ఈరన్న సన్నిధిలో డీఐజీ
మంత్రాలయం : డీఐజీ రమణకుమార్ మంగళవారం సతీసమేతంగా ఉరుకుంద క్షేత్రానికి వెళ్లి ఈరన్నస్వామిని దర్శించుకున్నారు. సూపరింటెండెంట్ వెంకటేశ్వరరావు నేతత్వంలో అర్చకులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. అనంతరం డీఐజీ దంపతులు స్వామివారి మూలవిరాట్‌ను దర్శించుకుని పూజలు నిర్వహించారు. శ్రావణమాస ఉత్సవాల ఏర్పాట్లను పర్యవేక్షించారు. ఆయన వెంట డీఎస్పీ కొల్లి శ్రీనివాస్, సీఐలు నాగేశ్వరావు, దైవప్రసాద్, ఎస్‌ఐ నల్లప్ప, సీనియర్ అసిస్టెంట్ రమేష్ ఉన్నారు.