సింగరేణిలో అప్రెంటిస్‌ ఖాళీలు.. త్వరపడండి | SCCL Apprentice Recruitment 2021: Vacancies, Eligibility, Selection Process | Sakshi

సింగరేణిలో అప్రెంటిస్‌ ఖాళీలు.. త్వరపడండి

Published Tue, Jun 22 2021 10:02 AM | Last Updated on Tue, Jun 22 2021 10:07 AM

SCCL Apprentice Recruitment 2021: Vacancies, Eligibility, Selection Process - Sakshi

సింగరేణి కాలరీస్‌ కంపెనీ లిమిటెడ్‌కి చెందిన మానవ వనరుల అభివృద్ధి విభాగం.. వివిధ ట్రేడుల్లో అప్రెంటిస్‌ ఖాళీల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. 
 

ప్రభుత్వరంగ సంస్థ,తెలంగాణలోని ది సింగరేణి కాలరీస్‌ కంపెనీ లిమిటెడ్‌(ఎస్‌సీసీఎల్‌)కి చెందిన మానవ వనరుల అభివృద్ధి విభాగం.. వివిధ ట్రేడుల్లో అప్రెంటిస్‌ ఖాళీల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. 

ట్రేడులు: ఎలక్ట్రీషియన్, ఫిట్టర్, టర్నర్స్, మెషినిస్ట్, మెకానికల్‌ మోటార్‌ వెహికల్, డ్రాఫ్ట్స్‌మెన్‌ సివిల్, డీజిల్‌ మెకానిక్స్, వెల్డర్స్‌. 

అర్హత: పదో తరగతి, సంబంధిత ట్రేడుల్లో ఐటీఐ ఉత్తీర్ణులై ఉండాలి. ఇంటర్మీడియెట్‌ ఒకేషనల్‌ విద్యార్థులు అర్హులు కాదు. 

వయసు: 28 ఏళ్లు మించకుండా ఉండాలి. 

స్టయిపెండ్‌: రెండేళ్ల ఐటీఐ అభ్యర్థులకు నెలకు రూ.8050, ఏడాది ఐటీఐ అభ్యర్థులకు నెలకు రూ.7700 చెల్లిస్తారు. 

లోకల్‌: అప్పటి ఆదిలాబాద్, కరీంనగర్, వరంగల్, ఖమ్మం(ప్రస్తుతం 16 జిల్లాలు) జిల్లాల అభ్యర్థుల్ని లోకల్‌గాను, మిగతా జిల్లాల అభ్యర్థుల్ని నాన్‌ లోకల్‌గాను పరిగణనలోకి తీసుకుంటారు. వీరికి 80:20 నిష్పత్తిలో అప్రెంటిస్‌ సీట్ల కేటాయింపు జరుగుతుంది. 

ఎంపిక విధానం: ఐటీఐ ఉత్తీర్ణత సీనియారిటీ ప్రాతిపదికన ఎంపిక ప్రక్రియ నిర్వహిస్తారు. ఒకవేళ చాలా మంది అభ్యర్థుల ఉత్తీర్ణత సంవత్సరం ఒకటే అయితే.. ఐటీఐలో సాధించిన మార్కుల మెరిట్‌ ఆధారంగా ఎంపిక చేస్తారు. 

► దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. 
► దరఖాస్తులకు చివరి తేది: 28.06.2021
► వెబ్‌సైట్‌: https://scclmines.com/apprenticeship/olApplication.aspx

మరిన్ని నోటిఫికేషన్లు:
పవర్‌గ్రిడ్‌, ఎస్‌బీఐలో ఉద్యోగ అవకాశాలు

ఇండియన్‌ నేవీలో ఎస్‌ఎస్‌సీ ఆఫీసర్‌ ఉద్యోగాలు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Photos

View all
Advertisement