veeranna
-
మీరు గెలిచింది దీనికోసమేనా? ఫీల్డ్ అసిస్టెంట్ హత్యపై విరూపాక్షి స్ట్రాంగ్ రియాక్షన్
-
పవన్ పై నిమ్మల వీరన్న ఫైర్
-
పరీక్ష మధ్యలో వెళ్లి ఉరేసుకుని..
సాక్షి, హైదరాబాద్/నిర్మల్ చైన్‌గేట్/భైంసా: పరీక్షలు రాస్తున్న విద్యార్థిని.. ఉన్నట్టుండి మధ్యలో లేచి వెళ్లిపోయింది.. అలాగని హాస్టల్ గదికి కాకుండా బాత్రూంలోకి వెళ్లింది.. అందులోని ఎగ్జాస్ట్ ఫ్యాన్‌కు చున్నీతో ఉరివేసుకుంది. నిర్మల్ జిల్లా బాసరలోని ట్రిపుల్‌ఐటీలో మంగళవారం ఉదయం జరిగిన ఈ ఘటన కలకలం రేపుతోంది. పరీక్షల ఒత్తిడితోనే ఆమె ఆత్మహత్యకు పాల్పడినట్టు ట్రిపుల్ ఐటీ అధికారులు చెప్తున్నారు. అయితే పరీక్ష హాల్లో మాస్ కాపీయింగ్‌కు పాల్పడుతున్నారంటూ పలువురు విద్యార్థులను పరీక్ష సిబ్బంది, చీఫ్ వార్డెన్ మందలించారని.. దీనితో ఆందోళనకు లోనైన దీపిక బలవన్మరణానికి పాల్పడిందని విద్యార్థులు అంటున్నారు. విద్యార్థులు, తల్లిదండ్రుల ఆందోళన సంగారెడ్డి జిల్లా వట్పల్లి మండలం గొర్రెకల్ గ్రామానికి చెందిన వడ్ల దీపిక.. బాసర ఆర్జీయూకేటీలో పీయూసీ–1 చదువుతోంది. మంగళవారం ట్రిపుల్‌ఐటీలో జరిగిన పరీక్షకు హాజరైంది. అయితే మధ్యలోనే ఆమె పరీక్ష హాల్ నుంచి బయటికి వెళ్లిపోయింది. హాస్టల్ గదికి వెళ్లాల్సిన ఆమె.. పరీక్ష హాల్ సమీపంలో ఉన్న బాత్రూంలోకి వెళ్లింది. చాలాసేపైనా ఆమె బయటికి రాకపోవడం, పిలిచినా పలకకపోవడంతో అక్కడివారు వెంటనే సెక్యూరిటీ సిబ్బందికి సమాచారం ఇచ్చారు. వారు తలుపులు బద్దలుకొట్టి చూడగా.. దీపిక బాత్రూంలోని ఎగ్జాస్ట్ ఫ్యాన్‌కు చున్నీతో ఉరివేసుకుని కనిపించింది. ఆమెను వెంటనే క్యాంపస్‌లోని హెల్త్ సెంటర్‌కు.. అక్కడి నుంచి భైంసాలోని ఏరియా ఆస్పత్రికి తరలించారు. కానీ అప్పటికే విద్యార్థిని మృతిచెందినట్టు వైద్యులు ధ్రువీకరించారు. దీంతో పోస్టుమార్టం నిమిత్తం విద్యార్థిని మృతదేహాన్ని నిర్మల్‌కు తరలించారు. దీనిపై ఆమె కుటుంబ సభ్యులకు సమాచారమిచ్చారు. అయితే విద్యార్థిని దీపిక ఆత్మహత్య విషయం చాలాసేపు బయటికి రాకుండా అధికారులు కట్టుదిట్టం చేశారు. ట్రిపుల్ ఐటీ ప్రధాన ద్వారం వద్ద పోలీసులను మోహరించారు. లోనికి ఎవరినీ అనుమతించలేదు. విషయం తెలుసుకున్న విద్యార్థి, ప్రజాసంఘాలు, ప్రతిపక్షాల నాయకులు, విద్యార్థుల తల్లిదండ్రులు గేటు వద్ద ఆందోళనకు