Commerce Secretary
-
వ్యవసాయ ఎగుమతులు రెట్టింపు
గ్రేటర్ నోయిడా: భారత్ వ్యవసాయ ఎగుమతులు ప్రస్తుతం 50 బిలియన్ డాలర్ల నుంచి 2030 నాటికి 100 బిలియన్ డాలర్లకు చేరుకుంటాయని వాణిజ్య కార్యదర్శి సునీల్ బరŠాత్వల్ తెలిపారు. 2030 నాటికి దేశం 2 ట్రిలియన్ డాలర్ల విలువైన వస్తువులు సేవల ఎగుమతులను లక్ష్యంగా పెట్టుకుందని దక్షిణాసియాలో అతిపెద్ద ఫుడ్ అండ్ బేవరేజెస్ ప్రదర్శన– ఇండస్‌ఫుడ్ షో 2024 కార్యక్రమంలో ఆయన చెప్పారు. ఇంకా ఆయన ఏమన్నారంటే.. రెడీ–టూ–ఈట్ ఫుడ్ సెగ్మెంట్ వంటి రంగాలు వృద్ధి చెందడానికి భారీ అవకాశాలు ఉన్నాయి. దిగుమతి చేసుకునే దేశాల ప్రమాణాలు, అవసరాలపై పరిశ్రమ దృష్టి పెట్టాలి. 2023–24లో 53 బిలియన్ డాలర్లపైనే... కార్యక్రమాన్ని ప్రారంభించిన వాణిజ్య, పరిశ్రమల శాఖ మంత్రి పియూష్ గోయల్ మాట్లాడుతూ, 2022–23 ఆర్థిక సంవత్సరంలో వ్యవసాయ ఎగుమతుల విలువ 53 బిలియన్ డాలర్లయితే, 2023–24లో ఈ పరిమాణం దాటుతుందన్న అభిప్రాయాన్ని వెలిబుచ్చారు. బియ్యం, గోధు మలు, చక్కెరసహా కొన్ని కీలక కమోడిటీల ఎగుమతులపై ఆంక్షలు ఉన్నప్పటికీ ఎగుమతుల విలువ పురోగతికి ఆటంకం ఉండబోదన్నారు. ఈ ఉత్పత్తులపై ఎగుమతుల నిషేధం, ఆంక్షల వల్ల ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో సుమారు 4–5 బిలియన్ డాలర్ల ఎగుమతులు దెబ్బతినే అవకాశం ఉందన్న అంచనాల నేపథ్యంలో గోయల్ ఈ వ్యాఖ్యలు చేశారు. ప్రభుత్వం గోధుమలు, బాస్మతీయేతర తెల్ల బియ్యం ఎగుమతులను నిషేధించింది. చక్కెర ఎగుమతులపై కూడా ఆంక్షలు విధించింది. అయితే బాస్మతి, పండ్లు..కూరగాయలు, మాంసం..డెయిరీ మొదలైన వాటి ఎగుమతులు పెరుగుతుండటంతో కనీసం గత ఆర్థిక సంవత్సరం స్థాయినైనా నిలబెట్టుకోగలమని ప్రభుత్వం ఆశిస్తోంది. భారత్ నుంచి ఎగుమతయ్యే వ్యవసాయోత్పత్తుల్లో బాస్మతి బియ్యం అగ్రస్థానంలో ఉంటోంది. రైతుల కు మంచి విలువను అందించడానికి, ఉపాధిని సృష్టించడానికి, దేశ ఆదాయాన్ని పెంచడానికి పెద్ద ఎత్తున ఫుడ్ ప్రాసెసింగ్, ఉత్పత్తుల బ్రాండింగ్, ఎగుమతులపై దృష్టి సారించాల్సిన అవసరం ఉందని గోయల్ ఫుడ్ షో ప్రారంభ కార్యక్రమంలో అన్నారు. 158 ఆహార, వ్యవసాయ ఉత్పత్తులకు భౌగోళిక సూచిక (జీఐ) ట్యాగ్లు మంజూరయిన ట్లు వెల్లడించారు. వన్ డి్రస్టిక్ట్ వన్ ప్రొడక్ట్ (వోడీఓపీ) విధానం కింద 708 ఆహార పదార్థాలను గుర్తించినట్లు పేర్కొన్నారు. ఫ్రోజెన్, ప్యాక్ చేసిన, రెడీటూ ఈట్ ఉత్పత్తులపై దృష్టి పెట్టాలని పేర్కొన్నారు. అలాగే వ్యవసాయ ఎగుమతుల రంగంలో నైపుణ్యాభివృద్ధిని ప్రోత్సహించడం, విజ్ఞాన మారి్పడికి సంబంధించి విశ్వవిద్యాలయాల ఒప్పందాలు, స్టార్టప్‌ల ప్రోత్సహం వంటి చర్యలు ఉండా లని సూచించారు. నాణ్యత, పోషకాహారం, సేంద్రీయ పదార్థాలు, పర్యావరణ అనుకూల ప్యాకేజింగ్‌కు కూడా ప్రాధాన్యత ఇవ్వాలని అలాగే ఆహార పోషణ– స్థిరత్వాన్ని ప్రోత్సహించడం ప్రాముఖ్యతను విస్తరించాలని మంత్రి సూచించారు. 90 దేశాల నుంచి ప్రతినిధులు... ఆహారం, పానీయాల అంతర్జాతీయ ప్రదర్శనలో ప్రపంచవ్యాప్తంగా 90 దేశాల నుండి 1,200 మందికి పైగా ఎగ్జిబిటర్లు, 7,500 మందికి పైగా కొనుగోలుదారులు పాల్గొన్నారు. చోయిత్రమ్స్, క్యారీఫోర్, ఖిమ్జీ రాందాస్, గ్రాండ్ హైపర్‌మార్కెట్, నెస్టో, ముస్తఫా, ఎక్స్5, లులు, అల్మయా గ్రూప్, స్పార్ వంటి 80కి పైగా రిటైల్ చెయిన్లు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నట్లు ట్రేడ్ ప్రమోషన్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా చైర్మన్ మోహిత్ సింగ్లా తెలిపారు. -
బ్రిటన్‌తో స్వేచ్ఛా వాణిజ్యంపై పురోగతి
న్యూఢిల్లీ: బ్రిటన్‌తో స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం (ఎఫ్‌టీఏ)పై చర్చల్లో ఎంతో పురోగతి ఉన్నట్టు, చర్చలు త్వరలోనే ముగుస్తాయని కేంద్ర వాణిజ్య శాఖ కార్యదర్శి సునీల్ భరత్వాల్ వెల్లడించారు. ఈ నెలలో రెండు దేశాల మధ్య జరిగే ఉన్నతస్థాయి ద్వైపాక్షిక సమావేశంలో అపరిష్కృత అంశాలను కొలిక్కి తీసుకువచ్చేందుకు అవకాశం ఉందని చెప్పారు. ‘‘ఎఫ్‌టీఏలో 26 చాప్టర్లకు గాను, ఇప్పటికే 19 చాప్టర్లపై చర్చలు ముగిశాయి. ఇంకా కొన్ని అంశాలే మిగిలి ఉన్నాయి. జైపూర్‌లో జరిగే ట్రేడ్ అండ్ ఇన్వెస్ట్మెంట్ గ్రూప్ (టీఐడబ్ల్యూజీ) సమావేశానికి బ్రిటన్ బృందం రానుంది. అప్పుడు మిగిలిన అంశాలపైనా ఏకాభిప్రాయానికి వస్తామనే భావిస్తున్నాం’’అని సునీల్ భరత్వాల్ తెలిపారు. రెండు దేశాల మధ్య పెట్టుబడుల విషయమై విడిగా ప్రత్యేక ద్వైపాక్షిక ఒప్పందం ఉంటుందని చెప్పారు. ఇప్పటికే యూకే బృందంలో ఒక వర్గం ఢిల్లీకి చేరుకుందని, మిగిలిన వరు 16వ తేదీ నుంచి వస్తారని భరత్వాల్ వెల్లడించారు. జైపూర్ చర్చల్లో పాల్గొనేందుకు బ్రిటన్ వాణిజ్య మంత్రి డీజీ ట్రేడ్ కూడా రానుండడం గమనార్హం. పెట్టుబడులకు సంబంధించి ఒప్పందం, ఆటో, విస్కీ, మేథో హక్కులు, సేవలకు సంబంధించిన అంశాలు రెండు దశాల మధ్య చర్చకు రానున్నాయి. వాణిజ్యం కోసమే కాదు.. స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందాలు కేవలం వాణిజ్య కోణంలోనే కాదని, దేశ వ్యూహాత్మక అవసరాలను సైతం దృష్టిలో పెట్టుకుని చేస్తున్నామని సునీల్ భరత్వాల్ స్పష్టం చేశారు. ముఖ్యంగా కీలక ఖనిజాల సరఫరా దీనితో సాధ్యపడుతుందన్నారు. ఎలక్ట్రిక్ వాహనాల బ్యాటరీలకు కీలకమైన మినరల్స్ అవసరమని, వీటి సరఫరా కోసం భారత్ ఆ్రస్టేలియాతో చర్చలు నిర్వహిస్తున్నట్టు చెప్పారు. పెరూ, చిలీలోనూ కీలక ఖనిజాల నిల్వలు దండిగా ఉన్నట్టు పేర్కొన్నారు. -
మోదీ నమ్మశక్యంకాని గొప్ప దార్శనికుడు..అమెరికా మంత్రి పొగడ్తల జల్లు
ఇటీవల భారత పర్యటనకు వచ్చిన అమెరికా వాణిజ్య కార్యదర్శి గినా రైమోండో భారత ప్రధాని నరేంద్ర మోదీపై ప్రశంసల జల్లు కురిపించారు. మోదీ నమ్మశక్యం కాని గొప్ప దార్శనికుడని, భారత ప్రజల పట్ల ఆయన నిబద్ధత వర్ణించలేనిదని ప్రశంసించారు. ఈ మేరకు రైమోండో ఇండియా హౌస్‌లో భారతీయ అమెరికన్లను ఉద్దేశించి చేసిన ప్రసంగంలో ఈ వ్యాఖ్యలు చేశారు. ఈ సందర్భంగా ఈ ఏడాది భారత్‌లో జరిగిన హోలీ వేడుకలలో తాను పాల్గొన్న విషయాన్ని గుర్తు చేసుకున్నారు. సంస్కృతి, సంప్రదాయ వేడుకల పరంగా భారత్ చాలా అత్యుత్తమమైనదన్నారు. తాను ఈ హోలీ వేడుకల్లో పాల్గొనడం కోసమే ఒక రోజు ముందుగా భారత్‌కి వచ్చినట్లు తెలిపారు. రక్షణమంత్రి తన కుటుంబంతో కలిసి తనకు ఆతిథ్యమివ్వడం ఎంతో సంతోషంగా అనిపించిందన్నారు. కృత్రిమ మేధలో వస్తున్న విప్లవాన్ని భారత్-అమెరికాలు ముందుండి నడిపిస్తాయని చెప్పారు. అలాగే అక్కడ ప్రధాని మోదీతో జరిగిన సమావేశాన్ని కూడా వివరించారు. ప్రధాని మోదీతో గంటన్నరసేపు గడపడం తనకు లభించిన అద్భుతమైన గొప్ప అవకాశమన్నారు. అతను అత్యంత ప్రజాదరణ పొందిన ప్రపంచ నాయకుడు, నమ్మశక్యంకాని దూరదృష్టిగలవాడంటూ పొగడ్తల జల్లు కురిపించారు. అందుకు సంబంధించిన వీడియోని భారత రాయబారి తరణ్‌జీత్ సింగ్ సంధు ట్విట్టర్లో పోస్ట్ చేశారు. కాగా ఈ ఏడాది ప్రారంభంలో భారత్, యూఎస్‌లు అంతరిక్షం, రక్షణ, సెమీకండక్టర్లు, వంటి సాంకేతిక రంగాల్లో కలిసి పనిచేయడానికి సుముఖత వ్యక్తం చేశాయి. “He is the most popular wrld leader fr a reason; he is a visionary; & his level of commitment to