సాక్షి, హైదరాబాద్: రోడ్డు ప్రమాదంలో సాఫ్ట్‌వేర్ ఉద్యోగి దుర్మరణం చెందాడు. మల్కాజిగిరి పోలీస్‌స్టేషన్ పరిధిలో ఈ సంఘటన జరిగింది. ఎస్‌ఐ శ్రీనివాస్, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. నర్సింహారెడ్డి నగర్‌కు చెందిన నటేషన్(39) సాఫ్ట్‌వేర్ ఉద్యోగి. శనివారం సాయంత్రం తన యాక్టివా మీద ఎలక్ట్రీషియన్‌తో కలిసి ఎలక్ట్రికల్ సామాన్లు తీసుకొని ఇంటికి తిరిగి వెళుతుండగా ఆర్.కె.నగర్ వద్ద ఆర్టీసీ బస్సు ఢీ కొట్టడంతో అదుపుతప్పి బస్సు కింద పడిపోయాడు.
బస్సు వెనుక చక్రం తల మీద వెళ్లడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. వెనుక ఉన్న ఎలక్ట్రీషియన్ స్వల్ప గాయాలతో బయటపడ్డాడు. సంఘటనా స్ధలానికి చేరుకున్న ఎస్‌ఐ శ్రీనివాస్ మృతదేహాన్ని గాంధీ ఆస్పత్రికి తరలించారు. నటేషన్ భార్య ప్రవీణ ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. (చడవండి: ప్రేమ పేరుతో మోసం; యువతిని లైంగికంగా వాడుకొని. )
Comments
Please login to add a commentAdd a comment