మాట్లాడుతున్న సీఐ పెద్దన్నకుమార్, తహసీల్దార్ తిరుమలాచారి
- కోడిపుంజుల వాగులో చిక్కుకున్న వ్యక్తిని కాపాడిన మణుగూరు కానిస్టేబుల్
మణుగూరు : ఒక్కసారిగా పెరిగిన వరదతో ఉధృతంగా ప్రవహిస్తున్న కోడిపుంజుల వాగు లో కొట్టుకుపోయి అదృష్టవశాత్తూ మధ్యలో ఓ చెట్టును పట్టుకొని..బిక్కుబిక్కుమంటున్న వ్యక్తిని మణుగూరు కానిస్టేబుల్ గుగులోతు వీరన్న సాహసోపేతంగా కాపాడారు. రాత్రిపూట, చిమ్మచీకటిలో.. తాడు ద్వా రా అతని వద్దకు వెళ్లి క్షేమంగా ఒడ్డుకు చేర్చి అందరి ప్రశంసలందుకున్నారు.
తెలిసింది 11గంటలకు..
రెండు గంటలు శ్రమించి ఒడ్డుకు..
ఎడతెరిపి లేని వానతో సోమవారం మణుగూరు వద్ద కోడిపుంజుల వాగు ఉధృతంగా ప్రవహిస్తోంది. అదే రోజు రాత్రి 10 గంటల సమయంలో బొంబాయికాలనీ రైల్వేగేటు వద్ద అర్జు¯ŒSరావు అనే ఓ ప్రైవేట్ డ్రైవరు ప్రమాదవశాత్తూ వాగులోకి జారిపడి గల్లంతయ్యాడు. దాదాపు పావు కిలోమీటరు దూరం కొట్టుకుపోయి..వాగు మధ్యలో ఓ చెట్టును పట్టుకొని ఆగాడు. చుట్టూ చిమ్మచీకటి..పైగా వరద హోరుతో బెంబేలెత్తి ‘కాపాడండి..’ అంటూ బిగ్గరగా అరవసాగాడు. సమీపంలోని అరుపులు విని..రోడ్డుపైకి వచ్చింది. అదే సమయంలో జలమయమైన అశోక్‌నగర్, వెంకటపతినగర్, ఎస్టీ బాలుర, బాలికల వసతిగృహాల ప్రాంతాల వారిని సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్న అధికారుల వద్దకు పరుగెత్తి విషయం వివరించింది. తహసీల్దార్‌తిరుమలాచారి, సీఐ పెద్దన్నకుమార్, ఏఎస్‌ఐ రాంబాబు, ఆర్‌ఐ కృష్ణప్రసాద్, వీఆర్వోలు లక్ష్మణ్‌రావు, రామ్మూర్తి రైల్వేగేటు వద్ద నుంచి అతడు చిక్కుకున్న ప్రాంత సమీపానికి వెళ్లి చీకటిలో ఏం చేయా లో తెలియక తర్జనభర్జన పడసాగారు. ఈ క్రమంలో మణుగూరు పోలీస్ స్టేష¯ŒSలో విధు లు నిర్వహిస్తున్న కానిస్టేబుల్ వీరన్న తాడు సాయంతో వాగులోకి దిగాడు. మెడ వరకు మునిగేలా వరద పారుతున్నా..చుట్టూ చీకటిలో ఏమీ కనిపించకపోయినా..ఒడ్డున ఉన్న వారు టార్చ్‌లైట్ వెలుతురు కొడుతుంటే..ధైర్యంగా నడివాగులో ఉన్న వ్యక్తి వద్దకు చేరుకున్నాడు. రాత్రి 11 గంటల సమయంలో ఈ రక్షణ చర్య చేపట్టగా..ఆ ప్రైవేట్ డ్రైవర్‌ను రాత్రి ఒంటి గంట సమయంలో తాడు ద్వారా సురక్షితంగా ఒడ్డుకు చేర్చాడు. ఉప్పొంగుతున్న వాగులో సాహసోపేతంగా ఓ వ్యక్తి ప్రాణాలను కాపాడిన కానిస్టేబుల్ వీరన్నను సీఐ పెద్దన్నకుమార్, తహసీల్దార్ తిరుమలాచారి, స్థానికులు అభినందించారు.