![విద్యుదాఘాతంతో లైన్‌మన్ మృతి - Sakshi](/styles/webp/s3/article_images/2017/09/5/81498836491_625x300.jpg.webp?itok=3b6geXnX)
విద్యుదాఘాతంతో లైన్‌మన్ మృతి
ఖమ్మం: విద్యుదాఘాతంతో ఓ లైన్‌మన్ మృతిచెందాడు. జిల్లాలోని కూసుమంచి మండలం మల్లాయిగూడెం శివారు రాజుతండాలో ఈ సంఘటన జరిగింది. గోరిలాపాడు తండాకు చెందిన ప్రైవేట్ ఎలక్ట్రీషియన్ తేజవత్ లక్మణ్ (35) ట్రాన్స్ ఫార్మర్‌కు కనెక్షన్ ఇచ్చేందుకు స్తంభం ఎక్కాడు. ఈలోగా ఎల్‌సి అన్ చేయటంతో విద్యుదాఘాతానికి గురై అతను స్తంభంపైనే మృతి చెందాడు. తమకు న్యాయం చేయాలని కోరుతూ అతని కుటుంబ సభ్యులు ఆందోళన చేస్తున్నారు.