దిగారు. దీపిక ఆత్మహత్యపై అనుమానాలు ఉన్నాయని, ఈ ఘటనపై సమగ్ర విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. పరీక్షల ఒత్తిడి అంటున్న అధికారులు పరీక్షల ఒత్తిడి కారణంగానే దీపిక ఆత్మహత్యకు పాల్పడినట్టు భావిస్తున్నామని ట్రిపుల్ఐటీ డైరెక్టర్ సతీశ్‌కుమార్ చెప్పారు. ట్రిపుల్‌ఐటీలో ముగ్గురు సభ్యులతో కౌన్సెలింగ్ డిపార్ట్మెంట్ ఉందని, కౌన్సెలింగ్ నిర్వహిస్తున్నా మని తెలిపారు. అయినా ఈ ఘటన చోటుచేసుకో వడం బాధాకరమన్నారు. దీపిక ఆత్మహత్యకు సంబంధించి పూర్తి వివరాలు తేల్చేందుకు నలుగురు సభ్యులతో నిజ నిర్ధారణ కమిటీని ఏర్పాటు చేశామని వివరించారు. నా బిడ్డను వేధించారు ట్రిపుల్ఐటీ సిబ్బంది, అధికారులు తన బిడ్డను వేధించారని, లేనిపోని విషయాలు చెప్పి భయభ్రాంతులకు గురిచేశారని దీపిక తండ్రి వడ్ల వీరన్న ఆరోపించారు. ట్రిపుల్ ఐటీ అధికారులు కొన్ని రోజుల క్రితం తనను పిలిపించి ఆమె వాట్సాప్‌లో చాటింగ్‌లు చేస్తోందని ఆరోపించారని వివరించారు. తన బిడ్డను అడిగితే.. ట్రిపుల్‌ఐటీలో కొందరు తనపై కక్షగట్టి ఇలా చేశారంటూ కన్నీళ్లు పెట్టుకుందని తెలిపారు. ఈ విషయాన్ని వార్డెన్‌కు, ఉన్నతాధికారులకు వివరించేందుకు తాను ప్రయత్నించినా.. పట్టించుకోలేదన్నారు. తన బిడ్డకు కౌన్సెలింగ్ చేసి దారిలో పెడతానని రాసివ్వాలని ఒత్తిడి చేశారని.. లేకుంటే సీటు రద్దు చేసి ఇంటికి పంపుతామని బెదిరించారని ఆరోపించారు. ఆ తర్వాత కూడా పలుమార్లు దీపిక తమకు ఫోన్ చేసి సిబ్బంది అనేక రకాలుగా వేధిస్తున్నారంటూ ఆందోళన వ్యక్తం చేసిందని తెలిపారు. పత్తాలేని ట్రిపుల్ఐటీ అధికారులు దీపిక చనిపోయి కొన్ని గంటలు గడిచినా, రెండు ఆస్పత్రులకు మృతదేహాన్ని తరలించినా.. ట్రిపుల్ఐటీ అధికారులు, అధ్యాపకులెవరూ రాకపోవడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. బాసరకు సమీపంలోనే మెరుౖగెన వైద్యసేవలు అందే నిజామాబాద్ పట్టణం ఉండగా.. ఆమెను భైంసాకు ఎందుకు తరలించారని దీపిక బంధువులు, బీజేపీ నేతలు మండిపడ్డారు. ఆమె మృతికి వర్సిటీ అధికారులే బాధ్యత వహించాలన్నారు. సమగ్ర విచారణ జరపాల్సిందే.. ట్రిపుల్ ఐటీలో విద్యార్థిని దీపిక ఆత్మహత్యపై అనేక అనుమానాలు ఉన్నాయని, దీనిపై సమగ్ర విచారణ జరపాలని ఏబీవీపీ వర్కింగ్ కమిటీ సభ్యుడు ప్రవీణ్‌రెడ్డి, ఎస్ఎఫ్ఐ రాష్ట్ర కార్యదర్శి నాగరాజు డిమాండ్ చేశారు. ట్రిపుల్‌ఐటీలో విద్యార్థులపై వేధింపులను అరికట్టడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని మండిపడ్డారు. కాగా దీపిక ఆత్మహత్యకు ట్రిపుల్ ఐటీ అధికారులు కారణం చెప్పేంత వరకు ఆమె మృతదేహానికి పోస్టుమార్టం చేసేందుకు అంగీకరించేది లేదని తండ్రి వీరన్న తేల్చి చెప్పారు. ఏడాదిలో ముగ్గురు ఆర్జీయూకేటీలో సమస్యలను పరిష్కరించాలంటూ ట్రిపుల్ ఐటీ విద్యార్థులు ఆందోళనకు దిగి మంగళవారం నేటికి ఏడాది అవుతోంది. రెగ్యులర్ వీసీని నియమించాలని, అధ్యాపకుల సంఖ్యను పెంచాలని, ఇతర వర్సిటీలతో అనుసంధానం చేయాలని, కనీస సౌకర్యాలను మెరుగుపర్చాలని డిమాండ్ చేస్తూ ఎండనకా, వాననకా వారం పాటు ఉద్యమించారు. విద్యా మంత్రి సబితా ఇంద్రారెడ్డి వర్సిటీకి వచ్చి హామీ ఇవ్వడంతో నిరసన విరమించారు. నాటి నుంచి ఇప్పటివరకు ట్రిపుల్‌ఐటీలో ముగ్గురు విద్యార్థులు ఆత్మహత్యలకు పాల్పడటం కలకలం రేపుతోంది. బిడ్డ మార్చురీలో.. తండ్రి ఐసీయూలో.. దీపిక మృతిపై ట్రిపుల్ఐటీ అధికారులు ఆలస్యంగా సమాచారం ఇవ్వడంతో ఆమె తండ్రి వీరన్న.. మంగళవారం సాయంత్రం పొద్దుపోయాక నిర్మల్ జిల్లా ఆస్పత్రి వద్దకు చేరుకున్నారు. అప్పటికే పలువురు బంధువులు, బీజేపీ నేతలు కూడా ఆస్పత్రి వద్దకు వచ్చారు. పోలీసులు తండ్రిని తప్ప మరెవరినీ ఆస్పత్రిలోకి వెళ్లనివ్వలేదు. దీనితో బంధువులు, బీజేపీ నేతలకు పోలీసులకు వాగ్వాదం జరిగింది. ఆస్పత్రిలో బిడ్డ మృతదేహాన్ని ఉంచిన మార్చురీవైపు వెళ్తుండగానే వీరన్న ఛాతీలో నొప్పితో తీవ్ర అస్వస్థతకు గురయ్యాడు. దీనితో వెంటనే ఆయనను ఆస్పత్రిలోని ఐసీయూకు తరలించి చికిత్స అందిస్తున్నారు. ఓ వైపు మార్చురీలో బిడ్డ మృతదేహం ఉండగా.. అదే ఆస్పత్రి ఐసీయూలో తండ్రికి చికిత్స జరుగుతుండటం అందరినీ కన్నీరు పెట్టించింది. ఘటనపై కమిటీ వేశాం ఎంతో భవిష్యత్తు ఉన్న విద్యార్థిని దీపిక ఆత్మహత్య చేసుకోవడం దురదృష్టకరం. ఈ ఘటన షాక్‌కు గురిచేసింది. ఇంజనీరింగ్ ఫలితాల విడుదల నేపథ్యంలోనే నేను హైదరాబాద్‌లో ఉన్నాను. అసలేం జరిగిందో పూర్తి వివరాలు తెలుసుకునేందుకు నలుగురు సభ్యులతో అంతర్గత నిజ నిర్ధారణ కమిటీ వేశాం. త్వరలోనే ఘటనకు కారణాలు తెలుస్తాయి. విద్యార్థులు ఒత్తిడికి గురి కావద్దు. – వెంకటరమణ, ఇన్చార్జి వీసీ, ఆర్జీయూకేటీ -
వివాహేతర సంబంధం: ఒకరి హత్య
గోనెగండ్ల: కర్నూలు జిల్లా గోనెగండ్ల మండలం పెద్దమర్రివీడు గ్రామంలో దారుణం చోటు చేసుకుంది. గ్రామానికి చెందిన వీరన్న(26) అనే యువకుడు ఓ వివాహితతో కొంతకాలంగా వివాహేతర సంబంధం కొనసాగిస్తున్నాడు. గురువారం మధ్యాహ్నం ఆమె ఇంట్లోనే వీరన్న దారుణ హత్యకు గురయ్యాడు. ఆమెతో సన్నిహితంగా ఉండటం గమనించి భర్తే, వీరన్న తలపై మోది చంపి ఉంటాడని అనుమానిస్తున్నారు. ఈ ఘటనపై గ్రామస్తుల సమాచారం మేరకు పోలీసులు సంఘటనాస్థలానికి చేరుకున్నారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
శభాష్ వీరన్న
కోడిపుంజుల వాగులో చిక్కుకున్న వ్యక్తిని కాపాడిన మణుగూరు కానిస్టేబుల్ మణుగూరు : ఒక్కసారిగా పెరిగిన వరదతో ఉధృతంగా ప్రవహిస్తున్న కోడిపుంజుల వాగు లో కొట్టుకుపోయి అదృష్టవశాత్తూ మధ్యలో ఓ చెట్టును పట్టుకొని..బిక్కుబిక్కుమంటున్న వ్యక్తిని మణుగూరు కానిస్టేబుల్ గుగులోతు వీరన్న సాహసోపేతంగా కాపాడారు. రాత్రిపూట, చిమ్మచీకటిలో.. తాడు ద్వా రా అతని వద్దకు వెళ్లి క్షేమంగా ఒడ్డుకు చేర్చి అందరి ప్రశంసలందుకున్నారు. తెలిసింది 11గంటలకు.. రెండు గంటలు శ్రమించి ఒడ్డుకు.. ఎడతెరిపి లేని వానతో సోమవారం మణుగూరు వద్ద కోడిపుంజుల వాగు ఉధృతంగా ప్రవహిస్తోంది. అదే రోజు రాత్రి 10 గంటల సమయంలో బొంబాయికాలనీ రైల్వేగేటు వద్ద అర్జు¯ŒSరావు అనే ఓ ప్రైవేట్ డ్రైవరు ప్రమాదవశాత్తూ వాగులోకి జారిపడి గల్లంతయ్యాడు. దాదాపు పావు కిలోమీటరు దూరం కొట్టుకుపోయి..వాగు మధ్యలో ఓ చెట్టును పట్టుకొని ఆగాడు. చుట్టూ చిమ్మచీకటి..పైగా వరద హోరుతో బెంబేలెత్తి ‘కాపాడండి..’ అంటూ బిగ్గరగా అరవసాగాడు. సమీపంలోని అరుపులు విని..రోడ్డుపైకి వచ్చింది. అదే సమయంలో జలమయమైన అశోక్‌నగర్, వెంకటపతినగర్, ఎస్టీ బాలుర, బాలికల వసతిగృహాల ప్రాంతాల వారిని సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్న అధికారుల వద్దకు పరుగెత్తి విషయం వివరించింది. తహసీల్దార్తిరుమలాచారి, సీఐ పెద్దన్నకుమార్, ఏఎస్ఐ రాంబాబు, ఆర్ఐ కృష్ణప్రసాద్, వీఆర్వోలు లక్ష్మణ్‌రావు, రామ్మూర్తి రైల్వేగేటు వద్ద నుంచి అతడు చిక్కుకున్న ప్రాంత సమీపానికి వెళ్లి చీకటిలో ఏం చేయా లో తెలియక తర్జనభర్జన పడసాగారు. ఈ క్రమంలో మణుగూరు పోలీస్ స్టేష¯ŒSలో విధు లు నిర్వహిస్తున్న కానిస్టేబుల్ వీరన్న తాడు సాయంతో వాగులోకి దిగాడు. మెడ వరకు మునిగేలా వరద పారుతున్నా..చుట్టూ చీకటిలో ఏమీ కనిపించకపోయినా..ఒడ్డున ఉన్న వారు టార్చ్‌లైట్ వెలుతురు కొడుతుంటే..ధైర్యంగా నడివాగులో ఉన్న వ్యక్తి వద్దకు చేరుకున్నాడు. రాత్రి 11 గంటల సమయంలో ఈ రక్షణ చర్య చేపట్టగా..ఆ ప్రైవేట్ డ్రైవర్‌ను రాత్రి ఒంటి గంట సమయంలో తాడు ద్వారా సురక్షితంగా ఒడ్డుకు చేర్చాడు. ఉప్పొంగుతున్న వాగులో సాహసోపేతంగా ఓ వ్యక్తి ప్రాణాలను కాపాడిన కానిస్టేబుల్ వీరన్నను సీఐ పెద్దన్నకుమార్, తహసీల్దార్ తిరుమలాచారి, స్థానికులు అభినందించారు. -
కరెంట్ షాక్‌తో ఇద్దరు రైతుల దుర్మరణం
మహబూబ్‌నగర్ జిల్లా గట్టు మండలం గంగిమాన్‌దొడ్డి గ్రామంలో మంగళవారం ఉదయం విద్యుదాఘాతంతో ఇద్దరు రైతులు మృతిచెందారు. గ్రామానికి చెందిన ఎర్రప్ప (42), పెద్దబావి వీరన్న(40) అ’ఏ రైతులు పత్తి పంటకు నీళ్లు పెట్టేందుకు పొలానికి వెళ్లి మోటారు ఆన్ చేస్తుండ గా కరెంట్ షాక్ తగిలి ఇద్దరూ అక్కడికక్కడే మృతిచెందారు. గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. గట్టు సబ్ఇన్స్పెక్టర్ రాంబాబు సంఘటన స్థలాన్ని పరిశీలించారు. -
కాలిన గాయాలతో ఇద్దరి మృతి
మెదక్ జిల్లా జిన్నారం మండలం ఐడీఏ బొల్లారం బాలాజీ నగర్లో ఓ కుటుంబం పై నిన్న జరిగిన హత్య యత్నంలో చికిత్స పొందుతూ ఇద్దరు మృతిచెందారు. కాలిన గాయాలతో ఆస్పత్రి పాలైన సుంకయ్యతో పాటు వీరన్న(5) అనే చిన్నారి మృతిచెందింది. నిన్న తెల్లవారుజామున సుంకయ్య కుటుంబం నిద్రిస్తుండగా.. గుర్తుతెలియని దుండగులు ఇంటికి నిప్పు పెట్టారు. దీంతో సగం కాలిన గాయాలతో ఆస్పత్రికి తరలించగా.. గాంధీ ఆస్పత్రిలో చికిత్స పొందుతు ఇద్దరు మృతిచెందారు. -
ఈరన్న సన్నిధిలో డీఐజీ
మంత్రాలయం : డీఐజీ రమణకుమార్ మంగళవారం సతీసమేతంగా ఉరుకుంద క్షేత్రానికి వెళ్లి ఈరన్నస్వామిని దర్శించుకున్నారు. సూపరింటెండెంట్ వెంకటేశ్వరరావు నేతత్వంలో అర్చకులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. అనంతరం డీఐజీ దంపతులు స్వామివారి మూలవిరాట్‌ను దర్శించుకుని పూజలు నిర్వహించారు. శ్రావణమాస ఉత్సవాల ఏర్పాట్లను పర్యవేక్షించారు. ఆయన వెంట డీఎస్పీ కొల్లి శ్రీనివాస్, సీఐలు నాగేశ్వరావు, దైవప్రసాద్, ఎస్ఐ నల్లప్ప, సీనియర్ అసిస్టెంట్ రమేష్ ఉన్నారు. -
పిడుగుపాటుకు వ్యక్తి మృతి..
-ఇద్దరికి తీవ్ర గాయాలు గట్టు కర్ణాటక రాష్ట్రంలో పిడుగుపాటుకు గురై మహబూబ్‌నగర్ జిల్లా గట్టు మండలానికి చెందిన గొర్రెల కాపరి ప్రాణాలు కోల్పోయాడు. చింతలకుంట గ్రామానికి చెందిన కొందరు గొర్రెల పెంపకం దారులు స్థానికంగా పశుగ్రాసానికి కొరత ఏర్పడడంతో రెండు నెలల క్రితం కర్ణాటకకు వలస వెళ్లారు. వర్షాలు ప్రారంభం అవుతుండడంతో శనివారం స్వగ్రామానికి తిరిగి వస్తున్నారు. ఈ క్రమంలో రాత్రి రాయచూర్ సమీపంలోని గోనారం వద్ద ఆగారు. ఆ సమయంలో పిడుగు పడడంతో కుర్వ వీరన్న (30) మృతి చెందగా, మరో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. వారిని రాయచోటి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. -
రెండు రోజుల్లో పెళ్లి.. వరుడి ఆత్మహత్య
వరంగల్ (నెల్లికుదురు): రెండు రోజుల్లో అతని పెళ్లి.. అయితే, దొంగబంగారం కేసులో అకారణంగా తన పేరు చెప్పారని మనో వేదనకు గురైన వరుడు క్రిమిసంహారక మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన వరంగల్ జిల్లా నెల్లికుదురు మండలం చిన్నముప్పారంలో మంగళవారం రాత్రి జరిగింది. వివరాలు.. చిన్నముప్పారం గ్రామానికి చెందిన పిట్టల వీరన్న(23) వివాహం ఈ నెల 27న చేసేందుకు పెద్దలు అన్ని ఏర్పాట్లు చేశారు. ఈ క్రమంలో బంగారు ఆభరణాల చోరీ కేసులో నెల్లికుదురు మండలం శ్రీరామగిరికి చెందిన ఓ మహిళను ఖమ్మం సీసీఎస్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. విచారణలో ఆమె పిట్టల వీరన్నకు చెవి కమ్మలు, పట్టీలు ఇచ్చినట్లు చెప్పింది. దీంతో పోలీసులు ఈ నెల 22 గ్రామానికి వచ్చి వీరన్నను అదుపులోకి తీసుకోగా, గ్రామస్తులు విజ్ఞప్తి మేరకు వదిలిపెట్టారు. ఈ నెల 23న వీరన్నను సర్పంచ్‌తో సహా గ్రామపెద్దలు ఖమ్మం పోలీస్‌స్టేషన్‌కు తీసుకెళ్లి.. తీసుకొచ్చారు. ఈ క్రమంలో మంగళవారం సాయంత్రి వీరన్న సూసైడ్ నోట్ రాసి పెట్టి ఆత్మహత్య చేసుకున్నాడు. -
రూ.14 వేల కోసం హత్య
రిటైర్డ్ లైన్‌మన్ హత్య కేసు ఛేదింపు వివరాలు వెల్లడించిన డీఎస్పీ మల్లికార్జునవర్మ అనంతపురం క్రైం : అప్పు ఇచ్చి ఆదుకున్న ఓ రిటైర్డ్ లైన్‌మన్‌ను కేవలం రూ. 14 వేలు కోసం హత్య చేసిన కేసును ఆత్మకూరు పోలీసులు ఛేదించారు. హంతకులను అరెస్టు చేశారు. వారి నుంచి రూ. 50 వేలు విలువచేసే బంగారు అభరణాలు, ఒక ద్విచక్రవాహనం స్వాధీనం చేసుకున్నారు. ఈ కేసుకు సంబంధించిన వివరాలను స్థానిక పోలీసు కాన్ఫరెన్స్ హాలులో సోమవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో డీఎస్పీ మల్లికార్జునవర్మ వెల్లడించారు. ఆయన మాటల్లో... ఈ ఏడాది జనవరి 20న ఆత్మకూరు మండలం పంపనూరు అటవీక్షేత్రంలో రిటైర్డ్ లైన్‌మన్ కుసులూరు వీరన్న (70) హత్యకు గురయ్యాడు. డీఎస్పీ తీవ్రంగా పరిగణించారు. కేసు ఛేదించాలని సిబ్బందిని ఆదేశించారు. ఈ క్రమంలో ఆత్మకూరు సీఐ శివనారాయణస్వామి, ఎస్ఐలు డి.టి.హుసేన్, జి.ఎస్.రాయుడు, ఏఎస్ఐ అయూబ్‌ఖాన్, హెడ్‌కానిస్టేబుళ్లు సూర్యనారాయణ, రాజశేఖర్, నరసింహులు, గోపాల కానిస్టేబుళ్లు జగదీష్, పాండవ, ఈశ్వర్‌నాయక్, సుధాకర్, బసన్న, రఫి, మహేష్, నాగవేణి, హోంగార్డు రమణ ప్రత్యేక బృందంగా ఏర్పడ్డారు. విచారణ ముమ్మరం చేశారు. పక్కా సమాచారం అందడంతో సోమవారం నిందితులైన పామిడి మండలం కత్రిమలకు చెందిన బండి నాగేంద్ర, నీలం మాధవిని అరెస్టు చేశారు. ఇదీ నేపథ్యం.. వీరన్న ట్రాన్స్‌కోలో లైన్‌మన్‌గా పని చేసి రిటైర్డ్ అయ్యాడు. జేఎన్టీయూ సమీపంలోని ఇందిరమ్మకాలనీలో నివాసం ఉంటున్నాడు. ఇతనికి నిందితుల్లో ఒకరైన బండి నాగేంద్ర వరుసకు అల్లుడవుతాడు. నెలకిందట నాగేంద్ర వీరన్న వద్ద రూ. 14 అప్పుగా తీసుకున్నాడు. డబ్బు చెల్లించమని ఒత్తిడి చేస్తుండటంతో ప్రియురాలితో కలిసి హత్య చేశాడు. కఠినంగా వ్యవహరిస్తాం : డీఎస్పీ పవిత్ర పరసరాలను అపవిత్రం చేస్తే కఠినంగా వ్యవహరిస్తామని డీఎస్పీ మల్లికార్జునవర్మ హెచ్చరించారు. ఆత్మకూరు మండలం పంపనూరు పరిసరాలు చాలా పవిత్రమైనవని, అక్కడ అసాంఘిక కార్యకలాపాలు, నేరాలకు పాల్పడితే చర్యలు తప్పవన్నారు. ఇకపై అక్కడ పోలీసు నిఘా పెంచుతామని తెలిపారు. ప్రజలు కూడా సహకరించాలని కోరారు. -
ఉపాధి సిబ్బందిపై కలెక్టర్ ఆగ్రహం
ఆలూరు రూరల్: జాతీయ ఉపాధి హామీ పథకం కింద రైతుల పొలాల గట్లపై మొక్కలను పెంచేందుకు ప్రభుత్వం కేటాయించిన నిధులు ఖర్చు అయినా ఎలాంటి ప్రయోజనం కనబడడం లేదంటూ జిల్లా కలెక్టర్ సీహెచ్ విజయమోహన్ గురువారం ఆలూరు ఉపాధి హామీ ఏపీడీ వీరన్న, ఏపీఓ బొజ్జప్పపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆలూరు మండలం పెద్దహోతూరు గ్రామంలో ఇంకుడు గుంతలను పరిశీలించేందుకు కలెక్టర్ వెళ్లారు. అక్కడ కొంతమంది రైతులు పొలాల గట్లపై వేసిన టేకు, తదితర మొక్కలను ఆయన పరిశీలించారు. కొంతమంది రైతులు ఉపాధి హామీ సిబ్బంది రైతులకు మొక్కలను పంపిణీ చేసినట్లు రికార్డుల్లో రాసుకుంటున్నారే తప్పా తమకు మొక్కలు ఇవ్వడం లేదన్నారు. అలాగే గతంలో ఇంకుడు గుంతలను కూలీలు తవ్వినా వారికి కూడా కూలీ డబ్బులు పంపిణీ చేయలేదన్నారు. గ్రామంలో దాదాపు ఉపాధి కూలీలకు గతేడాదిగా రూ.1.35 లక్షలకు పైగా డబ్బులను సంబంధిత అధికారులు పంపిణీ చేయలేదని కలెక్టర్ దృష్టికి తెచ్చారు. దీనిపై స్పందించిన కలెక్టర్ ఏపీడీ, ఏపీఓ, ఫీల్డ్ అసిస్టెంట్లపై మండిపడ్డారు. గతంలో ప్రభుత్వం టేకు, ఎర్రచందనం తదితర మొక్కలను ఆలూరు జీవనోపాదుల వనరుల కేంద్రంలో పెంచిన చెట్లను ఏయే రైతులకు పంపిణీ చేశారో తనకు వివరాలు తెలపాలని ఆదేశించారు. పొలం గట్లపై రైతులు చెట్లను పెంచడం వల్ల అనేక లాభాలు ఉంటాయన్నారు. కనీసం రైతులకు చెట్ల వల్ల ప్రయోజనాలను కూడా వివరించకపోవడం సిగ్గుచేటన్నారు. మూడు నెలల తరా్వాత తిరిగి పెద్దహోతూరు గ్రామంలో పర్యటిస్తానన్నారు. ప్రతి రైతు పొలం గట్లపై మొక్కలు ఉండేలా చూడాలని తెలిపారు. లేనిపక్షంలో కఠిన చర్యలు తీసుకుంటానని హెచ్చరించారు. మండలంలో జరిగే ప్రతి ప్రజా, రైతు అభివృద్ధి పనులపై ఎప్పటికప్పుడు సమాచారాన్ని సేకరిస్తానన్నారు. ప్రజలు, రైతులను నిర్లక్ష్యంచేసే సిబ్బందిపై చర్యలు తప్పవని కలెక్టర్ పేర్కొన్నారు. -
శాసనం చెప్పిన చరిత్ర
ఒంగోలు కల్చరల్, న్యూస్‌లైన్: ఒంగోలు చరిత్ర కు సంబంధించి కొత్త ఆధారాలు వెలుగు చూస్తున్నాయి. నగరంలోని ప్రసన్న చెన్నకేశవస్వామి ఆలయాన్ని 17వ శతాబ్దంలో ఒంగోలు రాజుల హయాంలో అప్పటి మంత్రి వంకాయలపాటి వీరన్న నిర్మించారని ఇప్పటివరకు భావిస్తున్నారు. అయితే కొన్ని వందల సంవత్సరాల క్రితం ఒంగోలు కొండపై చోడ గోపీనాథ ఆలయం, వైజిగేశ్వరస్వామి ఆలయం ఉన్నట్లు శాసనాల ద్వారా తెలుస్తోంది. కాశీవిశ్వేశ్వరస్వామి ఆలయం వాహనాల షెడ్డులోని క్రీస్తు శకం 13వ శతాబ్దం నాటి తెలుగు శాసనాన్ని ప్రసన్న చెన్నకేశవస్వామి, కాశీవిశ్వేశ్వరస్వామి ఆలయాల కార్యనిర్వహణాధికారులు ఆళ్ల శ్రీనివాసరెడ్డి, కట్టా ప్రసాద్‌బాబు సోమవారం పరిశీలించారు. గజసాహిణి రుద్రమ నాయకుడు చోడ గోపీనాథుని ఆలయానికి వంద కుంటల పొలాన్ని నిత్యదీపారాధన నిమిత్తం దానం చేసినట్లు శాసనంలో ఉంది. ఆ దానానికి దేశిరెడ్డి బ్రహ్మిరెడ్డి, మాచమనాయుడు, పిన్నమరెడ్డి పెరుమాందిరెడ్డి, తదితరులు సాక్షులని శాసనంలో పేర్కొన్నారు. ఒంగోలులోని డీ మార్కండేయ శాస్త్రి గార్డెన్లో ఒక రాతిపై చెక్కి ఉన్న శాసనంలో కరణం బచ్చరాజు నాగరాజు వైజిగేశ్వరస్వామివారి నిత్యపూజల కోసం వంద కుంటల భూమిని దానం చేసినట్లు ఉంది. వైజిగేశ్వరస్వామి ఆలయం ఎక్కడ ఉందో ప్రస్తుతం ఎవరికీ తెలియదు. ఒంగోలులోని ప్రసన్న చెన్నకేశవస్వామి ఆలయం, కాశీవిశ్వేశ్వరస్వామి ఆలయాలే పూర్వం చోడ గోపీనాథుడు, వైజిగేశ్వరస్వామి ఆలయాలై ఉండవచ్చని చారిత్రక పరిశోధకుడు, స్థానిక సీఎస్ఆర్ శర్మ కళాశాల చరిత్ర విభాగాధిపతి డాక్టర్ కే శ్రీనివాసులు, శాసన పరిశోధకులు విద్వాన్ జ్యోతిచంద్రమౌళి అభిప్రాయం వ్యక్తం చేశారు. ఈ విషయాన్ని నిర్ధారించడం కోసం మరిన్ని పరిశోధనలు చేయాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు.