![H-1B visa fee used to fund apprentice programme - Sakshi](/styles/webp/s3/article_images/2019/07/19/T-GREENVILLE.jpg.webp?itok=VfuNK8co)
వాషింగ్టన్: దేశీయ కంపెనీల్లో నిపుణుల కొరత తీర్చేందుకు హెచ్1–బీ వీసా ఫీజు డబ్బుతో అమెరికన్లకు శిక్షణ కార్యక్రమాలు చేపట్టినట్లు వాణిజ్య మంత్రి విల్బర్ రాస్ తెలిపారు. వివిధ కంపెనీలే అమెరికన్లకు శిక్షణ ఇచ్చేలా ట్రంప్ యంత్రాంగం ‘ఇండస్ట్రీ–రికగ్నైజ్డ్ అప్రెంటిస్‌షిప్ సిస్టం’ అనే విధానం తెచ్చింది. హెచ్1బీ వీసా ఫీజు డబ్బు సుమారు రూ.688 కోట్లను కార్మిక శాఖ 30 రకాల అప్రెంటిస్ షిప్ గ్రాంట్‌గా అందజేసిందన్నారు. ఈ ఫీజును విదేశీ ఉద్యోగులను నియమించుకున్న కంపెనీలే ప్రభుత్వానికి చెల్లించాల్సి ఉంటుంది. ప్రస్తుతం సైబర్ సెక్యూరిటీ, కృతిమ మేథ రంగాల్లో అమెరికన్ నిపుణులకు శిక్షణ ఇస్తున్నామన్నారు.
అధికారుల వల్లే ‘హెచ్1బీ’ జాప్యం
అమెరికా వలస విభాగం విధానాల కారణంగా హెచ్1–బీ జారీ ప్రక్రియ ఆలస్యమవుతోందని అమెరికా కాంగ్రెస్ సభ్యురాలు సుసాన్ ఎలెన్ లోఫ్‌గ్రెన్ ఆందోళన వ్యక్తం చేశారు. దరఖాస్తు దారులు ఒకసారి పంపిన వివరాలనే మళ్లీపంపాలని అడుగుతున్నారని, అనవసరమైన సమాచారం కావాలంటున్నారన్నారు. హెచ్1బీ దరఖాస్తులను పెండింగ్‌లో పెట్టిన ఘటనలు 2016తో పోలిస్తే 20 శాతం పెరిగాయని అమెరికన్ ఇమిగ్రేషన్ లాయర్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ మర్కెటా చెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment