ప్రాక్టికల్ విద్య అందితే సత్ఫలితాలు | Practical results of education | Sakshi
Sakshi News home page

ప్రాక్టికల్ విద్య అందితే సత్ఫలితాలు

Published Thu, Sep 25 2014 1:57 AM | Last Updated on Sat, Sep 2 2017 1:54 PM

ప్రాక్టికల్ విద్య అందితే సత్ఫలితాలు

ప్రాక్టికల్ విద్య అందితే సత్ఫలితాలు

ఎచ్చెర్ల:  ఐటీఐల్లో ఏ ఏడాది మెరుగైన ప్రవేశాలు జరిగాయి. అయితే ఐటీఐల్లో విద్యార్థులకు ప్రాక్టికల్ విద్య సక్రమంగా అందితే మంచి ఫలితాలు వచ్చే అవకాశం ఉంది. ఐటీఐల్లో ఈ ఏడాది 3226 సీట్లకు గాను  2900 వరకు నిండిపోయాయి. ఫిట్టర్, ఎలక్ట్రీషియన్ వంటి ట్రేడుల్లో ప్రైవేటు కళాశాలల్లో సైతం దాదాపు సీట్లు నిండాయి.  జిల్లాలో ఎచ్చెర్ల, శ్రీకాకుళం డీఎల్‌టీసీ, పలాస, సీతంపేట, రాజాంల్లో ఐదు ప్రభుత్వ ఐటీఐ, మరో 17 ప్రైవేటు ఐటీఐలు ఉన్నాయి. ప్రస్తుత ఉపాధి అవకాశాలు అంది పుచ్చుకోవాలంటే విద్యార్థులకు అవసరమైన నైపుణ్యాలు, పరిశ్రమల్లో వస్తున్న సాంకేతిక మార్పులు, పరిశ్రమలు అవసరాలు ముందుగా గుర్తించాలి.
 
 విద్యార్థులు క్షేత్ర స్థాయిలో పని చేయాల్సి ఉంటుంది.  వీరి పని తీరును నిరంతరం ఇంజినీరింగ్ అధికారులు పర్యవేక్షిస్తారు. అందుకే ప్రతి ఐటీఐ విద్యార్థి నిరంతరం స్కిల్స్ నైపుణ్యం వృద్ధి చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది.  ఈ దిశగా ఐటీఐలు విద్యార్థులను తీర్చిదిద్దేందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలని పలువురు కోరుతున్నారు.  రెండేళ్ల కోర్సుల్లో ఫిట్టర్, ఎలక్ట్రీషియన్, డ్రాఫ్ట్‌మెన్ సివిల్, ఎలక్ట్రానిక్స్ మెకానిక్, మోటార్ మెకానిక్, ఇన్‌స్ట్రుమెంటేషన్ మెకానికల్ నిర్వహిస్తుండగా, ఏడాది కోర్సులు వెల్డర్, కోపా, డీజిల్ మెకానిక్, కటింగ్ అండ్ సూయింగ్, ఫ్యాషన్ టెక్నాలజీ తదితర కోర్సులు నిర్వహిస్తున్నారు.
 
