కరెంట్ షాక్‌తో ఎలక్ట్రీషియన్‌కు తీవ్రగాయాలు | Electrician severely injured due to Electrocution | Sakshi
Sakshi News home page

కరెంట్ షాక్‌తో ఎలక్ట్రీషియన్‌కు తీవ్రగాయాలు

Published Mon, Aug 31 2015 3:46 PM | Last Updated on Fri, Aug 17 2018 2:53 PM

Electrician severely injured due to Electrocution

ఆదిలాబాద్ (దండేపల్లి) : ఆదిలాబాద్ జిల్లా దండేపల్లి మండలం ముత్యంపేట గ్రామంలో కరెంటు షాక్ తగిలి అఫ్జల్ బేగ్(42) అనే ప్రైవేటు ఎలక్ట్రీషియన్‌కు తీవ్ర గాయాలయ్యాయి. విద్యుత్ స్తంభంపై బల్బులు బిగిస్తుండగా అకస్మాత్తుగా కరెంటు రావడంతో ఎలక్ట్రీషియన్ స్తంభంపై నుంచి కిందపడ్డాడు.

వెంటనే బాధితుడ్ని లక్సెట్టిపేట ప్రభుత్వాసుపత్రికి తరలించారు. పరిస్థితి విషమంగా ఉండటంతో వైద్యుల సూచన మేరకు కరీంనగర్‌కు తీసుకెళ్లారు. విద్యుత్ అధికారుల నిర్లక్ష్యం వల్లే ఈ ప్రమాదం జరిగిందని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement