలిమ్కో).. వివిధ విభాగాల్లో అప్రెంటిస్ ఖాళీల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. ► మొత్తం ఖాళీల సంఖ్య: 74 ► ట్రేడులు: ఫిట్టర్, ఎలక్ట్రీషియన్, ఎలక్ట్రానిక్స్ మెకానిక్, కార్పెంటర్, మెషినిస్ట్, టర్నర్, ప్లంబర్ తదితరాలు. ► అర్హత: కనీసం 50 శాతం మార్కులతో పదో తరగతితోపాటు సంబంధిత ట్రేడుల్లో ఐటీఐ ఉత్తీర్ణులవ్వాలి. ► వయసు: 01.11.2021 నాటికి 18 నుంచి 25 ఏళ్ల మధ్య ఉండాలి. ► ఎంపిక విధానం: అర్హత పరీక్షలో(పదో తరగతి, ఐటీఐ) సాధించిన మెరిట్ మార్కుల ఆధారంగా ఎంపికచేస్తారు. ► దరఖాస్తు విధానం: ఆఫ్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. దరఖాస్తును అలిమ్కో, జీటీ రోడ్, కాన్పూర్–209217 చిరునామకు పంపించాలి. ► దరఖాస్తులకు చివరి తేది: 15.12.2021 ► వెబ్సైట్: alimco.in డీఆర్డీఓ–టీబీఆర్ఎల్, చండీగఢ్‌లో 61 ట్రేడ్ అప్రెంటిస్‌లు చండీగఢ్‌లోని డీఆర్డీఓ–టెర్మినల్ బాలిస్టిక్స్ రీసెర్చ్ ల్యాబొరేటరీ(టీబీఆర్ఎల్).. వివిధ ట్రేడుల్లో అప్రెంటిస్ ఖాళీల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. ► మొత్తం ఖాళీల సంఖ్య: 61 ► ట్రేడులు: డ్రాఫ్ట్స్‌మెన్(సివిల్), మెకానిక్ మెకట్రానిక్స్, ఇన్స్ట్రుమెంట్ మెకానిక్, ఆర్కిటెక్చర్ అసిస్టెంట్, హౌస్‌కీపర్, ఫిట్టర్, మెషినిస్ట్, టర్నర్, కార్పెంటర్, ఎలక్ట్రీషియన్, ఎలక్ట్రానిక్స్ మెకానిక్, కోపా తదితరాలు. (మరిన్ని ఉద్యోగ నోటిఫికేషన్ల కోసం ఇక్కడ క్లిక్ చేయండి) ► అర్హత: సంబంధిత ట్రేడుల్లో ఐటీఐ ఉత్తీర్ణులై ఉండాలి. ► ఎంపిక విధానం: మెరిట్ ప్రాతిపదికన ఎంపికచేస్తారు. ► దరఖాస్తు విధానం: ఈమెయిల్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. ► ఈమెయిల్: admintbrl@tbrl.drdo.in ► దరఖాస్తులకు చివరి తేది: 20.12.2021 ► వెబ్సైట్: drdo.gov.in ఫ్యాక్ట్, కేరళలో 98 ట్రేడ్ అప్రెంటిస్‌లు కేరళలోని ఫెర్టిలైజర్స్ అండ్ కెమికల్స్ ట్రావెన్కోర్ లిమిటెడ్(ఫ్యాక్ట్).. ట్రేడ్ అప్రెంటిస్ ఖాళీల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. ► మొత్తం ఖాళీల సంఖ్య: 98 ► విభాగాలు: ఫిట్టర్, మెషినిస్ట్, ప్లంబర్, కార్పెంటర్, పెయింటర్, మెకానిక్ తదితరాలు. ► అర్హత: కనీసం 60 శాతం మార్కులతో ఐటీఐ ఉత్తీర్ణులవ్వాలి. ► వయసు: 23 ఏళ్లు మించకూడదు. ► స్టయిపండ్: నెలకు రూ.7000 వరకు చెల్లిస్తారు. ► ట్రెయినింగ్ వ్యవధి: ఏడాది ► ఎంపిక విధానం: అకడమిక్ మెరిట్ ఆధారంగా తుది ఎంపిక ఉంటుంది. » దరఖాస్తు విధానం: ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. ► ఆన్లైన్ దరఖాస్తులకు చివరి తేది:18.12.2021 ► వెబ్సైట్: fact.co.in -
వైజాగ్ స్టీల్ ప్లాంట్‌లో 150 అప్రెంటిస్‌లు
విశాఖపట్నంలోని రాష్ట్రీయ ఇస్పాత్ నిగమ్ లిమిటెడ్(వైజాగ్ స్టీల్ ప్లాంట్).. వివిధ విభాగాల్లో అప్రెంటిస్ ఖాళీల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. ► మొత్తం ఖాళీల సంఖ్య: 150 ► ఖాళీల వివరాలు: డిప్లొమా అప్రెంటిస్‌లు–50, గ్రాడ్యుయేట్ అప్రెంటిస్‌లు–100. ► డిప్లొమా అప్రెంటిస్‌లు: విభాగాలు: మెకానికల్, ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్, ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్,కంప్యూటర్ సైన్స్, సివిల్. అర్హత: సంబంధిత సబ్జెక్టుల్లో డిప్లొమా ఇంజనీరింగ్/టెక్నాలజీ ఉత్తీర్ణులవ్వాలి. స్టయిపెండ్ నెలకు రూ.3542 చెల్లిస్తారు. ► గ్రాడ్యుయేట్ అప్రెంటిస్‌లు: విభాగాలు: మెకానికల్, ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్, ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్, కంప్యూటర్ సైన్స్/ఐటీ, మెటలర్జీ, ఇన్స్ట్రుమెంటేషన్, సివిల్, కెమికల్. అర్హత: సంబంధిత సబ్జెక్టుల్లో బీఈ/బీటెక్ ఉత్తీర్ణులవ్వాలి. స్టయిపెండ్ నెలకు రూ.4984 చెల్లిస్తారు. (మరిన్ని ఉద్యోగ నోటిఫికేషన్ల కోసం ఇక్కడ క్లిక్ చేయండి) ► 2019, 2020, 2021లో డిప్లొమా/ఇంజనీరింగ్ పూర్తిచేసిన వారు మాత్రమే దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. ► ఎంపిక విధానం: డిప్లొమా/ఇంజనీరింగ్‌లో సాధించిన మెరిట్ మార్కుల ఆధారంగా అభ్యర్థుల్ని షార్ట్‌లిస్ట్ చే స్తారు. షార్ట్‌లిస్ట్ చేసిన అభ్యర్థుల్ని పర్సనల్ ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపికచేస్తారు. ► దరఖాస్తు విధానం: ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. ► ఆన్లైన్ దరఖాస్తులకు చివరి తేది: 18.11.2021 ► వెబ్సైట్: www.vizagsteel.com -
సింగరేణిలో అప్రెంటిస్ ఖాళీలు.. త్వరపడండి
ప్రభుత్వరంగ సంస్థ,తెలంగాణలోని ది సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్(ఎస్సీసీఎల్)కి చెందిన మానవ వనరుల అభివృద్ధి విభాగం.. వివిధ ట్రేడుల్లో అప్రెంటిస్ ఖాళీల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. ► ట్రేడులు: ఎలక్ట్రీషియన్, ఫిట్టర్, టర్నర్స్, మెషినిస్ట్, మెకానికల్ మోటార్ వెహికల్, డ్రాఫ్ట్స్‌మెన్ సివిల్, డీజిల్ మెకానిక్స్, వెల్డర్స్. ► అర్హత: పదో తరగతి, సంబంధిత ట్రేడుల్లో ఐటీఐ ఉత్తీర్ణులై ఉండాలి. ఇంటర్మీడియెట్ ఒకేషనల్ విద్యార్థులు అర్హులు కాదు. ► వయసు: 28 ఏళ్లు మించకుండా ఉండాలి. ► స్టయిపెండ్: రెండేళ్ల ఐటీఐ అభ్యర్థులకు నెలకు రూ.8050, ఏడాది ఐటీఐ అభ్యర్థులకు నెలకు రూ.7700 చెల్లిస్తారు. ► లోకల్: అప్పటి ఆదిలాబాద్, కరీంనగర్, వరంగల్, ఖమ్మం(ప్రస్తుతం 16 జిల్లాలు) జిల్లాల అభ్యర్థుల్ని లోకల్‌గాను, మిగతా జిల్లాల అభ్యర్థుల్ని నాన్ లోకల్‌గాను పరిగణనలోకి తీసుకుంటారు. వీరికి 80:20 నిష్పత్తిలో అప్రెంటిస్ సీట్ల కేటాయింపు జరుగుతుంది. ► ఎంపిక విధానం: ఐటీఐ ఉత్తీర్ణత సీనియారిటీ ప్రాతిపదికన ఎంపిక ప్రక్రియ నిర్వహిస్తారు. ఒకవేళ చాలా మంది అభ్యర్థుల ఉత్తీర్ణత సంవత్సరం ఒకటే అయితే.. ఐటీఐలో సాధించిన మార్కుల మెరిట్ ఆధారంగా ఎంపిక చేస్తారు. ► దరఖాస్తు విధానం: ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. ► దరఖాస్తులకు చివరి తేది: 28.06.2021 ► వెబ్సైట్: https://scclmines.com/apprenticeship/olApplication.aspx మరిన్ని నోటిఫికేషన్లు: పవర్‌గ్రిడ్, ఎస్బీఐలో ఉద్యోగ అవకాశాలు ఇండియన్ నేవీలో ఎస్ఎస్సీ ఆఫీసర్ ఉద్యోగాలు -
బెల్లో 16 ట్రెయినీ ఇంజనీర్ పోస్టులు
బెంగళూరులోని భారత ప్రభుత్వ రక్షణ మంత్రిత్వశాఖకు చెందిన భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్(బెల్).. ఒప్పంద ప్రాతిపదికన ట్రెయినీ ఇంజనీర్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. » మొత్తం పోస్టుల సంఖ్య: 16 » పోస్టుల వివరాలు: ట్రెయినీ ఇంజనీర్ (సివిల్) –10, ట్రెయినీ ఇంజనీర్(ఎలక్ట్రికల్) –06. ట్రెయినీ ఇంజనీర్(సివిల్): » అర్హత: సివిల్ సబ్జెక్టుల్లో ఫుల్ టైం బీఈ/ బీటెక్ డిగ్రీ ఉత్తీర్ణులవ్వాలి. సంబంధిత పనిలో కనీసం 6 నెలల అనుభవం ఉండాలి. » వయసు: 01.01.2021 నాటికి 25ఏళ్లు మించకూడదు. ఎస్సీ/ఎస్టీలకు ఐదేళ్లు, ఓబీసీలకు మూడేళ్లు, పీడబ్ల్యూడీ అభ్యర్థులకు పదేళ్లు గరిష్ట వయసులో సడలింపు ఉంటుంది. » వేతనం: మొదటి ఏడాది నెలకు రూ.25,000, రెండో ఏడాది–రూ.28,000, మూడో ఏడాది–రూ.31,000 చెల్లిస్తారు. ట్రెయినీ ఇంజనీర్(ఎలక్ట్రికల్): » అర్హత: ఎలక్ట్రికల్ సబ్జెక్టుల్లో ఫుల్ టైం బీఈ/ బీటెక్ డిగ్రీ ఉత్తీర్ణులవ్వాలి. సంబంధిత పనిలో కనీసం 6 నెలల అనుభవం ఉండాలి. » వయసు: 01.01.2021 నాటికి 25 ఏళ్లు మించకూడదు. ఎస్సీ/ ఎస్టీలకు ఐదేళ్లు, ఓబీసీలకు మూడేళ్లు, పీడబ్ల్యూడీ అభ్యర్థులకు పదేళ్లు గరిష్ట వయసులో సడలింపు ఉంటుంది. » వేతనం: మొదటి ఏడాది నెలకు రూ.25,000, రెండో ఏడాది–రూ.28000, మూడో ఏడాది–రూ.31,000 చెల్లిస్తారు. » పని ప్రదేశాలు: ఏఆర్కోణం, వైజాగ్, కొచ్చి, పోర్ట్‌బ్లెయిర్, గోవా, ముంబై. » ఎంపిక విధానం: బీఈ/బీటెక్ మార్కులు, గత అనుభవం, ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక ప్రక్రియ ఉంటుంది. వివిధ విభాగాలకు కింద సూచించిన విధంగా వెయిటేజ్ ఉంటుంది. –బీఈ/బీటెక్ మార్కులకు75శాతం; –పోస్టు క్వాలిఫికేషన్ అనుభవానికి 10శాతం; ఇంటర్వ్యూకు 15శాతం వెయిటేజీ ఉంటుంది. ఇంటర్వ్యూకి ఎంపికైన అభ్యర్థుల వివరాలు వెబ్సైట్లో పొందుపరుస్తారు. » దరఖాస్తు విధానం: ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలి. » ఆన్లైన్ దరఖాస్తులకు చివరి తేది: 16.02.2021 » వెబ్సైట్: https://careers.bhel.in/bhel/jsp/ బీహెచ్ఈఎల్ భోపాల్‌లో 300 అప్రెంటిస్ ఖాళీలు భోపాల్‌లోని భారత ప్రభుత్వరంగ సంస్థ భారత్ హెవీ ఎలక్ట్రికల్ లిమిటెడ్ (బీహెచ్ఈఎల్).. 2021–2022 విద్యా సంవత్సరానికి సంబంధించి అప్రెంటిస్ ఖాళీల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. » మొత్తం పోస్టుల సంఖ్య: 300 » ట్రేడుల వారీగా ఖాళీలు: ఎలక్ట్రీషియన్–80, ఫిట్టర్–80, మెషినిస్ట్ కంపోజిట్–30, వెల్డర్(గ్యాస్–ఎలక్ట్రిక్)–20, టర్నర్–20, కంప్యూటర్(కోపా/పాసా)–30, డ్రాఫ్ట్‌మెన్ (మెకానిక్)–05, ఎలక్ట్రిక్ మెకానిక్–05, మెకానికల్ మోటార్ వెహికిల్–05, మెషినిస్ట్(గ్రైండర్)–05, మాసన్–05, పెయింటర్(జనరల్)–05, కార్పెంటర్–05, ప్లంబర్–05. » అర్హత: పదో తరగతితోపాటు సంబంధిత ట్రేడుల్లో ఐటీఐ ఉత్తీర్ణులవ్వాలి. » వయసు: 14–27ఏళ్ల మధ్య ఉండాలి. నిబంధనల ప్రకారం–బీసీ/ఎస్సీ/ఎస్టీ/ పీడబ్ల్యూడీ అభ్యర్థులకు గరిష్ట వయసులో సడలింపు ఉంటుంది. » దరఖాస్తు విధానం: ఆన్లైన్/ఆఫ్‌లైన్ ద్వారా » ఆన్లైన్ దరఖాస్తులకు చివరి తేది: 22.02.2021 » దరఖాస్తు హార్డ్‌కాపీలను పంపడానికి చివరి తేది: 01.03.2021. » చిరునామా: బీహెచ్ఈఎల్, భోపాల్ (మధ్యప్రదేశ్)– 462022. » వెబ్సైట్: https://bpl.bhel.com/bplweb_new/careers/index.html -
అప్రెంటిస్‌షిప్ ఉంటేనే కొలువు!
సాక్షి, హైదరాబాద్: అప్రెంటిస్‌షిప్... ఇకపై ప్రైవేటు సంస్థలోనే కాదు షాపింగ్ మాల్, షోరూం, సూపర్ మార్కెట్ లాంటి ఎందులో ఉద్యోగం చేయాలన్నా తప్పనిసరి కానుంది. ఈ అర్హత ఉన్న వారికే ఉద్యోగం ఇవ్వాలని కేంద్ర ప్రభుత్వం నిర్దేశించింది. డెసిగ్నేటెడ్ ట్రేడ్లతోపాటు ఆప్షనల్ కేటగిరీలో వచ్చే ప్రతి కొలువు భర్తీని అప్రెంటీస్‌షిప్‌తో కేంద్రం ముడిపెట్టింది. ఈ మేరకు కార్మిక, ఉపాధి కల్పనశాఖ అప్రెంటిస్‌షిప్ (సవరణ) నిబంధనలు–2019 విడుదల చేసింది. కార్మికశాఖ జారీ చేసిన ఆదేశాల ప్రకారం ముగ్గురు, అంతకంటే ఎక్కువ మంది ఉద్యోగులు ఉన్న ఏ సంస్థ అయినా అప్రెంటిస్‌షిప్ ఇవ్వొచ్చు. సంస్థలోని మొత్తం ఉద్యోగుల్లో 15 శాతం వరకు అప్రెంటిస్‌షిప్ అభ్యర్థులను నియమించుకోవచ్చు. వర్కింగ్ ట్రేడ్లవారీగా వేతనాలు నిర్దేశించినప్పటికీ గరిష్ట విభాగాల్లో నియమించుకున్న వారికి తొలి ఏడాది రూ. 7,000, రెండో ఏడాది రూ. 7,700, మూడో ఏడాది రూ. 8,800 చొప్పున వేతనాన్ని ఇవ్వాల్సి ఉంటుంది. రాయితీలతో ప్రోత్సాహం... ముగ్గురు కంటే ఎక్కువ మంది ఉన్న చిన్నపాటి దుకాణం మొదలు పదులు, వందల సంఖ్యలో ఉన్న సంసల్లో అప్రెంటిస్‌షిప్‌కు వీలు కల్పించిన కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక రాయితీలను సైతం ప్రకటించింది. 15 శాతం వరకు ఉద్యోగాలను అప్రెంటిస్‌షిప్‌తో నింపుకోవచ్చని ప్రకటించిన కేంద్రం వారికి చెల్లించే వేతనాల్లో ఒక్కో ఉద్యోగికి రూ. 1,500 చొప్పున భరించనుంది. దీంతో సంస్థకు వేతన చెల్లింపుల భారం తగ్గుతుంది. ఆయా సంస్థలు నైపుణ్యాభివృద్ధి కల్పనలో భాగస్వామ్యం అవుతాయనే ఉద్దేశంతో కేంద్రం ఈ నిర్ణయం తీసుకుంది. అప్రెంటిస్‌షిప్ కోసం కంపెనీ apprenticeshipindia.org వెబ్సైట్లో నమోదు చేసుకుంటే కేంద్రం ప్రకటించిన రాయితీలు వస్తాయి. అదేవిధంగా అప్రెంటిస్‌షిప్ పూర్తి చేసిన అభ్యర్థికి పరీక్ష రాసే అర్హత సర్టిఫికెట్ జారీ ప్రక్రియ సులభతరమవుతుంది. అప్రెంటిస్‌షిప్ చేసిన కంపెనీల్లో శాశ్వత ఉద్యోగాలు పొందే అవకాశంతోపాటు జాబ్ మేళాలు, ఇతర నియామకాల ప్రక్రియలో ఈ సర్టిఫికెట్లు దోహదపడతాయని కార్మిక ఉపాధి కల్పనశాఖ సంచాలకుడు కె.వై. నాయక్ ‘సాక్షి’కి తెలిపారు. ఎక్కడైనా చెల్లుతుంది... అప్రెంటిస్‌షిప్ పొందిన అభ్యర్థికి కేంద్ర ప్రభుత్వం సంబంధిత ట్రేడ్‌లో ధ్రువీకరణ పత్రం జారీ చేస్తుంది. ఇందుకు అప్రెంటిస్‌షిప్ పూర్తి చేసిన తర్వాత సంబంధింత సంస్థ అనుమతితో పరీక్ష రాసి ఉత్తీర్ణత సాధించాలి. ఈ సర్టిఫికెట్తో దేశంలో ఎక్కడైనా సంబంధిత ట్రేడ్‌లో ఉద్యోగానికి అర్హుతగల వ్యక్తిగా పరిగణిస్తారు. ఐటీఐ ద్వారా పూర్తి చేసిన కోర్సును డెసిగ్నేటెడ్ ట్రేడ్‌గా, ఐటీఐయేతర కేటగిరీలను ఆప్షనల్ ట్రేడ్‌లుగా విభజించిన కేంద్రం... వాటి అప్రెంటిస్‌షిప్‌కు దిశానిర్దేశం చేసింది. -
హెచ్1బీ ఫీజుతో అమెరికన్లకు శిక్షణ
వాషింగ్టన్: దేశీయ కంపెనీల్లో నిపుణుల కొరత తీర్చేందుకు హెచ్1–బీ వీసా ఫీజు డబ్బుతో అమెరికన్లకు శిక్షణ కార్యక్రమాలు చేపట్టినట్లు వాణిజ్య మంత్రి విల్బర్ రాస్ తెలిపారు. వివిధ కంపెనీలే అమెరికన్లకు శిక్షణ ఇచ్చేలా ట్రంప్ యంత్రాంగం ‘ఇండస్ట్రీ–రికగ్నైజ్డ్ అప్రెంటిస్‌షిప్ సిస్టం’ అనే విధానం తెచ్చింది. హెచ్1బీ వీసా ఫీజు డబ్బు సుమారు రూ.688 కోట్లను కార్మిక శాఖ 30 రకాల అప్రెంటిస్ షిప్ గ్రాంట్‌గా అందజేసిందన్నారు. ఈ ఫీజును విదేశీ ఉద్యోగులను నియమించుకున్న కంపెనీలే ప్రభుత్వానికి చెల్లించాల్సి ఉంటుంది. ప్రస్తుతం సైబర్ సెక్యూరిటీ, కృతిమ మేథ రంగాల్లో అమెరికన్ నిపుణులకు శిక్షణ ఇస్తున్నామన్నారు. అధికారుల వల్లే ‘హెచ్1బీ’ జాప్యం అమెరికా వలస విభాగం విధానాల కారణంగా హెచ్1–బీ జారీ ప్రక్రియ ఆలస్యమవుతోందని అమెరికా కాంగ్రెస్ సభ్యురాలు సుసాన్ ఎలెన్ లోఫ్గ్రెన్ ఆందోళన వ్యక్తం చేశారు. దరఖాస్తు దారులు ఒకసారి పంపిన వివరాలనే మళ్లీపంపాలని అడుగుతున్నారని, అనవసరమైన సమాచారం కావాలంటున్నారన్నారు. హెచ్1బీ దరఖాస్తులను పెండింగ్‌లో పెట్టిన ఘటనలు 2016తో పోలిస్తే 20 శాతం పెరిగాయని అమెరికన్ ఇమిగ్రేషన్ లాయర్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ మర్కెటా చెప్పారు. -
ఆర్టీసీ అప్రెంటిషిప్ ఎంపిక ఫలితాలు విడుదల
కర్నూలు(రాజ్‌విహార్): రోడ్డు రవాణా సంస్థలో అప్రెంటిషిప్ చేసేందుకు దరఖాస్తు చేసుకున్న ఐటీఐ అభ్యర్థుల్లో అర్హులైన వారి జాబితాను విడుదల చేసినట్లు జోనల్ స్టాఫ్ ట్రైనింగ్ కళాశాల ప్రిన్సిపల్ ఎస్. రజియా సుల్తానా శనివారం ప్రకటనలో తెలిపారు. ఈ సారి అభ్యర్థులు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకునే విధానం అమల్లోకి రావడంతో ఐటీఐలో వచ్చిన మార్కులు, సీనియారిటీ ఆధారంగా అవకాశం కల్పించినట్లు పేర్కొన్నారు. ఎంపికైన అభ్యర్థుల జాబితాను తమ ట్రైనింగ్ కళాశాలతోపాటు జిల్లాలోని అన్ని డిపో మేనేజరు కార్యాలయాల్లోని నోటీసు బోర్డుల్లో అతికిస్తామని వెల్లడించారు. ఎంపికైన అభ్యర్థులు ఐటీఐ ఒరిజినల్ సర్టిఫికెట్లు, ఆధార్ కార్డు జిరాక్స్, రిజిస్ట్రేషన్ నంబరు, ప్రొఫైల్, కుల ధ్రువీకరణ పత్రాలు, రెండు పాస్‌పోర్టు సైజు ఫొటోలతో ఈనెల 12వ తేదీన ఉదయం 10:30 గంటలకు తమ కళాశాలకు హాజరు కావాలని సూచించారు. -
16న అప్రెంటిషిప్ శిక్షణకు ఇంటర్వ్యూలు
కర్నూలు(కొండారెడ్డి ఫోర్టు): ఇంటర్ విద్యా విభాగం, బోటింగ్ ఆఫ్ అప్రెంటిషిప్ ట్రై నింగ్ సంయుక్త ఆధ్వర్యంలో ఒకేషనల్ కోర్సులు పాసైన విద్యార్థులకు ఈ నెల 16న అప్రెంటిషిప్ శిక్షణ కోసం ఇంటర్వ్యూలు నిర్వహిస్తున్నట్లు ఇన్చార్జి డీవీఈఓ వెంకట్రావు శుక్రవారం ఓ ప్రకటనలో తెలిపారు. 2014 మార్చి నుంచి 2016 సప్లిమెంటరీ పరీక్షలు పాసైన వారు అర్హులన్నారు. ఆ సక్తి కల వారు బీ క్యాంపు ప్రభుత్వ ఒకేషనల్ జూనియర్ కళాశాలలో ఈనెల 15వ తేదీలోగా పేర్లు నమోదు చేసుకోవాలన్నారు.