  ఈ ఏడాది మాజ్యూలరీ ఎంప్లాయ్‌మెంట్ స్కిల్ సంస్థ ఐటీఐల్లో డ్రాపౌట్ విద్యార్థులను గుర్తించి శిక్షణ ఇచ్చి ధ్రువీకరణ పత్రాలు అందజేస్తుంది. ఇప్పటికే ఇటువంటి కోర్సులను నేషనల్ అకాడమీ ఆఫ్ కనస్ట్రక్షన్స్ వంటి సంస్థలు నిర్వహిస్తున్నాయి.  ప్రభుత్వ సంస్థల్లో తరగతుల నిర్వహణ, శిక్షణ కొంతవరకు మెరుగ్గా ఉన్నా ప్రైవేటు సంస్థల్లో మాత్రం అనుకున్న స్థాయిలో ఉండడం లేదన్న విమర్శలు వినిపిస్తున్నాయి.  దీంతో విద్యార్థులు నైపుణ్యాల్లో వెనుకబడిన సందర్భాలున్నాయి.  డీజీఈపీ వంటి సంస్థలు నిరంతరం పర్యవేక్షణ చేస్తేఇక్కడ సైతం శిక్షణ బాగా జరిగే అవకాశం ఉంటుంది.  మారుతున్న సాంకేతిక పరిస్థితులకు అనుగుణంగా సిలబస్ మార్పు, ప్రయోగ విద్యకు ప్రాధాన్యత నివ్వడం, పరిశ్ర మల్లో విద్యార్థులకు ప్రయోగాలకు అవకాశం కల్పించడం, అధీకృత సంస్థల నిరంతర పరిశీలనతో విద్య మరెంత బలోపేతం అవుతుందని పలువురు అభిప్రాయపడుతున్నారు.  ఐటీఐ అనంతరం విద్యార్థులు డిప్లమో, డిగ్రీ వంటి చదువు లకు ప్రాధాన్యత నిచ్చినా ఉపాధి అవకాశాలు మెరుగుపడతాయి.
 
 సెమిస్టర్ విధానంలో...
  గత ఏడాది నుంచి సెమిస్టర్ పద్ధతిలో ఐటీఐ పరీక్షలు ప్రవేశపెట్టారు.  ఏడాది కోర్సు విద్యార్థులు రెండు, రెండేళ్ల కోర్సు విద్యార్థులు నాలుగు సెమిస్టర్ విధానంలో పరీక్షలు రాయాల్సి ఉంటుంది. పరీక్షలన్నీ ఆప్షన్ల విధానంలో ఉంటాయి.  గతంలో థియరీ విధానంలో పరీక్షలు రాసేవారు.  పరీక్ష రాసే విధానం  సైతం దృష్టి సారించాల్సి ఉంది.  విద్యలో రాణించాలంటే మాత్రం ప్రయోగ విద్యకు ప్రాధాన్యతను ఇవ్వాలి.
 
 కష్టబడి పనిచేయాలి
 ఐటీఐలో చేరే విద్యార్థి నిరంతరం శ్రమిం చాల్సి ఉంటుంది. జిల్లాలో పేద, మధ్య తరగతి విద్యార్థులు ఎక్కువగా ఈ కోర్సు ల్లో చేరుతున్నారు.   పరిశ్రమల్లో సాంకేతి క మార్పులు గమనించి మెరుగైన విద్యను పొందాలి. ప్రభు త్వ ఉద్యోగాలకు సైతం ఎంపిక కావ చ్చు.
 -రాడ కైలాసరావు, జిల్లా ఐటీఐల క న్వీనర్  
 
 ఉపాధి కోసం చేరా
 నేను ఉపాధి అవకాశాలు అంది పుచ్చుకోవాలని ఐటీఐలో చేరాను. తక్కువ వయసులో ఉపాధి అవకాశాలు పొందడం ద్వారా  మా కుటుంబానికి ఆర్థికంగా సహాయపడతాను.  మా నాన్న కూడా ఐటీఐ చేసి ప్రైవేటుగా ఉద్యోగం చేస్తున్నారు.
 -ఎల్.అనూష, సివిల్, ఎచ్చెర్ల ఐటీఐ
 
 పరిశ్రమల్లో ఉపాధి కోసం..
 నాకు 10 తరగతిలో 9.07 గ్రేడ్ మార్కులు వచ్చాయి. ఇంటర్మీడియెట్ అనంతరం ఉన్నత చదువులు చదివే ఆర్థిక స్థోమత లేదు. అందుకే ఐటీఐలో చేరా. ఐటీఐ  అనంతరం ఉద్యోగ ఉపాధి అవకాశాలు అంది పుచ్చుకోవడమే నా లక్ష్యం.
 -జె.సంతోష్ కుమార్, ఫిట్టర్ ట్రేడ్, ఎచ్చెర్ల
 

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement