
ఎంత మేకప్ వేసినా.. కళ్లు.. పెరుగుతున్న వయసును దాచలేవు. కళ్ల చుట్టు ఏర్పడే ముడతలు, మచ్చలు, డార్క్ సర్కిల్స్ వంటివన్నీ వయసును బయటపెట్టడమే కాదు ముఖాన్నీ కళావిహీనంగానూ మారుస్తాయి. చిత్రంలోని ఈ మాస్క్‌ను రోజుకు పది నిమిషాలు ఉపయోగిస్తే చాలు.. వయసును చూపిస్తున్న లక్షణాలన్నీ మాయమై ముఖం మిలమిలా మెరుస్తుంది.
ఈ ‘మెడి లిఫ్ట్ ఐ ఈఎమ్‌ఎస్ మాస్క్’ వృద్ధాప్య సంకేతాలతో పోరాడేందుకు కళ్ల కోసం రూపొందింది. దీన్ని రోజుకు పది నిమిషాలు ధరిస్తే చాలు మంచి ఫలితం వస్తుంది. ఎలక్ట్రికల్ మజిల్స్ స్టిమ్యులేషన్ మాస్క్(EMS) నుంచి మంచి ప్రయోజనాలను అందుకోవచ్చు. దీనికి రెండున్నర గంటలు చార్జింగ్ పెడితే సుమారు 3 గంటల పాటు నిర్విరామంగా ఉపయోగించుకోవచ్చు.
ఈ మాస్క్ ధర దాదాపుగా 226 డాలర్లు ఉంది. అంటే 18,855 రూపాయలు. దీన్ని వినియోగించడం చాలా ఈజీ. టీవీ చూస్తున్నప్పుడు, చదువుకుంటున్నప్పుడు, వ్యాయామం చేస్తున్నప్పుడు, వాకింగ్‌కి వెళ్లినప్పుడు, ల్యాప్‌టాప్‌లో వర్క్ చేసుకునేటప్పుడు కూడా ఎలాంటి ఇబ్బంది లేకుండా సులభంగా వినియోగించుకోవచ్చు.
(చదవండి: నిమ్మకాయలు ఎక్కువ రోజులు తాజాగా ఉండాలంటే ఇలా చేయండి!)
Comments
Please login to add a commentAdd a comment