ppl of🇮🇳is indescribable..his desire to lift ppl out of poverty & move🇮🇳 fwd as a global power is real; & it’s happening” @SecRaimondo on PM @narendramodi pic.twitter.com/SK2oIHpYIK — Taranjit Singh Sandhu (@SandhuTaranjitS) April 16, 2023 (చదవండి: అల్లాడుతున్న ప్రజలు.. ఏకంగా రూ.10 పెరిగిన పెట్రోల్ ధర) -
రూపాయిలో ట్రేడింగ్.. భారత్ ‘జీ 20’ అజెండా
ముంబై: భారత్ అధ్యక్షతన జరుగుతున్న జీ–20 సమావేశాల్లో ‘రూపాయిలో ట్రేడింగ్’ అజెండాను ముందుకు తీసుకువెళ్లాలని కేంద్రం భావిస్తోందని, ఇందుకు అనుగుణంగా వ్యూహ రచన చేస్తోందని వాణిజ్య కార్యదర్శి సునీల్ బర్త్వాల్ పేర్కొన్నారు. ముఖ్యంగా కరెన్సీ ఒత్తిడిలో ఉన్న దేశాలకు రూపాయి వాణిజ్యం ఉపయోగపడుతుందని వాణిజ్య కార్యదర్శి ఇక్కడ విలేకరులతో అన్నారు. అయితే జీ–20 ఫోరమ్‌తో రూపాయి వాణిజ్యానికి నేరుగా సంబంధం లేదని ఆయన స్పష్టం చేశారు. ముంబైలో మంగళవారం నుంచి మూడు రోజుల పాటు జరగనున్న కీలక సమావేశం నేపథ్యంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. జీ–20 దేశాలు, ప్రత్యేక ఆహ్వానితులుసహా దాదాపు 100 మంది ఉన్నత స్థాయి ప్రతినిధులు ఈ సమావేశాలకు హాజరవుతున్నారు. ఈ సమావేశం చర్చించే అంశాల్లో వాణిజ్యం– వృద్ది మధ్య మరింత సమతౌల్యత సాధించడం, ప్రపంచ సరఫరాల చైన్‌ను ఆటుపోట్లను తట్టుకునేలా చర్యలు తీసుకోవడం, వాణిజ్యంలో చిన్న వ్యాపారాలను ఏకీకృతం చేయడం, నిబంధనలలో ఏకరూపత సాధించడం, తద్వారా లాజిస్టిక్స్‌ను మెరుగుపరచడానికి మార్గాలు వంటి అంశాలు ఉన్నాయని బరŠాత్వల్ చెప్పారు. ప్రపంచ వాణిజ్య సంస్థ (డబ్ల్యూటీఓ)కు సంబంధించి భారత్ కొన్ని సంస్కరణలను ప్రతిపాదిస్తున్నదని పేర్కొన్న వాణిజ్య కార్యదర్శి, గుజరాత్‌లోని కెవాడియాలో జరిగే వాణిజ్య, పెట్టుబడి వర్కింగ్ గ్రూప్ తదుపరి సమావేశ ఎజెండాలో ఇదే ప్రధాన అంశమని తెలిపారు. రూపాయి మారకంలో అంతర్జాతీయంగా ట్రేడింగ్ కార్యకలాపాలు నిర్వహించడంపై ఇతర దేశాల్లో ఆసక్తి పెరుగుతోంది. ఇందుకు సంబంధించి 18 దేశాలకు చెందిన బ్యాంకులు.. భారతీయ బ్యాంకుల్లో 30 పైచిలుకు ప్రత్యేక వోస్ట్రో ఖాతాలను తెరిచాయి. లావాదేవీలూ స్వల్ప స్థాయిలో ప్రారంభమైనట్లు వివరించారు. రూపాయి మారకంలో చెల్లింపుల సెటిల్మెంట్కు వోస్ట్రో ఖాతాలు దోహదపడతాయి. రూపాయల్లో వాణిజ్యానికి సంబంధించిన మార్గదర్శకాలను ఆర్బీఐ గతేడాది జూలైలో ప్రకటించిన తర్వాత తొలుత రష్యాకు చెందిన సిబెర్ బ్యాంక్, వీటీబీ బ్యాంక్ ఈ ఖాతాలు తెరిచాయి. -
నీతి ఆయోగ్ సీఈవోగా బీవీఆర్ సుబ్రహ్మణ్యం
న్యూఢిల్లీ: థింక్-ట్యాంక్ నీతి ఆయోగ్ సీఈవోగా మాజీ వాణిజ్య కార్యదర్శి బీవీఆర్ సుబ్రహ్మణ్యం ఎంపికయ్యారు. ప్రభుత్వ నిర్ణయానికి క్యాబినెట్ నియామకాల కమిటీ (ఫిబ్రవరి 20న) ఆమోదం తెలిపింది. సుబ్రమణ్యం బాధ్యతలు తీసుకున్న నాటి నుంచి రెండేళ్ల పాటు లేదా తదుపరి ఉత్తర్వుల వరకు నీతి ఆయోగ్ సీఈవోగా ఉంటారని సిబ్బంది వ్యవహారాల శాఖ ఓ ప్రకటనలో తెలిపింది ప్రస్తుత సీఈవో పరమేశ్వరన్ అయ్యర్ ప్రపంచ బ్యాంక్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్‌గా నియమితులైన కారణంగా ఈ పరిణామం చోటు చేసుకుంది. కాగా సుబ్రహ్మణ్యం చత్తీస్‌గఢ్ 1988 బ్యాచ్ ఐఏఎస్ అధికారి, అతను సెప్టెంబర్ 30, 2022న వాణిజ్య కార్యదర్శిగా పదవీ విరమణ చేశారు. మరోవైపు పరమేశ్వరన్ అయ్యర్ జూలై 1, 2022న నీతి ఆయోగ్ సీఈవోగా బాధ్యతలు స్వీకరించారు. 2009 లో ప్రభుత్వాధికారిగా స్వచ్ఛంద పదవీ విరమణ చేసి , 2014లో ప్రభుత్వ స్వచ్ఛ్ భారత్ మిషన్‌కు నాయకత్వం వహించిన అయ్యర్ ఆ తరువాత ప్రపంచ బ్యాంకులో చేరారు. ఇపుడు ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ పదవిలో మూడేళ్ల పాటు కొనసాగ నున్నారు. -
భారత్ ఎగుమతులు ట్రిలియన్ డాలర్లకు చేరడం ఖాయం
న్యూఢిల్లీ: భారత్ ఎగుమతులు 2027–28 ఆర్థిక సంవత్సరం నాటికి ట్రిలియన్ డాలర్లకు చేరే అవకాశం ఉందని వాణిజ్య కార్యదర్శి బీవీఆర్ సుబ్రమణ్యం పేర్కొన్నారు. ఇండస్ట్రీ ప్రాతినిధ్య సంస్థ– సీఐఐ వార్షిక సమావేశంలో ఆయన మాట్లాడుతూ, ప్రభుత్వం తీసుకున్న పలు చర్యలు ఎగుమతుల భారీ వృద్ధికి దోహదపడతాయన్న విశ్వాసాన్ని వ్యక్తం చేశారు. జిల్లాను ఒక ఎగుమతి కేంద్రంగా మార్చాలన్న పథకం ఇందులో ఒకటని వివరించారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం 419 బిలియన్ డాలర్లు భారత్ ఎగుమతుల లక్ష్యమని తెలిపారు. గడచిన పదేళ్లలో ఎగుమతులు దాదాపు 290 బిలియన్ డాలర్లు– 330 బిలియన్ డాలర్ల మధ్య నమోదవుతున్నట్లు ఆయన తెలిపారు. 2020–21 ఆర్థిక సంవత్సరంలో భారత్ ఎగుమతులు 7.4 శాతం క్షీణించి 290.18 బిలియన్ డాలర్లుగా నమోదయ్యాయి. 