మహబూబ్‌నగర్ జిల్లా గట్టు మండలం గంగిమాన్‌దొడ్డి గ్రామంలో మంగళవారం ఉదయం విద్యుదాఘాతంతో ఇద్దరు రైతులు మృతిచెందారు.
మహబూబ్‌నగర్ జిల్లా గట్టు మండలం గంగిమాన్‌దొడ్డి గ్రామంలో మంగళవారం ఉదయం విద్యుదాఘాతంతో ఇద్దరు రైతులు మృతిచెందారు. గ్రామానికి చెందిన ఎర్రప్ప (42), పెద్దబావి వీరన్న(40) అ’ఏ రైతులు పత్తి పంటకు నీళ్లు పెట్టేందుకు పొలానికి వెళ్లి మోటారు ఆన్ చేస్తుండ గా కరెంట్ షాక్ తగిలి ఇద్దరూ అక్కడికక్కడే మృతిచెందారు. గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. గట్టు సబ్‌ఇన్‌స్పెక్టర్ రాంబాబు సంఘటన స్థలాన్ని పరిశీలించారు.