ఇంటిలో పనిచేసేందుకు వచ్చే ఎలక్ట్రీషియన్, కార్పెంటర్, ప్లంబర్‌లాంటి వారు ఒక్కోసారి ఆ ఇంటిలోని మహిళలను వేధించిన ఘటనలను మనం చూస్తుంటాం. ఇటువంటి సందర్భాల్లో కొందరు దుర్మార్గులయితే పెళ్లయిన మహిళలతో స్నేహం చేసేందుకు కూడా ప్రయత్నిస్తుంటారు. తాజాగా అమెరికాకు చెందిన మెకియన్ మెక్‌క్రాకెన్ అనే మహిళకు విచిత్ర ఘటన ఎదురయ్యింది. తనకు ఎదురైన అనుభవాన్ని ఆమె టిక్‌టాక్‌లో షేర్ చేసింది.
మెకియన్ తెలిపిన వివరాల ప్రకారం ఆమె భర్త కొలెటల్, మరిది డెవ్ బయటకు వెళ్లారు. ఆ సమయంలో వారి ఫర్నీచర్ స్టోర్‌లో మరమ్మతు పనులు జరుగుతున్నాయి. స్టోర్‌లోని ఫ్యాను మరమ్మతు చేసేందుకు ఒక ఎలక్ట్రీషియన్‌ను పిలిచారు. నాటి అనుభవం గురించి మెకియన్ మాట్లాడుతూ ‘ఎలక్ట్రీషియన్ ఫ్యాను బాగు చేసేందుకు అనువుగా అక్కడి సోఫాను పక్కకు జరిపాను. అలాగే ఆ ఎలక్ట్రీషియన్‌కు సాయం చేసే ఉద్దేశంతో ఏమైనా కావాలా’ అని అడిగాను. దానికి ఆ ఎలక్ట్రీషియన్ సమాధానమిస్తూ ‘మీ ఆదేశాలను శిరసావహిస్తాను’ అని నెమ్మదిగా అన్నాడు.
అయితే ఈ మాటను ఆమె పెద్దగా పట్టించుకోకుండా తన పనిలో మునిగిపోయింది. తరువాత ఎలక్ట్రీషియన్ బాత్రూమ్ వినియోగించుకునేందుకు ఆమె అనుమతి కోరాడు. తరువాత ‘మీరు ఎంతో అందంగా ఉన్నారు. అయితే మీకు వివాహం జరిగిందని తెలిసి నా హృదయం ముక్కలయ్యింది. అయినా మీరు నాతో రావాలనుకుంటే వచ్చేయండి. నాకేమీ అభ్యంతరం లేదు. సోఫా కుషన్‌పై మీకోసం ఒక లెటర్ అతికించాను’ అని అన్నాడు. ఈ మాటలు విన్న మెకియన్ కంగారు పడిపోయింది.
అతను పని ముగించుకుని వెళ్లేవరకూ వేచిచూసింది. అతను వెళ్లగానే కుషన్‌పై అంటించిన లెటర్ చదివింది. దానిలో.. ‘నిన్ను ఇబ్బందుల్లో పెట్టాలనే ఉద్దేశం నాకు లేదు. నువ్వు ఎంతో అందంగా ఉన్నావు. నీకు పెళ్లయినప్పటికీ, నాతో రావాలనుకుంటే వచ్చేయ్, నేను నీకు అన్ని ఆనందాలను అందిస్తాను’ అని ఉంది.
ఈ విషయాన్ని మెకియన్ తన భర్తకు తెలియజేసింది. వెంటనే భర్త ఆ ఎలక్ట్రీషియన్‌ను నిలదీశాడు. దీంతో ఆ ఎలక్ట్రీషియన్ మెకియన్‌కు క్షమాపణలు చెప్పాడు. సోషల్ మీడియాలో దర్శనమిస్తున్న ఈ పోస్టును చూసి యూజర్లు రకరకాలుగా తమ స్పందనలను తెలియజేస్తున్నారు. ఒక యూజర్.. మీరు ఆ ఎలక్ట్రీషియన్ బాస్‌కు ఫిర్యాదు చేయాల్సింది అని సలహా ఇవ్వగా, మరొకరు ఆ ఎలక్ట్రీషియన్ పనిచేస్తున్న కంపెనీ రివ్యూలో ఈ విషయాన్ని రాయాలని కోరారు.
ఇది కూడా చదవండి: పాకిస్తాన్ ‘ఆణిముత్యం’.. ఎవరికీ తెలియని షాహిద్ ఖాన్ సక్సెస్ స్టోరీ!
Comments
Please login to add a commentAdd a comment