electrician
-
ఈ మాస్క్ వేసుకుంటే..వయసును చూపించే సంకేతాలన్నీ మాయం!
ఎంత మేకప్ వేసినా.. కళ్లు.. పెరుగుతున్న వయసును దాచలేవు. కళ్ల చుట్టు ఏర్పడే ముడతలు, మచ్చలు, డార్క్ సర్కిల్స్ వంటివన్నీ వయసును బయటపెట్టడమే కాదు ముఖాన్నీ కళావిహీనంగానూ మారుస్తాయి. చిత్రంలోని ఈ మాస్క్‌ను రోజుకు పది నిమిషాలు ఉపయోగిస్తే చాలు.. వయసును చూపిస్తున్న లక్షణాలన్నీ మాయమై ముఖం మిలమిలా మెరుస్తుంది. ఈ ‘మెడి లిఫ్ట్ ఐ ఈఎమ్ఎస్ మాస్క్’ వృద్ధాప్య సంకేతాలతో పోరాడేందుకు కళ్ల కోసం రూపొందింది. దీన్ని రోజుకు పది నిమిషాలు ధరిస్తే చాలు మంచి ఫలితం వస్తుంది. ఎలక్ట్రికల్ మజిల్స్ స్టిమ్యులేషన్ మాస్క్(EMS) నుంచి మంచి ప్రయోజనాలను అందుకోవచ్చు. దీనికి రెండున్నర గంటలు చార్జింగ్ పెడితే సుమారు 3 గంటల పాటు నిర్విరామంగా ఉపయోగించుకోవచ్చు. ఈ మాస్క్ ధర దాదాపుగా 226 డాలర్లు ఉంది. అంటే 18,855 రూపాయలు. దీన్ని వినియోగించడం చాలా ఈజీ. టీవీ చూస్తున్నప్పుడు, చదువుకుంటున్నప్పుడు, వ్యాయామం చేస్తున్నప్పుడు, వాకింగ్‌కి వెళ్లినప్పుడు, ల్యాప్‌టాప్‌లో వర్క్ చేసుకునేటప్పుడు కూడా ఎలాంటి ఇబ్బంది లేకుండా సులభంగా వినియోగించుకోవచ్చు. (చదవండి: నిమ్మకాయలు ఎక్కువ రోజులు తాజాగా ఉండాలంటే ఇలా చేయండి!) -
‘నీకు పెళ్లయ్యింది.. నా హృదయం ముక్కలయ్యింది’.. షాకిస్తున్న ఎలక్ట్రీషియన్ లెటర్!
ఇంటిలో పనిచేసేందుకు వచ్చే ఎలక్ట్రీషియన్, కార్పెంటర్, ప్లంబర్లాంటి వారు ఒక్కోసారి ఆ ఇంటిలోని మహిళలను వేధించిన ఘటనలను మనం చూస్తుంటాం. ఇటువంటి సందర్భాల్లో కొందరు దుర్మార్గులయితే పెళ్లయిన మహిళలతో స్నేహం చేసేందుకు కూడా ప్రయత్నిస్తుంటారు. తాజాగా అమెరికాకు చెందిన మెకియన్ మెక్క్రాకెన్ అనే మహిళకు విచిత్ర ఘటన ఎదురయ్యింది. తనకు ఎదురైన అనుభవాన్ని ఆమె టిక్‌టాక్‌లో షేర్ చేసింది. మెకియన్ తెలిపిన వివరాల ప్రకారం ఆమె భర్త కొలెటల్, మరిది డెవ్ బయటకు వెళ్లారు. ఆ సమయంలో వారి ఫర్నీచర్ స్టోర్‌లో మరమ్మతు పనులు జరుగుతున్నాయి. స్టోర్‌లోని ఫ్యాను మరమ్మతు చేసేందుకు ఒక ఎలక్ట్రీషియన్‌ను పిలిచారు. నాటి అనుభవం గురించి మెకియన్ మాట్లాడుతూ ‘ఎలక్ట్రీషియన్ ఫ్యాను బాగు చేసేందుకు అనువుగా అక్కడి సోఫాను పక్కకు జరిపాను. అలాగే ఆ ఎలక్ట్రీషియన్‌కు సాయం చేసే ఉద్దేశంతో ఏమైనా కావాలా’ అని అడిగాను. దానికి ఆ ఎలక్ట్రీషియన్ సమాధానమిస్తూ ‘మీ ఆదేశాలను శిరసావహిస్తాను’ అని నెమ్మదిగా అన్నాడు. అయితే ఈ మాటను ఆమె పెద్దగా పట్టించుకోకుండా తన పనిలో మునిగిపోయింది. తరువాత ఎలక్ట్రీషియన్ బాత్రూమ్ వినియోగించుకునేందుకు ఆమె అనుమతి కోరాడు. తరువాత ‘మీరు ఎంతో అందంగా ఉన్నారు. అయితే మీకు వివాహం జరిగిందని తెలిసి నా హృదయం ముక్కలయ్యింది. అయినా మీరు నాతో రావాలనుకుంటే వచ్చేయండి. నాకేమీ అభ్యంతరం లేదు. సోఫా కుషన్‌పై మీకోసం ఒక లెటర్ అతికించాను’ అని అన్నాడు. ఈ మాటలు విన్న మెకియన్ కంగారు పడిపోయింది. అతను పని ముగించుకుని వెళ్లేవరకూ వేచిచూసింది. అతను వెళ్లగానే కుషన్‌పై అంటించిన లెటర్ చదివింది. దానిలో.. ‘నిన్ను ఇబ్బందుల్లో పెట్టాలనే ఉద్దేశం నాకు లేదు. నువ్వు ఎంతో అందంగా ఉన్నావు. నీకు పెళ్లయినప్పటికీ, నాతో రావాలనుకుంటే వచ్చేయ్, నేను నీకు అన్ని ఆనందాలను అందిస్తాను’ అని ఉంది. ఈ విషయాన్ని మెకియన్ తన భర్తకు తెలియజేసింది. వెంటనే భర్త ఆ ఎలక్ట్రీషియన్‌ను నిలదీశాడు. దీంతో ఆ ఎలక్ట్రీషియన్ మెకియన్కు క్షమాపణలు చెప్పాడు. సోషల్ మీడియాలో దర్శనమిస్తున్న ఈ పోస్టును చూసి యూజర్లు రకరకాలుగా తమ స్పందనలను తెలియజేస్తున్నారు. ఒక యూజర్.. మీరు ఆ ఎలక్ట్రీషియన్ బాస్‌కు ఫిర్యాదు చేయాల్సింది అని సలహా ఇవ్వగా, మరొకరు ఆ ఎలక్ట్రీషియన్ పనిచేస్తున్న కంపెనీ రివ్యూలో ఈ విషయాన్ని రాయాలని కోరారు. ఇది కూడా చదవండి: పాకిస్తాన్ ‘ఆణిముత్యం’.. ఎవరికీ తెలియని షాహిద్ ఖాన్ సక్సెస్ స్టోరీ! -
కొడుకు కష్టం చూడలేక.. తుక్కుతో ఎలక్ట్రిక్ బైక్ తయారు చేసిన తండ్రి
అతనో మధ్య తరగతి వ్యక్తి. రోజంతా కష్టపడితే గానీ బతుకు బండి ముందుకు సాగదు. తన కొడుకు రోజూ సుదూరం నడిస్తే గానీ కాలేజ్‌కి వెళ్లలేని పరిస్థితి. కొడుకుకి కొత్త బైక్ కొనిద్దామంటే తన స్థోమత సరిపోదు.. అలా అని చూస్తూ ఉండలేకపోయాడు ఆ తండ్రి. అందుకే ఆ వ్యక్తి స్వయంగా ఎలక్ట్రిక్ బైక్ తయారు చేసి తన కొడుకుకు బహుమతిగా ఇచ్చాడు. వివరాల్లోకి వెళితే.. మహారాష్ట్రలోని కరంజా పట్టణానికి చెందిన రహీమ్‌ఖాన్ చిన్న కొడుకు షఫిన్ఖాన్ ఇంటికి దూరంగా ఉన్న కాలేజీకి నడుస్తూ వెళ్లేవాడు. ఈ క్రమంలో అతను ఇంటి నుంచి కాలేజ్ వెళ్లి రావడం కష్టంగా ఉందంటూ తన తండ్రి వద్ద మొరపెట్టుకున్నారు. తన స్నేహితులకు ఉన్నట్లు తనకీ ఓ బైక్ ఉంటే బాగేండేదని తండ్రికి చెప్పుకున్నాడు. అయితే ఎలక్ట్రీషియన్‌గా పనిచేస్తూ రహీమ్‌ఖాన్ తన ఇంట్లోనే చిన్న దుకాణం పెట్టుకుని జీవనం సాగిస్తున్నాడు. అతని ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రమే. దీంతో రహీమ్‌ఖాన్ తన కొడుకు బాధ చూడలేక ఈ సమస్యకు పరిష్కారంగా.. తానే స్వయంగా ఓ ఎలక్ట్రిక్ బైక్ తయారు చేయాలని అనుకున్నాడు. స్వతహాగా అతను ఎలక్ట్రిషియన్ కావడంతో ఈ పని కాస్త సులువు అయ్యింది. రహీమ్ బైక్ తయారీకి ఉపయోగించిన దాదాపు అన్ని పదార్థాలు స్క్రాప్ డీలర్ల నుంచి తెచ్చుకున్నావే. పైగా చాలా వరకు మార్కెట్లో తక్కువ ధరకు దొరికే వస్తువులతో ఈ బైక్‌ని తయారు చేశాడు. దీన్ని తయారీకి అతనికి 2 నెలలు సమయం పట్టగా.. దాదాపు 20,000 రూపాయలు ఖర్చు అయ్యింది. ఇంట్లో తయారు చేసిన ఈ ఎలక్ట్రిక్ బైక్ ఒకసారి ఛార్జ్ చేస్తే 25 కి.మీల వరకు ప్రయాణించవచ్చు. అత్యధికంగా 60 కిలోల వరకు బరువును ఈ బైక్ మోయగలదు. ఈ బైక్ వేగం, బరువు మోసే సామర్థ్యాన్ని పెంచడానికి మరింత శక్తివంతమైన బ్యాటరీ, మోటారును అమర్చాలని యోచిస్తున్నట్లు రహీమ్ చెప్పారు. ప్రస్తుతం షఫిన్ ఖాన్ రోజూ ఈ అద్భుతమైన ఎలక్ట్రిక్ బైక్‌పై కాలేజీకి వెళ్తున్నాడు. -
Shabnam: పవర్ ఆఫ్ ఉమెన్
జమ్మూలోని దోడా జిల్లాలో ‘ఎలక్ట్రిషియన్’ అంటే మగవాళ్లు మాత్రమే గుర్తుకు వస్తారు. ‘మహిళా ఎలక్ట్రిషియన్’ అనే మాట, దృశ్యం ఊహకు కూడా అందనిది. ఇలాంటి పరిస్థితుల్లో ఎలక్ట్రిషియన్‌గా ప్రస్థానం మొదలుపెట్టిన షబ్నమ్ సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఎంతో మంది మహిళలకు స్ఫూర్తిగా నిలుస్తోంది... జమ్మూ దోడా జిల్లాలోని మారుమూల గ్రామం కహరకు చెందిన షబ్నమ్ పదవ తరగతి పూర్తయిన తరువాత శ్రీనగర్‌లోని పాలిటెక్నిక్ కాలేజీలో ఎలక్ట్రిషియన్ కోర్సులో డిప్లొమా చేసింది. తండ్రి చనిపోవడంతో ఆ కుటుంబానికి కష్టాలు మొదలయ్యాయి. ఆర్థికంగా అండ లేకుండా పోయింది. ఈ పరిస్థితుల్లో ఆమె ఎలక్ట్రిషియన్‌గా పని మొదలు పెట్టింది. కుటుంబానికి పెద్ద దిక్కుగా నిలిచింది. కొద్ది కాలంలోనే షబ్నమ్‌కు ఎలక్ట్రీషియన్‌గా మంచి పేరు వచ్చింది. ‘తప్పనిసరి పరిస్థితుల్లో ఎలక్ట్రిషియన్ వృత్తిలోకి వచ్చాను. అయితే నా పనితీరును చాలామంది మెచ్చుకోవడంతో ఉత్సాహం వచ్చింది. నాపై నాకు నమ్మకం పెరిగింది. ఈ ఫీల్డ్‌లోనే పనిచేయాలని గట్టిగా నిర్ణయించుకున్నాను’ అంటుంది షబ్నమ్. నిజానికి దోడా ప్రాంతంలో ఎలక్ట్రిషియన్ అంటే మగవాళ్లు మాత్రమే. ‘అమ్మాయిలు ఎలక్ట్రిషియన్‌గా పని చేయడం ఏమిటీ!’ అని అందరూ ఆశ్చర్యం వ్యక్తం చేసేవాళ్లే. ఈ విషయం తెలిసి కూడా ఎలక్ట్రిషియన్‌గా అడుగులు మొదలుపెట్టింది షబ్నం. ‘ఇది మగవాళ్లు మాత్రమే పనిచేయాల్సిన రంగం. ఇది ఆడవాళ్లు మాత్రమే పనిచేయాల్సిన రంగం అంటూ ఏదీ లేదు’ అంటుంది షబ్నమ్. ఎంటెక్ చదువుకున్న రషీద్‌ఖాన్ జమ్మూలో నిపుణులైన ఎలక్ట్రిషియన్స్‌తో ఒక బృందాన్ని ఏర్పాటు చేశాడు. ఒక వెబ్సైట్ కూడా లాంచ్ చేయనున్నాడు. ఖాన్ బృందంలో ఉన్న ఒకే ఒక మహిళ షబ్నమ్. ‘వీరితో ఎలాంటి భయం లేదు. మేమందరం ఒక కుటుంబం’ అంటుంది షబ్నమ్. చాటుమాటుగానే కాదు... ‘అమ్మాయిలు ఎలక్ట్రిషియన్ వర్క్ చేయడం ఏమిటి!’ అని ముఖం మీదే అన్నవాళ్లు ఉన్నారు. అయితే అలాంటి మాటలను షబ్నమ్ ఎప్పుడూ పట్టించుకోలేదు. ‘ప్రతి రంగంలో మహిళలు తమ ప్రతిభను నిరూపించుకోవాలి. ఇది మహిళలు పనిచేసే రంగం కాదు అనే భావన నుంచి బయటికి రావాలి. ప్రతి రంగంలోనూ మంచి, చెడు ఉంటాయి. చెడును మాత్రమే చూస్తే ఉన్నచోటే ఉండిపోతాం. ప్రతి కొత్త అడుగులో కించపరిచే విధంగా మాట్లాడేవాళ్లు, ప్రతికూలంగా మాట్లాడే వాళ్లు ఎంతోమంది ఉంటారు. అలాంటి వారికి మన పనితోనే సమాధానం చెప్పాలి’ అంటున్న షబ్నమ్ ఎలక్ట్రిషియన్‌గా పనిచేయాలనుకునే మహిళలకు సహాయం అందించడానికి సిద్ధంగా ఉంది. -
అల్లూరి జిల్లా: అక్కా.. తమ్ముడు.. ఓ స్కూటర్
అక్క కోసం ఓ తమ్ముడు తన నైపుణ్యాన్ని ప్రదర్శించాడు. ఏకంగా బండిని బ్యాటరీతో నడిచేలా తయారు చేశాడు. ఇంకేంముంది.! అక్క తక్కువ ఖర్చుతో బ్యాటరీ స్కూటర్‌పై రయ్‌రయ్‌మంటూ దూసుకుపోతోంది. తమ్ముడు కృషిని అక్కతో పాటు ఇరుగుపొరుగు వారు ప్రశంసిస్తున్నారు. సాక్షి, అల్లూరి జిల్లా: జిల్లాలోని రాజవొమ్మంగికి చెందిన సామన సురేష్ స్థానికంగా ఎలక్ట్రీషియన్. ఫ్యాన్లు, ఇతర ఎలక్ట్రానిక్ వస్తువులు రిపేర్ చేస్తూ ఉపాధి పొందుతున్నాడు. ఈ క్రమంలో మోటారు ఏ విధంగా పని పని చేస్తుంది? బ్యాటరీ పనితనం తదితర అంశాలను బాగా ఆకళింపు చేసుకున్నాడు. కాగా.. రాజవొమ్మంగికి సుమారు 12 కిలోమీటర్ల దూరంలో సురేష్ అక్క వెంకటలక్ష్మి బ్రాంచ్ పోస్ట్ మాస్టారుగా పనిచేస్తున్నారు. ఆమె రోజూ స్కూటర్‌పై విధులకు వెళ్తుంటుంది. ఈ క్రమంలో.. పెట్రోల్ ధరలు పెరగడం, ఒకటి రెండు సార్లు ఆమె తన భర్తను పెట్రోల్ కోసం డబ్బులు అడగటం సురేష్ చెవిన పడింది. పెట్రోల్‌తో నడిచే ఆ స్కూటర్ మైలేజ్ లీటరుకు 30 కిలోమీటర్లే వస్తోంది. కిలోమీటరుకు సుమారు రూ.4 ఖర్చవుతోంది. రోజూ 12 కిలోమీటర్ల దూరం వెళ్లి వచ్చేందుకు సుమారు రూ.96 అవసరం. ఇలా నెలకు రూ.2,880 ఖర్చవుతోంది. ఆమె చేసేది చిన్న ఉద్యోగం. అందులో సగం జీతం పెట్రోలు ఖర్చులకే పోతుండటంతో సురేష్ ఆలోచనలో పడ్డాడు. అప్పటికే.. సురేష్ బ్యాటరీతో నడిచే ఓ సైకిల్ తయారు చేసి ప్రతి ఒక్కరి దృష్టిని ఆకర్షించాడు. కానీ అక్కను సైకిల్‌పై పోస్టాఫీసుకు వెళ్లమనడం ఇష్టం లేక.. ఆమె ఉపయోగించే స్కూటర్‌కే బ్యాటరీలు అమర్చే పనిలో పడ్డాడు. మెదడుకు పదును పెట్టి దాదాపు రెండు వారాలు కష్టపడ్డాడు. అతని కృషి ఫలించింది. స్కూటర్‌ను ఇటు పెట్రోల్‌తో.. అలాగే బ్యాటరీతోనూ నడిచేలా తయారు చేశాడు. సురేష్ తెలివితేటలకు ఆమె మురిసిపోయారు. రయ్ రయ్‌మంటూ రోడ్లపై పరుగులు తీస్తున్న స్కూటర్‌తో మరింత అనుబంధం పెంచుకున్నారు. సెల్‌ఫోన్‌కు మాదిరిగానే బ్యాటరీ చార్జ్ చేస్తే సరిపోతుండటంతో వెంకటలక్ష్మి ఆనందానికి అవధుల్లేకుండా పోయాయి. ఇప్పుడిక బండిలో పెట్రోలు ఉందా లేదా చూడనవసరం లేకుండా ఝామ్మని ఆఫీసుకు దూసుకెళ్లిపోతున్నారు. 3 గంటలు చార్జ్ చేస్తే 60 కి.మీ. వెళ్లొచ్చు పెట్రోల్‌తో నడిచే స్కూటర్‌ను బ్యాటరీతో కూడా నడిచేదిగా తయారు చేసేందుకు తనకు రూ. 28,000 ఖర్చయిందని సురేష్ తెలిపారు. మూడు 12 ఓల్ట్స్ బ్యాటరీలతో తయారు చేసిన ఈ స్కూటర్‌కు మూడు గంటల పాటు చార్జ్ చేస్తే 60 కిలోమీటర్లు ప్రయాణించవచ్చు. పైకి పెట్రోల్ స్కూటర్ మాదిరిగా ఉన్న బ్యాటరీ స్కూటర్‌ను స్థానికులు ఆసక్తిగా తిలకిస్తున్నారు. ఇదీ చదవండి: కవిత్వమే ఆయుధమై.. చైతన్య తూటాలను పేల్చి.. -
క్రేజీ లవ్: గర్ల్ ఫ్రెండ్ కోసం మొత్తం గ్రామానికే కరెంట్ లేకుండా చేశాడు
పాట్నా: ప్రేమలో ఉన్నప్పుడూ ప్రేమికులు రకరకాల వెర్రి పనులు చేస్తుంటారు. అయితే ఒక్కోసారి ప్రమాదకరంగా కూడా ఉంటాయి. కొంతమంది ఏకంగా తమ ప్రేమ కోసం ఇతరులను ఇబ్బంది పెట్టేలా పిచ్చి పనులు చేస్తుంటారు. అచ్చం అలానే ఇక్కడొక వ్యక్తి తన గర్ల్ ఫ్రెండ్ కోసం ఒక గ్రామానికి కరెంట్ లేకుండా చేశాడు. ఈ ఘటన బిహార్‌లో చోటుచేసుకుంది. వివారాల్లోకెళ్తే....బిహార్‌లోని పూర్నియ జిల్లాలోని గణేశ్‌పూర్ గ్రామంలోని ప్రజలు తరుచు కరెంట్ కోతలతో బాధపడుతున్నారు. ఐతే తమ చుట్టుపక్కల గ్రామాల వాళ్లకి ఇలాంటి సమస్య లేదు మా గ్రామానికి మాత్రమే ఏంటీ ? దుస్థితి అని ఆందోళన చెందారు. దీంతో ఆ గ్రామస్తులంతా ఎలాగైన ఈ సమస్యకు పరిష్కారం తెలుసుకోవాలని నిర్ణయించారు. అందులో భాగంగా గ్రామంలోని ప్రజలంతా కలిసి నిఘా పెట్టడం మొదలు పెట్టారు. ఇంతకీ ఇదంతా చేస్తోంది ఆ ఊరి ఎలక్ట్రీషియన్ అని తెలుసుకుని ప్రజలంతా ఒక్కసారిగా ఖంగుతిన్నారు. అదీ కూడా కేవలం తన గర్ల్‌ఫ్రెండ్‌ని చీకటిలో కలిసేందు కోసం మొత్తం గ్రామంలో విద్యుత్ సరఫరా నిలిపేస్తున్నాడని తెలుసుకుని ఒక్కసారిగా షాక్ అయ్యారు. దీంతో గ్రామస్తులంతా పథకం వేసి మరీ ఆ ప్రేమికులిద్దరిని పట్టుకోవడమే కాకుండా ఆ ఎలక్ట్రీషియన్ని చితకొట్టి మరీ గ్రామంలో ఊరేగించారు. అంతేకాదు ఈ సమస్య మళ్లీ తలెత్తకుండా ఉండేలా ఆ ఊరిలోని గ్రామస్తులు, సర్పంచ్, ఇతర గ్రామ కౌన్సిల్ సభ్యుల సమక్షంలోనే ఆ ప్రేమికులిద్దరికి వివాహం చేశారు. ఐతే ఆ గ్రామస్తులు ఆ ఎలక్ట్రీషియన్ పై ఎలాంటి కేసు పెట్టలేదని పోలీసులు తెలిపారు. ఫిర్యాదు చేస్తే మాత్రం కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు తెలిపారు. (చదవండి: వీడియో: ఎదురుగా భారీ మొసలి.. అడుగు ముందుకు పడ్డా చావే! ఎందుకలాగంటే..) -
ట్రాన్స్ఫార్మర్ రిపేర్ చేస్తూ ..
వేల్పూర్: నిజామాబాద్ జిల్లా వేల్పూర్ మండలం సాహెబ్పేట్ గ్రామానికి చెందిన ప్రైవేటు ఎలక్ట్రీషియన్ బట్టు బాలయ్య (59) శనివారం జానకంపేట్ గ్రామంలో ట్రాన్స్ఫార్మర్పై విద్యుదాఘాతానికి గురై మర ణించాడు. ఓ ట్రాన్స్ఫార్మర్ నుంచి వ్యవసాయ పంపులకు విద్యుత్ అందట్లేదని రైతులు చెప్పడంతో ట్రాన్స్ఫార్మర్కు విద్యుత్ సరఫరా ఆపేసిన బాలయ్య దానిపైకి ఎక్కాడు. కానీ ట్రాన్స్ఫార్మర్కు విద్యుత్ సరఫరా చేసే ఇన్సులేటర్ ఒకటి విరగడంతో యథావిధిగా విద్యుత్ సరఫరా అయ్యింది. దీన్ని బాలయ్య గమనించకపోవడంతో పైకెక్కగానే షాక్‌కు గురై ట్రాన్స్‌ఫార్మర్‌పైనే మరణించాడు. -
కబళించిన కరెంటు తీగ
దండేపల్లి (మంచిర్యాల): ట్రాన్స్‌కో అధికారుల నిర్లక్ష్యానికి ఒక ప్రైవేట్ ఎలక్ట్రీషియన్ బలయ్యాడు. మంచిర్యాల జిల్లా దండేపల్లి మండలం లింగాపూర్ సమీపంలో పంట పొలాల్లో విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ పాడైపోయింది. మంగళవారం మేదరిపేటకు చెందిన ప్రైవేటు ఎలక్ట్రీషియన్ మడావి లక్ష్మణ్ (26)ను పిలిచారు. ట్రాన్స్ఫార్మర్పై నుంచి రెండు విద్యుత్ లైన్లు వెళ్తున్నాయి. లక్ష్మణ్ కిందనున్న లైన్‌కు మరమ్మతులు చేస్తూ.. ప్రమాదవశాత్తు పైనున్న 11కేవీ విద్యుత్ తీగలను తాకాడు. ఆ సమయంలో పైలైన్‌కు విద్యుత్ సరఫరా ఆపలేదని, దీనివల్లే లక్ష్మణ్ బలైపోయాడని స్థానికులు ఆరోపించారు. ఘటన స్థలానికి వచ్చిన ట్రాన్స్‌కో అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. మృతుని కుటుంబానికి న్యాయం చేయాలంటూ లింగాపూర్ వద్ద రహదారిపై బైఠాయించారు. దీంతో ట్రాఫిక్‌కు అంతరాయం ఏర్పడింది. మృతుని కుటుంబానికి పరిహారం అందిస్తామని ట్రాన్స్‌కో అధికారులు హామీ ఇవ్వడంతో ఆందోళన విరమించారు. -
సింగరేణిలో అప్రెంటిస్ ఖాళీలు.. త్వరపడండి
ప్రభుత్వరంగ సంస్థ,తెలంగాణలోని ది సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్(ఎస్సీసీఎల్)కి చెందిన మానవ వనరుల అభివృద్ధి విభాగం.. వివిధ ట్రేడుల్లో అప్రెంటిస్ ఖాళీల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. ► ట్రేడులు: ఎలక్ట్రీషియన్, ఫిట్టర్, టర్నర్స్, మెషినిస్ట్, మెకానికల్ మోటార్ వెహికల్, డ్రాఫ్ట్స్‌మెన్ సివిల్, డీజిల్ మెకానిక్స్, వెల్డర్స్. ► అర్హత: పదో తరగతి, సంబంధిత ట్రేడుల్లో ఐటీఐ ఉత్తీర్ణులై ఉండాలి. ఇంటర్మీడియెట్ ఒకేషనల్ విద్యార్థులు అర్హులు కాదు. ► వయసు: 28 ఏళ్లు మించకుండా ఉండాలి. ► స్టయిపెండ్: రెండేళ్ల ఐటీఐ అభ్యర్థులకు నెలకు రూ.8050, ఏడాది ఐటీఐ అభ్యర్థులకు నెలకు రూ.7700 చెల్లిస్తారు. ► లోకల్: అప్పటి ఆదిలాబాద్, కరీంనగర్, వరంగల్, ఖమ్మం(ప్రస్తుతం 16 జిల్లాలు) జిల్లాల అభ్యర్థుల్ని లోకల్‌గాను, మిగతా జిల్లాల అభ్యర్థుల్ని నాన్ లోకల్‌గాను పరిగణనలోకి తీసుకుంటారు. వీరికి 80:20 నిష్పత్తిలో అప్రెంటిస్ సీట్ల కేటాయింపు జరుగుతుంది. ► ఎంపిక విధానం: ఐటీఐ ఉత్తీర్ణత సీనియారిటీ ప్రాతిపదికన ఎంపిక ప్రక్రియ నిర్వహిస్తారు. ఒకవేళ చాలా మంది అభ్యర్థుల ఉత్తీర్ణత సంవత్సరం ఒకటే అయితే.. ఐటీఐలో సాధించిన మార్కుల మెరిట్ ఆధారంగా ఎంపిక చేస్తారు. ► దరఖాస్తు విధానం: ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. ► దరఖాస్తులకు చివరి తేది: 28.06.2021 ► వెబ్సైట్: https://scclmines.com/apprenticeship/olApplication.aspx మరిన్ని నోటిఫికేషన్లు: పవర్‌గ్రిడ్, ఎస్బీఐలో ఉద్యోగ అవకాశాలు ఇండియన్ నేవీలో ఎస్ఎస్సీ ఆఫీసర్ ఉద్యోగాలు -
రోడ్డు ప్రమాదంలో సాఫ్ట్వేర్ ఉద్యోగి దుర్మరణం
సాక్షి, హైదరాబాద్: రోడ్డు ప్రమాదంలో సాఫ్ట్వేర్ ఉద్యోగి దుర్మరణం చెందాడు. మల్కాజిగిరి పోలీస్‌స్టేషన్ పరిధిలో ఈ సంఘటన జరిగింది. ఎస్ఐ శ్రీనివాస్, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. నర్సింహారెడ్డి నగర్‌కు చెందిన నటేషన్(39) సాఫ్ట్వేర్ ఉద్యోగి. శనివారం సాయంత్రం తన యాక్టివా మీద ఎలక్ట్రీషియన్‌తో కలిసి ఎలక్ట్రికల్ సామాన్లు తీసుకొని ఇంటికి తిరిగి వెళుతుండగా ఆర్.కె.నగర్ వద్ద ఆర్టీసీ బస్సు ఢీ కొట్టడంతో అదుపుతప్పి బస్సు కింద పడిపోయాడు. బస్సు వెనుక చక్రం తల మీద వెళ్లడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. వెనుక ఉన్న ఎలక్ట్రీషియన్ స్వల్ప గాయాలతో బయటపడ్డాడు. సంఘటనా స్ధలానికి చేరుకున్న ఎస్ఐ శ్రీనివాస్ మృతదేహాన్ని గాంధీ ఆస్పత్రికి తరలించారు. నటేషన్ భార్య ప్రవీణ ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. (చడవండి: ప్రేమ పేరుతో మోసం; యువతిని లైంగికంగా వాడుకొని. ) -
వేరే దేశం నుంచి కాల్.. సెల్‌ఫోన్ పేలి గాయాలు
వేలూరు: వాలాజలో సెల్‌ఫోన్ పేలి ఎలక్ట్రీషియన్‌కు తీవ్ర గాయాలైన సంఘటన సంచలనం రేపింది. నేతాజీ వీధికి చెందిన వెంకటేశన్(32) ఎలక్ట్రీషియన్‌గా పనిచేస్తున్నాడు. మంగళవారం రాత్రి 8 గంటల సమయంలో వెంకటేశన్ ఇంటిలో ఉన్నాడు. ఆ సమయంలో అతని సెల్‌కు ఇతర దేశానికి చెందిన నంబర్ నుంచి కాల్ వచ్చింది. ఫోన్ ఆన్ చేసి మాట్లాడేందుకు ప్రయత్నించగా పెద్ద శబ్దంతో పేలింది. ఈ ప్రమాదంలో వెంకటేశన్ తల, చెయ్యి, కాలుకు తీవ్ర గాయాలయ్యాయి. కుటుంబ సభ్యులు వెంటనే వాలాజలోని ప్రభుత్వాసుపత్రికి తరలించారు. అనంతరం మెరుగైన చికిత్స కోసం వేలూరు అడుక్కంబరైలోని ప్రభుత్వాసుపత్రికి తీసుకొచ్చారు. ఇదిలా ఉండగా ఇతర దేశానికి చెందిన నంబర్ నుంచి కాల్ రావడంతో ఎందుకు పేలింది అనే కోణంలో పోలీసులు విచారణ చేస్తున్నారు. విషయం తెలుసుకున్న రాణిపేట డీఎస్పీ గీత తీవ్ర గాయాలైన వెంకటేశన్ వద్ద విచారణ చేపట్టారు. ముందు సెల్‌ఫోన్ పేలిందని.. మరోసారి ఇంటి సమీపంలోని చెత్తకు నిప్పు పెడుతుంటే అందులో ఉన్న గుర్తు తెలియని వస్తువు పేలిందని సమాధానం చెప్పాడు. పోలీసులు విచారణ చేస్తున్నారు. -
స్కూటర్ ఇంజిన్‌తో గుంటుక యంత్రం
సాక్షి, చిట్యాల : అందుబాటులోని పాత స్కూటర్ ఇంజిన్, ఇతర విడి భాగాలను సేకరించిన చిట్యాల మండలం గుండ్రాంపల్లి గ్రామానికి చెందిన ఎలక్ట్రీషియన్ రాచకొండ లింగస్వామి పత్తి చేలలో గుంటుక తీసేందుకు ఉపయోగించే యంత్రాన్ని తయారు చేశాడు. ఈ యంత్రంతో లీటర్ పెట్రోల్‌తో ఎకరం భూమిలో గుంటుక తీసే పనులు చేస్తున్నాడు. దీంతో అతి తక్కువ ఖర్చుతో పెద్దగా శ్రమ లేకుండా పత్తి చేలలో గుంటుకలు తీయడం సులవుతుందని ఆయన పేర్కొంటున్నాడు. ప్రస్తుతానికి తనకి వ్యవసాయం ఉన్నప్పటికీ సాగుబడి చేయడం లేదని ఆయన తెలిపారు. ఆయన తన స్నేహితుడు గాదరి లింగస్వామి కోరిక మేరకు ఈ గుంటుక యంత్రాన్ని తయారు చేసినట్లు ఆయన వివరించారు. -
ఇక ఇప్పుడు ఆపరేషన్ క్లీన్!
’మా పిల్లలు బడికెళ్ళేందుకు పుస్తకాలు లేవు. మా కోళ్ళూ, పశువులూ అన్నీ వరదనీటిలో కొట్టుకుపోయాయి. మాకిప్పుడు తలదాచుకునేందుకు ఇంత నీడ లేదు మూడు లక్షలు ఖర్చు పెట్టి కొత్తగా కట్టుకున్న ఇల్లు వరదల్లో పూర్తిగా కొట్టుకుపోయి నిరాశ్రయులుగా పునరావాస కేంద్రంలో తలదాచుకుంటున్నాము’’అన్నీ పోగొట్టుకొని ప్రాణాలను మాత్రం చిక్కబట్టుకొని బతికిబయటపడ్డ శోభన ఆవేదన ఇది. ముంచెత్తిన చెత్తాచెదారం మధ్య గుర్తించలేని విధంగా తయారైన తమ ఇళ్ళను చూసుకొని జనం బావురుమంటున్నారు. ప్రళయ బీభత్సం మిగిల్చిన విషాదాన్ని చూసి విలపిస్తున్నారు. పునరావాస కేంద్రం నుంచి ఎర్నాకుళం జిల్లాలోని కొత్తాడ్లోని తమ ఇంటికి తిరిగి వెళ్ళిన 68 ఏళ్ళ వృద్ధుడు అక్కడి పరిస్థితిని చూసి జీర్ణించుకోలేక దిగ్భ్రాంతికి గురై ఆత్మహత్యకు పాల్పడ్డ విషాదం కంటతడిపెట్టించింది. పునరావాస కేంద్రాల్లోని ప్రజలను తిరిగి సురక్షితంగా తమ ఇళ్ళకు చేర్చాలంటే ముందుగా బహిరంగ ప్రదేశాలనూ, వారి ఇళ్ళనూ శుభ్రపరిచి, నివాసయోగ్యంగా తయారు చేయాలి. కేరళ ప్రభుత్వం ప్రస్తుతం దానిపైనే దృష్టికేంద్రీకరించింది. బావులను శుభ్రపరచడం, పైపులైన్లను పునరుద్ధరించడం, విద్యుత్ పునరుద్ధరణ లాంటి తక్షణావసరాలపైన ప్రభుత్వం దృష్టిసారించింది. ఇళ్ళను శుభ్రపరిచేపనిలో వేలాది మంది వాలంటీర్లు... స్థానిక స్వయంపాలన, ఆరోగ్య విభాగాల కింద దాదాపు 3000 కిపైగా బృందాలు ఇళ్ళను శుభ్రపరిచే పనిలో నిమగ్నమయ్యాయి. వీళ్ళు కాకుండా ఇప్పటికే దాదాపు 12,000 మంది వాలంటీర్లు ఇదే పనిలో ఉన్నారని అధికారులు ప్రకటించారు. ఇప్పటికి 12,000 ఇళ్ళను శుభ్రం చేసారు. దాదాపు 3000 పశువుల కళేబరాలను బుధవారం పూడ్చిపెట్టినట్టు అధికారులు వెల్లడించారు. ’’దాదాపు ప్రజలందరినీ రక్షించాం. ఇంకా మారుమూల ప్రాంతాల్లో ఎవరైనా వరదనీటిలో చిక్కుకుపోయారేమోనని ఇంకా వెతుకుతూనే ఉన్నాం’’ అని ముఖ్యమంత్రి పినరయి విజయన్ తెలిపారు. నెల్లిపట్టి, పలక్కాడ్ జిల్లాల్లో మట్టిపెళ్ళలు విరిగిపడి నీటిలో చిక్కుకుపోయిన 11 మందినీ, మరో 15 మందినీ ఇండియన్ ఎయిర్‌ఫోర్స్ రక్షించినట్టు వెల్లడించారు. ప్లంబర్లు, ఎలక్ట్రీషియన్లకు డిమాండ్! ప్లంబింగ్, ఎలక్ట్రిక్ పనులు చేసేవారికి డిమాండ్ పెరిగింది. కొన్ని బావులు పూర్తిగా వరద బురదతో నిండిపోవడంతో వాటిని శుభ్రపరిచేందుకు ఒక్కొక్కరికీ 15000 రూపాయలు డిమాండ్ చేస్తున్నారు. ప్రతి వేసవిలో దాదాపు 40 బావులను శుభ్రపరిచే కూనమ్తాయ్కి చెందిన పికె.కుట్టాన్ బావులు శుభ్రం చేయాలంటూ తనకి చాలా మంది ఫోన్లు చేస్తున్నారని అన్నారు. పెద్దగా లోతులేని చిన్న చిన్న బావులు ఒక్కొక్కదాన్ని శుభ్రపరిచేందుకు 2000 రూపాయలు తీసుకుంటున్నారు. ఇక పెద్ద పెద్ద బావులు శుభ్రపరచడం మరింత రిస్క్‌తో కూడుకున్నదంటున్నారు కుట్టాన్. ’’ముందుగా ఓ క్యాండిల్ని వెలిగించి బావిలోకి దింపి, అది ఆరిపోకుండా ఉంటేనే మేం బావిలోనికి దిగుతున్నాం. ఇలా చేయడం వల్ల బావిలోని ఆక్సిజన్ని అంచనావేసే అవకాశం ఉంటుంది. లేదంటే కొన్ని సార్లు అది చాలా ప్రమాదకరం’’ అంటారాయన. త్రీ బెడ్రూం ఫ్లాట్‌లో విద్యుత్ పునరుద్ధరణ పనులకు దాదాపు 20,000 ఖర్చు అవుతుందని ఉదయంపెరూర్లోని సానోజ్ జోసెఫ్ అన్నారు. ’’ఒక్కో ఇంటికి రెండ్రోజుల పని ఉంటుంది. అదంతా ఫ్రీగా చేయాలంటే సాధ్యంకాదు. మా కుటుంబాలను కూడా పోషించుకోవాలి కదా?’’ అని ప్రశ్నిస్తున్నారు జోసెఫ్. ఫిక్స్ ఆల్... ఇదిలా ఉంటే ఉచితంగా సేవలందించేందుకు ’’ఫిక్స్ ఆల్’’ అనే ఆన్లైన్ వేదికొకటి ఏర్పాటయ్యింది. ప్లంబింగ్, ఎలక్ట్రికల్ వర్క్స్, రిఫ్రిజిరేటర్లను, ఇతర ఎలక్ట్రానిక్ వస్తువులను ఉచితంగా రిపేర్ చేసి ఇచ్చేందుకు ’ ఫిక్స్ ఆల్’ ఆన్లైన్ సహాయకులు లిజి జాన్ బృందం సిద్ధంగా ఉన్నట్టు ప్రకటించారు. -
విద్యుదాఘాతంతో లైన్‌మన్ మృతి
ఖమ్మం: విద్యుదాఘాతంతో ఓ లైన్‌మన్ మృతిచెందాడు. జిల్లాలోని కూసుమంచి మండలం మల్లాయిగూడెం శివారు రాజుతండాలో ఈ సంఘటన జరిగింది. గోరిలాపాడు తండాకు చెందిన ప్రైవేట్ ఎలక్ట్రీషియన్ తేజవత్ లక్మణ్ (35) ట్రాన్స్ ఫార్మర్కు కనెక్షన్ ఇచ్చేందుకు స్తంభం ఎక్కాడు. ఈలోగా ఎల్సి అన్ చేయటంతో విద్యుదాఘాతానికి గురై అతను స్తంభంపైనే మృతి చెందాడు. తమకు న్యాయం చేయాలని కోరుతూ అతని కుటుంబ సభ్యులు ఆందోళన చేస్తున్నారు. -
స్తంభం పైనుంచి పడి యువకుని మృతి
తుగ్గలి: విద్యుత్ మరమత్తుల కోసం స్తంభం మీదకు ఎక్కిన వ్యక్తి జారిపడి మరణించిన ఘటన తుగ్గలి మండలం కర్నూరు జిల్లాలో జరిగింది. ఉప్పరపల్లికి చెందిన పంపావతి(35) అనే యువకుడు గతంలో ఎలక్ట్రీషియన్ గా పనిచేసాడు. పాడైన స్తంభం మీద వైర్లు సరిచేసేందుకు ఎక్కిన అతను ప్రమాదవశాత్తు కింద పడ్డాడు. దీంతో తీవ్రంగా గాయపడిన అతన్ని కర్నూలు ఆసుపత్రికి తరలిస్తుండగా ప్రాణాలు వదిలాడు. మృతునికి భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. -
విద్యుత్‌షాక్‌తో ఎలక్ట్రీషియన్ మృతి
దామరచర్ల (నల్లగొండ) : విద్యుత్ షాక్‌తో ఎలక్ట్రీషియన్ మృతిచెందిన సంఘటన నల్లగొండ జిల్లా దామరచర్లలో మంగళవారం జరిగింది. వివరాల ప్రకారం.. మండల కేంద్రానికి చెందిన గరపాకల పాపయ్య(24) విద్యుత్ మోటర్లు, స్టాటర్లు రిపేర్ చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. ఈ క్రమంలో మంగళవారం స్టాటర్ రిపేర్ చేస్తున్న సమయంలో ప్రమాదవశాత్తు విద్యుదాఘాతానికి గురై అక్కడికక్కడే మృతిచెందాడు. -
జల్సాల కోసం చోరీలు
నిందితుడిని అరెస్టు చేసిన శంషాబాద్ పోలీసులు శంషాబాద్: జల్సాల కోసం ఓ ఎలక్ట్రీషియన్ చోరీల బాటపట్టాడు. గతంలో జైలుకెళ్లొచ్చినా అతడి బుద్ధి మారలేదు. శుక్రవారం శంషాబాద్ డీసీపీ ఏఆర్ శ్రీనివాస్ కేసు వివరాలు వెల్లడించారు. నిజామాబాద్ జిల్లా బోధన్‌కు చెందిన షేక్ సమీర్ హుస్సేన్ రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్ మండలం బండ్లగూడ జాగీర్‌లో తన సోదరుడితో కలసి ఉంటున్నాడు. తాళం వేసిన ఇళ్లను లక్ష్యంగా చేసుకుని చోరీలు చేయడంలో సమీర్ సిద్ధహస్తుడు. రెండుమూడు నెలలుగా రాజేంద్రనగర్, నార్సింగి ఠాణాల పరిధిలో పదిచోట్ల ఇళ్ల తాళాలు విరగొట్టి బంగారు ఆభరణాలు, వెండి, ల్యాప్‌టాప్‌లు, ఎల్ఈడీ టీవీలు చోరీ చేశాడు, చోరీ సొత్తును బోధన్ పట్టణంతోపాటు ముంబైలో విక్రయించి జల్సాలు చేసేవాడు. ఇటీవల సమీర్ 40 తులాల బంగారం, కిలోన్నర వెండి, మూడు ల్యాప్‌టాప్‌లు, ఎల్ఈడీ టీవీ, రెండు డిజిటల్ కెమెరాలు చోరీ చేశాడు. 35 తులాల బంగారంతోపాటు మిగతా వస్తువులన్నింటిని పోలీసులు అతడి నుంచి స్వాధీనం చేసుకున్నారు. సొత్తు విలువ సుమారు రూ.10 లక్షల వరకు ఉంటుందని తెలిపారు. బోధన్‌లో గతంలో యాభై తులాల మేరకు బంగారం చోరీ కేసులో సమీర్ జైలుకు వె ళ్లి వచ్చాడు. రెండురోజుల క్రితం వాహనాల తనిఖీల్లో సమీర్ తీరును అనుమానించిన పోలీసులు అతడిని అదుపులోకి తీసుకుని తమదైన శైలిలో విచారణ జరుపగా నేరం అంగీకరించాడు. నిందితుడిని రిమాండుకు తరలించారు. -
జైలుకెళ్లి వచ్చినా బుద్ధిమారలేదు..
శంషాబాద్: చెడు తిరుగుళ్లకు అలవాటు పడి దొంగతనాలనే వృత్తిగా ఎంచుకున్నాడు. ఒకసారి జైలు ఊచలు లెక్కబెట్టి వచ్చినా అతడి బుద్ధి మారలేదు. నిజామాబాద్ జిల్లా బోధన్ పట్టణానికి చెందిన షేక్ సమీర్ హుస్సేన్ ఎలక్ట్రీషియన్‌గా పని చేసేవాడు. సరదాలు తీర్చుకోవటానికి ఇతడు బోధన్‌లో 50 తులాల బంగారు ఆభరణాలను చోరీ చేసి, విక్రయించాడు. తాళం వేసి ఉన్న ఇళ్లే ఇతడి లక్ష్యం. అందులోనూ తాళం బలహీనంగా ఉన్న వాటిని మాత్రమే ఇతను ఎంచుకుంటాడు. ఈ రకమైన చోరీల్లో సమీర్ సిద్దహస్తుడుగా మారాడు. ఆయా కేసుల్లో జైలుకు కూడా వెళ్లివచ్చాడు. అయితే, తన బుద్ధి మాత్రం మార్చుకోలేదు. ప్రస్తుతం ఇతడు రాజేంద్రనగర్ మండలం బండ్లగూడ జాగీర్‌లో తన సోదరుడితో కలిసి నివాసముంటున్నాడు. గత రెండుమూడు నెలల్లోనే రాజేంద్రనగర్, నార్సింగి పరిధిలో మొత్తం పదిచోట్ల ఇళ్ల తాళాలు పగులగొట్టి బంగారు, వెండి ఆభరణాలతోపాటు ల్యాప్‌టాప్‌లు, ఎల్ఈడీ టీవీలు ఎత్తుకుపోయాడు. చోరీ సొత్తును బోధన్, ముంబయిలలో విక్రయించి ఆ సొమ్ముతో జల్సా చేసేవాడు. ఇప్పటి వరకు సమీర్ 40 తులాల బంగారం, కిలోన్నర వెండి, మూడు ల్యాప్‌టాప్‌లు, ఎల్ఈడీ టీవీ ఒకటి, రెండు డిజిటల్ కెమెరాలు చోరీ చేశాడు. రెండురోజుల కిందట వాహనాల తనిఖీలు చేపట్టిన పోలీసులు సమీర్‌ను అదుపులోకి తీసుకుని దర్యాప్తు చేపట్టారు. అతడిచ్చిన సమాచారం మేరకు బంగారం 35 తులాలతో పాటు మిగతా వస్తువులన్నీంటిని స్వాధీనం చేసుకున్నారు. వీటి విలువ పది లక్షల వరకు ఉంటుందని తెలిపారు. నిందితుడుని శుక్రవారం రిమాండ్‌కు తరలించారు. -
కరెంట్ షాక్‌తో ఎలక్ట్రీషియన్‌కు తీవ్రగాయాలు
ఆదిలాబాద్ (దండేపల్లి) : ఆదిలాబాద్ జిల్లా దండేపల్లి మండలం ముత్యంపేట గ్రామంలో కరెంటు షాక్ తగిలి అఫ్జల్ బేగ్(42) అనే ప్రైవేటు ఎలక్ట్రీషియన్‌కు తీవ్ర గాయాలయ్యాయి. విద్యుత్ స్తంభంపై బల్బులు బిగిస్తుండగా అకస్మాత్తుగా కరెంటు రావడంతో ఎలక్ట్రీషియన్ స్తంభంపై నుంచి కిందపడ్డాడు. వెంటనే బాధితుడ్ని లక్సెట్టిపేట ప్రభుత్వాసుపత్రికి తరలించారు. పరిస్థితి విషమంగా ఉండటంతో వైద్యుల సూచన మేరకు కరీంనగర్‌కు తీసుకెళ్లారు. విద్యుత్ అధికారుల నిర్లక్ష్యం వల్లే ఈ ప్రమాదం జరిగిందని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. -
తప్పెవరిది?
అధికారుల నిర్లక్ష్యం.. పట్టించుకోని వైఖరి.. నిధులలేమితో ప్రభుత్వాస్పత్రిలో రోగుల ప్రాణాలు పోతున్నాయి. రోజూ వందల సంఖ్యలో రోగులు వస్తున్నా సౌకర్యాలపై సీరియస్‌గా ఉండే అధికారే కనిపించడంలేదు. శుక్రవారం రాత్రి జరిగిన విద్యుత్ అంతరాయం వెనుక కథను పరిశీలిస్తే.. అధికారుల నిర్లక్ష్యమే కనిపిస్తుంది. కేబుల్ సమస్యపై వారం కిందటే ఎలక్ట్రీషియన్ లేఖ ఇచ్చినా పట్టించుకోని డొల్లతనమే స్పష్టమవుతుంది. - ప్రభుత్వాస్పత్రిలో పవర్ కట్ వివాదాస్పదం - వారం రోజుల కిందటే కేబుల్‌లో లోపాలు - వెంటనే చేయించాలని ఎలక్ట్రీషియన్ లేఖ - అధికారుల చుట్టూ తిరిగినా పట్టించుకోని వైనం లబ్బీపేట : ప్రభుత్వాస్పత్రిలో శుక్రవారం రాత్రి మూడు గంటల విద్యుత్ అంతరాయానికి అధికారుల నిర్లక్ష్యమే కారణమా? ఈ సమస్యపై వారం రోజుల కిందట ఎలక్ట్రీషియన్ ఇచ్చిన లేఖను పక్కన పెట్టడం వల్లే ఈ దుస్థితి ఏర్పడిందా..? అంటే అవునని సమాధానమే వస్తుంది. అయితే, తమకు లేఖ అందిన వెంటనే వైద్య ఆరోగ్యశాఖ మౌలిక సదుపాయాల కల్పన సంస్థ (ఏపీహెచ్‌ఎంఐడీసీ) అధికారులతో మాట్లాడామని ప్రభుత్వాస్పత్రి అధికారులు చెబుతున్నారు. మరమ్మతులు చేసే బాధ్యత వారిదేనంటున్నారు. కాగా, ఆస్పత్రిలో 24 గంటల విద్యుత్ సరఫరాకు ప్రత్యేక సబ్‌స్టేషన్ ఉన్నా కేవలం కేబుల్‌లో తలెత్తిన లోపం వల్లే సరఫరా నిలిచిపోవడంపై మంత్రులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. దీనిపై తప్పెవరిది, విచారణ అనంతరం ఎవరిని బాధ్యులను చేస్తారనే దానిపై ఉద్యోగులు, అధికారులు ఆందోళన చెందుతున్నారు. వారం కిందటే సమస్య మెడికల్ బ్లాక్‌కు వచ్చే కేబుల్‌లో ఈనెల 17వ తేదీనే సమస్య ఏర్పడింది. మూడు ఫేస్‌లలో ఒక ఫేస్ కేబుల్ కాలిపోవడంతో బ్లాక్‌లోని కొన్ని విభాగాల్లో విద్యుత్ నిలిచిపోయింది. దీంతో ఎలక్ట్రికల్ సిబ్బంది మూడు ఫేస్‌ల లోడ్‌ను రెండుఫేస్లపై సర్దుబాటు చేశారు. అనంతరం ఈనెల 18న.. కేబుల్‌ను తక్షణమే మార్చాలని, లేకుంటే విద్యుత్ సరఫరా నిలిచిపోయే ప్రమాదం ఉందంటూ రెసిడెంట్ మెడికల్ ఆఫీసర్‌కు లేఖ రాశారు. ఆమె ఏపీహెచ్‌ఎంఐడీసీ ఇంజినీర్లకు రిఫర్ చేస్తూ డిస్పాచ్‌లో ఇచ్చారు. ఇదే అంశాన్ని సూపరింటెండెంట్‌కు సైతం ఎలక్ట్రీషియన్ చెప్పడంతో ఆమె అప్పుడే ఫోన్లో ఇంజినీర్లతో మాట్లాడినట్టు తెలిసింది. ఎలక్ట్రీషియన్ లేఖ మాత్రం ఇంజినీర్లకు చేరకపోవడంతో వాళ్లు మరమ్మతుల విషయం పట్టించుకోలేదని సమాచారం. దీంతో శుక్రవారం రాత్రి కేబుల్‌లో షార్ట్ సర్క్యూట్ ఏర్పడి మూడు గంటల కరెంటు సరఫరా నిలిచిపోవడం, రోగులు ఇబ్బందులు పడటం వివాదాస్పదమైంది. అత్యవసర సర్వీసులకు సంబంధించి బ్యాకప్ కేబుల్ మెయింటైన్ చేయాల్సి ఉన్నా ప్రభుత్వాస్పత్రిలో అలాంటి పరిస్థితి లేదు. నిర్లక్ష్యం ఎవరిది? ఈ విషయంలో నిర్లక్ష్యం ఎవరిదనే విషయం ప్రశ్నార్థకంగా మారింది. ఇప్పటికే ఆస్పత్రిలో అత్యవసరంగా చేయాల్సిన అనేక పనులకు ఏపీహెచ్‌ఎంఐడీసీ ఇంజినీర్లు అంచనాలు రూపొందించినా నిధుల లేమితో పరిష్కరించలేని పరిస్థితి. ఇలాంటి పరిస్థితుల్లో కేబుల్‌ను ఏ నిధులు వెచ్చించి చేపడతారనే వాదన వినిపిస్తోంది. ఆస్పత్రి సూపరింటెండెంట్‌కు రోజుకు రూ.వెయ్యి మాత్రమే ఖర్చుచేసే అధికారం ఉంది. అంతకుమించి ఖర్చు చేయాలంటే కలెక్టర్ అనుమతి తీసుకోవాలి. ఇలాంటి పరిస్థితుల్లో కేబుల్‌ను రూ.15వేలు ఏ నిధులు కేటాయించి చేస్తారని ప్రశ్నిస్తున్నారు. బ్యాకప్ కేబుల్స్‌కు రంగంసిద్ధం ఆస్పత్రిలో బ్యాకప్ కేబుల్స్ తప్పనిసరిగా ఉండాలని ఏపీఎస్పీడీసీఎల్ ఎస్ఈ మోహనకృష్ణ సూచించడంతో తక్షణమే వాటిని ఏర్పాటు చేయాలని మంత్రి కామినేని శ్రీనివాస్‌తో పాటు ఎంపీ కేశినేని నాని ఆదేశించారు. దీంతో మూడు బ్లాక్‌లకు ఆల్టర్నేటివ్గా రెండో కేబుల్స్‌ను ఏర్పాటు చేసేందుకు ఇంజినీర్లు చర్యలు చేపట్టారు. దీంతో ఒక కేబుల్‌లో లోపం తలెత్తినా, మరో కేబుల్‌ను ఉపయోగించే అవకాశం ఉంది. ఆస్పత్రి లోపల కేబుల్స్ కాలిన ఘటనపై తమకు సంబంధం లేకున్నా రోగులు ఇబ్బంది పడతారనే తమ సిబ్బందిని రిపేరుకు పంపించామని మోహనకృష్ణ తెలిపారు. ఇక్కడ 24 గంటల విద్యుత్ సరఫరాకు ప్రత్యేక సబ్‌స్టేషన్ ఉందని పేర్కొన్నారు. -
కరెంట్ షాక్ తో ఇద్దరు ఎలక్ట్రీషియన్లు మృతి
పోడూరు : ప్రమాదవశాత్తూ కరెంట్ షాక్ తగిలి ఇద్దరు ఎలక్ట్రీషియన్లు గురువారం మృతి చెందారు. ఈ సంఘటన పశ్చిమగోదావరి జిల్లా పోడూరు మండలం జిన్నూరు గ్రామంలో జరిగింది. వివరాల్లోకి వెళ్తే... గూడాల జనార్దన్(55), నాగబాబు(35) అనే ఇద్దరు ఎలక్ట్రీషియన్లు జిన్నూరు గ్రామంలోని ఓ ఇంట్లో కరెంటు మరమ్మత్తు పనులు చేస్తుండగా కరెంట్ షాక్ తగలడంతో వారిద్దరూ అక్కడికక్కడే ప్రాణాలొదిలారు. -
ప్రాక్టికల్ విద్య అందితే సత్ఫలితాలు
ఎచ్చెర్ల: ఐటీఐల్లో ఏ ఏడాది మెరుగైన ప్రవేశాలు జరిగాయి. అయితే ఐటీఐల్లో విద్యార్థులకు ప్రాక్టికల్ విద్య సక్రమంగా అందితే మంచి ఫలితాలు వచ్చే అవకాశం ఉంది. ఐటీఐల్లో ఈ ఏడాది 3226 సీట్లకు గాను 2900 వరకు నిండిపోయాయి. ఫిట్టర్, ఎలక్ట్రీషియన్ వంటి ట్రేడుల్లో ప్రైవేటు కళాశాలల్లో సైతం దాదాపు సీట్లు నిండాయి. జిల్లాలో ఎచ్చెర్ల, శ్రీకాకుళం డీఎల్టీసీ, పలాస, సీతంపేట, రాజాంల్లో ఐదు ప్రభుత్వ ఐటీఐ, మరో 17 ప్రైవేటు ఐటీఐలు ఉన్నాయి. ప్రస్తుత ఉపాధి అవకాశాలు అంది పుచ్చుకోవాలంటే విద్యార్థులకు అవసరమైన నైపుణ్యాలు, పరిశ్రమల్లో వస్తున్న సాంకేతిక మార్పులు, పరిశ్రమలు అవసరాలు ముందుగా గుర్తించాలి. విద్యార్థులు క్షేత్ర స్థాయిలో పని చేయాల్సి ఉంటుంది. వీరి పని తీరును నిరంతరం ఇంజినీరింగ్ అధికారులు పర్యవేక్షిస్తారు. అందుకే ప్రతి ఐటీఐ విద్యార్థి నిరంతరం స్కిల్స్ నైపుణ్యం వృద్ధి చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఈ దిశగా ఐటీఐలు విద్యార్థులను తీర్చిదిద్దేందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలని పలువురు కోరుతున్నారు. రెండేళ్ల కోర్సుల్లో ఫిట్టర్, ఎలక్ట్రీషియన్, డ్రాఫ్ట్‌మెన్ సివిల్, ఎలక్ట్రానిక్స్ మెకానిక్, మోటార్ మెకానిక్, ఇన్స్ట్రుమెంటేషన్ మెకానికల్ నిర్వహిస్తుండగా, ఏడాది కోర్సులు వెల్డర్, కోపా, డీజిల్ మెకానిక్, కటింగ్ అండ్ సూయింగ్, ఫ్యాషన్ టెక్నాలజీ తదితర కోర్సులు నిర్వహిస్తున్నారు. ఈ ఏడాది మాజ్యూలరీ ఎంప్లాయ్మెంట్ స్కిల్ సంస్థ ఐటీఐల్లో డ్రాపౌట్ విద్యార్థులను గుర్తించి శిక్షణ ఇచ్చి ధ్రువీకరణ పత్రాలు అందజేస్తుంది. ఇప్పటికే ఇటువంటి కోర్సులను నేషనల్ అకాడమీ ఆఫ్ కనస్ట్రక్షన్స్ వంటి సంస్థలు నిర్వహిస్తున్నాయి. ప్రభుత్వ సంస్థల్లో తరగతుల నిర్వహణ, శిక్షణ కొంతవరకు మెరుగ్గా ఉన్నా ప్రైవేటు సంస్థల్లో మాత్రం అనుకున్న స్థాయిలో ఉండడం లేదన్న విమర్శలు వినిపిస్తున్నాయి. దీంతో విద్యార్థులు నైపుణ్యాల్లో వెనుకబడిన సందర్భాలున్నాయి. డీజీఈపీ వంటి సంస్థలు నిరంతరం పర్యవేక్షణ చేస్తేఇక్కడ సైతం శిక్షణ బాగా జరిగే అవకాశం ఉంటుంది. మారుతున్న సాంకేతిక పరిస్థితులకు అనుగుణంగా సిలబస్ మార్పు, ప్రయోగ విద్యకు ప్రాధాన్యత నివ్వడం, పరిశ్ర మల్లో విద్యార్థులకు ప్రయోగాలకు అవకాశం కల్పించడం, అధీకృత సంస్థల నిరంతర పరిశీలనతో విద్య మరెంత బలోపేతం అవుతుందని పలువురు అభిప్రాయపడుతున్నారు. ఐటీఐ అనంతరం విద్యార్థులు డిప్లమో, డిగ్రీ వంటి చదువు లకు ప్రాధాన్యత నిచ్చినా ఉపాధి అవకాశాలు మెరుగుపడతాయి. సెమిస్టర్ విధానంలో... గత ఏడాది నుంచి సెమిస్టర్ పద్ధతిలో ఐటీఐ పరీక్షలు ప్రవేశపెట్టారు. ఏడాది కోర్సు విద్యార్థులు రెండు, రెండేళ్ల కోర్సు విద్యార్థులు నాలుగు సెమిస్టర్ విధానంలో పరీక్షలు రాయాల్సి ఉంటుంది. పరీక్షలన్నీ ఆప్షన్ల విధానంలో ఉంటాయి. గతంలో థియరీ విధానంలో పరీక్షలు రాసేవారు. పరీక్ష రాసే విధానం సైతం దృష్టి సారించాల్సి ఉంది. విద్యలో రాణించాలంటే మాత్రం ప్రయోగ విద్యకు ప్రాధాన్యతను ఇవ్వాలి. కష్టబడి పనిచేయాలి ఐటీఐలో చేరే విద్యార్థి నిరంతరం శ్రమిం చాల్సి ఉంటుంది. జిల్లాలో పేద, మధ్య తరగతి విద్యార్థులు ఎక్కువగా ఈ కోర్సు ల్లో చేరుతున్నారు. పరిశ్రమల్లో సాంకేతి క మార్పులు గమనించి మెరుగైన విద్యను పొందాలి. ప్రభు త్వ ఉద్యోగాలకు సైతం ఎంపిక కావ చ్చు. -రాడ కైలాసరావు, జిల్లా ఐటీఐల క న్వీనర్ ఉపాధి కోసం చేరా నేను ఉపాధి అవకాశాలు అంది పుచ్చుకోవాలని ఐటీఐలో చేరాను. తక్కువ వయసులో ఉపాధి అవకాశాలు పొందడం ద్వారా మా కుటుంబానికి ఆర్థికంగా సహాయపడతాను. మా నాన్న కూడా ఐటీఐ చేసి ప్రైవేటుగా ఉద్యోగం చేస్తున్నారు. -ఎల్.అనూష, సివిల్, ఎచ్చెర్ల ఐటీఐ పరిశ్రమల్లో ఉపాధి కోసం.. నాకు 10 తరగతిలో 9.07 గ్రేడ్ మార్కులు వచ్చాయి. ఇంటర్మీడియెట్ అనంతరం ఉన్నత చదువులు చదివే ఆర్థిక స్థోమత లేదు. అందుకే ఐటీఐలో చేరా. ఐటీఐ అనంతరం ఉద్యోగ ఉపాధి అవకాశాలు అంది పుచ్చుకోవడమే నా లక్ష్యం. -జె.సంతోష్ కుమార్, ఫిట్టర్ ట్రేడ్, ఎచ్చెర్ల -
భయం.. భయం
నిర్మల్ : దేశం కాని దేశం.. ఉపాధి పొంది నాలుగు రాళ్లు సంపాదించుకుందామని అయిన వారిని వదులుకుని పోతే.. అక్కడా మనవాళ్లకు కష్టాలు తప్పడం లేదు. ఆ దేశంలో చోటుచేసుకున్న అల్లర్లు మన వాళ్లని గందరగోళానికి గురిచేయడమే కాకుండా ఉపాధిని దెబ్బతీస్తున్నాయి. ఇరాక్‌లో జరుగుతున్న అంతర్యుద్ధంతో వలసవాదులు, వారి కుటుంబీకులు నానా హైరానా పడుతున్నారు. అక్కడ తమ వారు ఎలా ఉన్నారోనంటూ నిత్యం వారి క్షేమ సమాచారాలు తెలుసుకుంటూ కాలం వెళ్లదీస్తున్నారు. అయితే.. జరుగుతున్న పరిణామాలతో అక్కడి వారిలోనూ, ఇక్కడ ఉన్న కుటుంబ సభ్యులూ భయాందోళనలకు గురవుతూనే ఉన్నారు. నిత్యం క్షేమ సమాచారాలు.. అంతర్యుద్ధం దృష్ట్యా అక్కడ ఉన్న వారు నిత్యం తమ క్షేమ సమాచారాలను కుటుంబీకులకు చేరవేస్తూనే ఉన్నారు. జరుగుతున్న దాడులకు, జిల్లా వాసులు ఉన్న ప్రాంతాలకు దూరభారం ఎక్కువగా ఉన్నట్లు అక్కడ ఉన్న వారు పేర్కొంటున్నారు. అయితే.. ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియక చాలా మంది ఆందోళనల మధ్య కాలం వెళ్లదీస్తున్నారు. ఓ పక్క ఉగ్రవాదులు ఆయా ప్రాంతాలను స్వాధీనం చేసుకున్నామంటూ చెబుతుండగా, అక్కడి ప్రభుత్వ దళాలు మాత్రం తమ అధీనంలోనే ఆ ప్రాంతాలు ఉన్నాయంటూ ప్రకటనలు చేస్తోంది. దీంతో ఎవరి ప్రకటన నిజమో తెలియక అక్కడికి ఉపాధి కోసం వెళ్లిన తమ వారి క్షేమ సమాచారాలను తెలుసుకుంటున్నారు. కంపెనీలు ఇండియాకు పంపడం లేదు.. ఎనిమిది నెలల క్రితం నేను ఎలక్ట్రీషియన్ పనిమీద ఇరాక్‌కు వచ్చాను. ఇక్కడికి వచ్చినప్పటి నుంచి ఆందోళనల మధ్యే పనిచేస్తున్నాను. వివిధ ప్రాంతాల ను ఆక్రమించుకుని, ఆజమాయిషి పెంచుకోవడానికి ఇరు జాతుల మధ్య దాడులు జరుగుతున్నాయి. మాకు సమీపంలోని కుర్దిస్థాన్ ఆర్బిల్ పట్టణానికి 120 కిలోమీటర్ల దూరంలో దాడులు జరుగుతున్నాయి. ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియడం లేదు. కొంత మంది ఇండియాకు వెళ్లిపోతామని కంపెనీలను అడిగినా క్యాంపుల్లోనే ఉంచుతున్నారు కానీ తిరిగి పంపడం లేదు. - కొక్కుల మహేశ్, ఖానాపూర్ రావడానికి సిద్ధంగా ఉన్న.. కుంటాల : బతుకుదెరువు కోసం భార్యపిల్లలను వదిలి రూ. 3 లక్షల అప్పు చేసి ఇరాక్ దేశానికి వచ్చాను. అకస్మాత్తుగా ఇక్కడ అంతర్యుద్ధం మొదలైంది. దీంతో ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని బతుకుతున్నం. నేను బాగ్దాద్‌కు 150 కిలోమీటర్ల దూరంలో ఉన్నాను. భార్యాపిల్లలను వదిలి 8 నెలల క్రితం బతుకుదెరువు కోసం వచ్చాను. ప్రైవేట్ కంపెనీలో డ్రైవర్‌గా పనిచేస్తున్న. జిహాదీలు, ప్రభుత్వ భద్రత బలగాల మధ్య హోరాహోరీ పోరు నడుస్తంది. నేను క్షేమంగానే ఉన్నానని ఇంటికి సమాచారం ఇచ్చా. స్వగ్రామానికి రావాలని నాతోపాటు మరో 20 మంది నిర్మల్, లక్ష్మణ్‌చాంద తదితర ప్రాంత వాసులు కంపెనీ ఎదుట రెండ్రోజులుగా ఎదురుచూస్తున్నం. అయినా.. మమ్మల్ని ఎవరూ పట్టించుకోవడం లేదు. ప్రభుత్వం స్పందించి మమ్మల్ని స్వగ్రామానికి తీసుకెళ్లాలి. - కూన గంగన్న, నందన్, కుంటాల మండలం జిల్లా నుంచి 300ల మందికి పైనే.. ఉన్న ఊరిలో ఉపాధి అవకాశాలు లేక, చేసే వ్యవసాయం లాభసాటిగా లేక, తమ కుటుంబాలను ఆర్థికంగా మంచి స్థానాల్లో ఉంచాలన్న ఆశతో ఎంతో మంది గల్ఫ్ దేశాలకు ఉపాధి నిమిత్తం వెళ్తున్నారు. అదే మాదిరిగా ఇరాక్ దేశానికి జిల్లాలోని నిర్మల్, ముథోల్, ఖానాపూర్ నియోజకవర్గాల నుంచి ఉపాధి నిమిత్తం వలస వెళ్లారు. దాదాపు 200 నుంచి 300 మంది వరకు అక్కడ వివిధ కంపెనీల్లో ఉపాధి పొందుతున్నారు. అయితే అక్కడ జరుగుతున్న అంతర్యుద్ధంతో వలదారుల్లో, కుటుంబాల్లో తీవ్ర ఆందోళనలు రేకెత్తుతున్నాయి. -
ట్రామాకేర్..లెస్సే!
శ్రీకాకుళం కలెక్టరేట్: పదే పదే జాబితాలు సవరిస్తున్నా.. మళ్లీ మళ్లీ అవే తప్పులు.. ఒక జాబితాలో ఉన్న పేరు మరో జాబి తాలో కనిపించదు. ఒక జాబితాలో అర్హులుగా ఉన్న వారే.. ఇంకో జాబితాలో అనర్హులుగా మారిపోతున్నారు. ఇవన్నీ రిమ్స్ అధికారుల లీలలు. అంతులేని నిర్లక్ష్యమో.. అలవిమాలిన అవినీతో.. రిమ్స్‌లోని ట్రామాకేర్ ఉద్యోగ నియామక ప్రక్రియను రోజుకో మలుపు తిప్పుతూ అభ్యర్థులను ఆందోళనకు గురి చేస్తోంది. గతంలో ప్రకటించిన ఎంపిక జాబితాలో ఎలక్ట్రీషియన్ పోస్టుకు సంపతిరావు సన్యాసిరావు అనే అభ్యర్థి ఎంపికైనట్లు పేర్కొన్నారు. తాజాగా మంగళవారం అర్ధరాత్రి విడుదల చేసిన జాబితాలో అతని పేరు గల్లంతైంది. పైగా ఈ పోస్టుకు అభ్యర్ధులే లేరని నోటు పెట్టి మరీ జాబితా విడుదల చేయడం విశేషం. ట్రామాకేర్ విభాగంలో వివిధ కేటగిరీలకు చెందిన 43 పోస్టుల భర్తీకి 2013 నవంబరు నెలలో నోటిఫికేషన్ విడుదల చేశారు. ఆ మేరకు పెద్ద సంఖ్యలో అందిన దరఖాస్తులను పరిశీలించి ఈ ఏడాది జనవరి 10, 11 తేదీల్లో మెరిట్ జాబితా విడుదల చేశారు. ఆ జాబితాలో పూర్తిగా తప్పులున్నాయని ఫిర్యాదలు రావడం.. తప్పులను ఎత్తిచూపుతూ ‘సాక్షి’లో పలు వార్తా కథనంలో ప్రచురితం కావడంతో ఆ జాబితాను నిలిపివేశారు. కాగా జనవరి 10నాటి జాబితాలో ఎలక్ట్రీషియన్ ఉద్యోగానికి రోస్టర్, మెరిట్ ఆధారంగా బీసీ-ఏ అభ్యర్థి సన్యాసిరావు ఎంపికైనట్టు ప్రకటిం చారు. ఈయనకు 74 మార్కులు రావడంతో బీసీ-ఏ కేట గిరీలో ఆయన్ను అర్హుడిగా పేర్కొంటూ జాబితాలో చేర్చారు. అయితే మంగళవారం విడుదల చేసిన తుది జాబితాలో తన పేరు కనిపించకపోవడంతో సన్యాసిరావు హతాశుడయ్యారు. దీనికి తోడు ఎలక్ట్రీషియన్ పోస్టుకు 80 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకుంటే.. అసలు దరఖాస్తులే లేవని, అర్హులు లేరని ఎంపిక జాబితా కింద అధికారులు ప్రత్యేక నోట్లో పేర్కొనడం పట్ల విస్మ యం వ్యక్తమవుతోంది. పైగా కలెక్టర్ ఆదేశాల మేరకే ఈ జాబితా రూపొందించామ ని పేర్కొనడం విశేషం. వాస్తవానికి మెరిట్ జాబితాను గానీ.. ఎంపిక జాబితాను గానీ కలెక్టర్ పరిశీలించిన దాఖలాలు లేవు. జనవరి నెలలో ప్రకటించిన మెరిట్ జాబితాలో తప్పులు ఉన్నాయని, రిమ్స్ అధికారులు అవినీతికి పాల్పడ్డారని ఆరోపణలు రావడంతోపాటు, పలువురు అభ్యర్థులు కలెక్టర్‌కు ఫిర్యాదు చేయడంతో సుమారు ఆరు నెలలపాటు ఈ నియామకాలు నిలిచిపోయాయి. ఎట్టకేలకు విడుదల చేసిన ఎంపిక జాబితాలోనూ అటువంటి తప్పులే పునరావృతం కావడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఇటువంటి తప్పులు చేయడం రిమ్స్ అధికారులకు ఇదే తొలిసారి కాదు. జాబితాలను తారుమారు చేసి తాము అనుకున్న వారికి.. కోరుకున్న చోట ఉద్యోగాలు ఇవ్వడం వారికి పరిపాటేనన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. -
కొరతను అధిగమిస్తేనే..
సాక్షి, హైదరాబాద్: అటు కేంద్రంలోను, ఇటు రెండు రాష్ట్రాల్లోనూ కొత్త ప్రభుత్వాలు కొలువుదీరాయి. ఇక నిర్మాణ రంగానికి ఊపిరి పోయడమే తరువాయి. భారత నిర్మాణ రంగానికి రానున్న ఐదేళ్లలో అధిక శాతం పెట్టుబడుల్ని ఆకర్షించే సత్తా ఉందని నిపుణులు చెబుతున్నారు. కాకపోతే మానవ వనరుల కొరతే ఈ రంగం అభివృద్ధికి విఘాతాన్ని కల్గిస్తోందంటున్నారు. నైపుణ్యం గల సిబ్బంది కొరతతో ప్రధాన పారిశ్రామికవాడల్లోని భారీ నిర్మాణాలు 12 నుంచి 18 నెలల ఆలస్యమవుతాయి. ముంబై, ఢిల్లీ, చెన్నై, హైదరాబాద్ తదితర నగరాల్లో మేస్త్రీలు, కార్పెంటర్లు, ప్లంబర్లు, ఎలక్ట్రీషియన్ల వంటివారి కొరత సుమారు 30 శాతం దాకా ఉంది. ప్రస్తుతం ఐదు కోట్ల మంది పనివారు అందుబాటులో ఉండగా.. కేవలం రెండు కోట్ల మందికే నైపుణ్యముంది. సివిల్ ఇంజనీర్లు, ఆర్కిటెక్టులు, ప్లానర్ల విషయానికొస్తే గిరాకీ, సరఫరాల మధ్య వ్యత్యాసం 82-86 శాతంగా ఉంది. రానున్న ఐదేళ్లలో 40 లక్షల మంది సివిల్ ఇంజనీర్ల అవసరముంటుంది. ఇందుకు గాను ప్రస్తుతం 6.42 లక్షల మంది అందుబాటులో ఉన్నారు. 3.96 లక్షల మంది ఆర్కిటెక్టుల స్థానంలో 65 వేల మంది, 1.19 లక్షల ప్లానర్లకు బదులు 18 వేలే అందుబాటులో ఉన్నారు. మొత్తానికి 2012 నుంచి 2020 మధ్యలో 45 లక్షల మంది నిపుణులు కావాల్సి ఉంటుంది. కొరతను తీర్చే మార్గమిదే.. విదేశాల్లో మాదిరిగా మనం కూడా నిర్మాణ రంగంలో సాంకేతిక పరిజ్ఞానాన్ని మరింతగా వినియోగించాలి. ఈ తరహా నిర్మాణాల్ని చేపట్టేవారికి ప్రభుత్వం పన్ను రాయితీలు కల్పించాలి. అభివృద్ధి చెందిన దేశాల్లో తలసరి ఉక్కు వినియోగం దాదాపు 150-200 కిలోలుంటే మన దేశంలో చూస్తే సుమారు 40 కిలోలుగా ఉంది. ఈ వ్యత్యాసాన్ని తగ్గించాలి. ఉక్కు నిర్మాణాల్ని కడితే మేస్త్రీలు, కార్పెంటర్లు, బార్ బెండర్లు తదితరుల మీద ఆధారపడాల్సిన అవసరం తగ్గుతుంది. సివిల్ ఇంజనీరింగ్, ఆర్కిటెక్చర్, ప్లానింగ్, కళాశాలల్లో సీట్లను పెంచాలి. భవన నిర్మాణ కార్మికుల నైపుణ్యాన్ని పెంపొందించడానికి ప్రభుత్వం శ్రద్ధ తీసుకోవాలి.