2019–20లో ఈ విలువ 313.36 బిలియన్ డాలర్లు. ప్రపంచ దేశాలతో సహకారాన్ని (అనుసంధానం) భారత్ విస్తృతం చేసుకోవాల్సిన అవసరాన్ని వాణిజ్య శాఖ కార్యదర్శి ఈ సందర్భంగా ప్రస్తావించారు. అది లేకుంటే ప్రపంచంతో విడిపోయినట్టుగానే ఉంటుందన్నారు. గత 20 ఏళ్లలో ప్రపంచ వాణిజ్య సంస్థ చెప్పుకోతగ్గ సాధించిందేమీ లేదంటూ.. అంతర్గత సమస్యల కారణంగా ఇంతకుమించి ఆశించడానికి కూడా ఏమీ ఉండదని అభిప్రాయపడ్డారు. దీని కారణంగానే ప్రపంచ దేశాలు ద్వైపాక్షిక, ప్రాంతీయ సహకార ఒప్పందాల దిశగా అడుగులు వేసినట్టు చెప్పారు. ‘‘ప్రాంతీయంగా మనకు ఎటువంటి సహకార ఒప్పందాలు లేవు. ప్రపంచ ఆర్థిక శక్తిగా ఎదగాలని భారత్ కోరుకునేట్టు అయితే స్వేచ్ఛాయుత వాణిజ్య ఒప్పందాలు (ఎఫ్‌టీఏలు) కలిగి ఉండాలి’’ అంటూ సీఐఐ నిర్వహించిన ఒక కార్యక్రమంలో భాగంగా సుబ్రమణ్యం తన అభిప్రాయాలను వెల్లడించారు. భారీ పన్ను వసూళ్ల అంచనా: రెవెన్యూ కార్యదర్శి బజాజ్ ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2021–22) భారీ పన్ను వసూళ్లు జరుగుతాయని విశ్వసిస్తున్నట్లు రెవెన్యూ కార్యదర్శ తరుణ్ బజాజ్ సీఐఐ సమావేశంలో పేర్కొన్నారు. కార్పొరేట్ రంగం పనితీరు ఊహించినదానికన్నా బాగుండడమే తమ ఈ అంచనాలకు కారణమని వివరించారు. ఆటో రంగంపై అధిక జీఎస్టీ రేట్లు ఉన్నాయన్న విమర్శలను ఆయన ప్రస్తావిస్తూ, ఈ అంశంపై జీఎస్టీ కౌన్సిల్ పరిశీలన జరుగుతుందని, అధికంగా ఉన్న రేట్లను అవసరమైతే తగ్గిస్తుందని తెలిపారు. పన్ను పరిధిని పెంచడం ద్వారా స్థూల దేశీయోత్పత్తిలో పన్నుల నిష్పత్తి పెంపునకు మదింపు జరుగుతుందని ఈ సందర్భంగా వివరించారు. భారత్‌లో పన్ను వసూళ్లు జీడీపీలో దాదాపు 10 శాతంగా ఉంటే, అభివృద్ధి చెందని దేశాల్లో దాదాపు 25 నుంచి 28 శాతం శ్రేణి ఉందని అన్నారు. చదవండి: ఈ కంపెనీ ఒక్కనెలలో ఎన్ని కార్లు తయారు చేసిందో తెలుసా? -
అమెరికన్ కంపెనీలపై వివక్ష లేదు
న్యూఢిల్లీ: విదేశీ ఈ–కామర్స్ సంస్థలపై రెండు శాతం పన్ను విధింపు విధానంతో అమెరికన్ కంపెనీల పట్ల వివక్ష చూపుతున్నారన్న ఆరోపణలను కేంద్రం తోసిపుచ్చింది. దీనిపై అమెరికా ట్రేడ్ రిప్రజెంటేటివ్ (యూఎస్టీఆర్) నివేదికలో పొందుపర్చిన అంశాలు ఎంత మాత్రం ఆమోదయోగ్యం కాదని కేంద్ర వాణిజ్య శాఖ కార్యదర్శి అనూప్ వాధ్వాన్ స్పష్టం చేశారు. ఈ–కామర్స్ సరఫరాలపై భారత్ రెండు శాతం డిజిటల్ సర్వీసెస్ ట్యాక్స్ విధించడం అమెరికన్ కంపెనీల పట్ల వివక్ష చూపటమేనని, ఇది అంతర్జాతీయ పన్ను సూత్రాలకు విరుద్ధమని యూఎస్టీఆర్ గత నెల ఒక నివేదికలో పేర్కొంది. దీనిపైనే తాజాగా వాధ్వాన్ స్పందించారు. విదేశీ సంస్థలు .. బిలియన్ల డాలర్ల కొద్దీ ఆదాయాలు పొందుతున్న దేశాల్లో పన్నులు చెల్లించడం తప్పదని ఆయన పేర్కొన్నారు. ఆర్గనైజేషన్ ఫర్ ఎకనమిక్ కో–ఆపరేషన్ అండ్ డెవలప్మెంట్ (ఓఈసీడీ) దేశాలు కూడా ఇదే దిశగా చర్యలు తీసుకుంటున్నాయని వాధ్వాన్ వివరించారు. ఫేస్బుక్, గూగుల్, అమెజాన్ వంటి సంస్థల రూపంలో ఆయా రంగాల్లో ఆధిపత్యం ఉన్నందునే కొన్ని దేశాలు ఇలాంటి పన్నులను వ్యతిరేకిస్తున్నాయని ఆయన చెప్పారు. మినీ వాణిజ్య ఒప్పందంపై చర్చలు.. అమెరికా, భారత్ మధ్య ప్రతిపాదిత మినీ వాణిజ్య ఒప్పందంపై స్పందిస్తూ .. పలు అంశాలపై ఇరు దేశాల చర్చలు కొనసాగుతూనే ఉంటాయని, వీటికి ముగింపు ఉండదని వాధ్వాన్ తెలిపారు. ద్వైపాక్షిక వాణిజ్యాన్ని మరింతగా పెంచుకునే దిశగా ప్రతిబంధకంగా ఉన్న కొన్ని వివాదాలను పరిష్కరించుకోవడంపై ఇరు దేశాలు చర్చలు జరుపుతున్నాయి. జనరలైజ్డ్ సిస్టమ్ ఆఫ్ ప్రిఫరెన్సెస్ (జీఎస్పీ) కింద తమ ఎగుమతులకు ప్రాధాన్యత హోదాను పునరుద్ధరించాలని అమెరికాను భారత్ కోరుతోంది. మరోవైపు, వ్యవసాయం, తయారీ, డెయిరీ, వైద్య పరికరాలు తదితర విభాగాల్లో తమ కంపెనీలను మరింత విస్తృతంగా అనుమతించాలని అమెరికా కోరుతోంది. -
హెచ్1బీ ఫీజుతో అమెరికన్లకు శిక్షణ
వాషింగ్టన్: దేశీయ కంపెనీల్లో నిపుణుల కొరత తీర్చేందుకు హెచ్1–బీ వీసా ఫీజు డబ్బుతో అమెరికన్లకు శిక్షణ కార్యక్రమాలు చేపట్టినట్లు వాణిజ్య మంత్రి విల్బర్ రాస్ తెలిపారు. వివిధ కంపెనీలే అమెరికన్లకు శిక్షణ ఇచ్చేలా ట్రంప్ యంత్రాంగం ‘ఇండస్ట్రీ–రికగ్నైజ్డ్ అప్రెంటిస్‌షిప్ సిస్టం’ అనే విధానం తెచ్చింది. హెచ్1బీ వీసా ఫీజు డబ్బు సుమారు రూ.688 కోట్లను కార్మిక శాఖ 30 రకాల అప్రెంటిస్ షిప్ గ్రాంట్‌గా అందజేసిందన్నారు. ఈ ఫీజును విదేశీ ఉద్యోగులను నియమించుకున్న కంపెనీలే ప్రభుత్వానికి చెల్లించాల్సి ఉంటుంది. ప్రస్తుతం సైబర్ సెక్యూరిటీ, కృతిమ మేథ రంగాల్లో అమెరికన్ నిపుణులకు శిక్షణ ఇస్తున్నామన్నారు. అధికారుల వల్లే ‘హెచ్1బీ’ జాప్యం అమెరికా వలస విభాగం విధానాల కారణంగా హెచ్1–బీ జారీ ప్రక్రియ ఆలస్యమవుతోందని అమెరికా కాంగ్రెస్ సభ్యురాలు సుసాన్ ఎలెన్ లోఫ్గ్రెన్ ఆందోళన వ్యక్తం చేశారు. దరఖాస్తు దారులు ఒకసారి పంపిన వివరాలనే మళ్లీపంపాలని అడుగుతున్నారని, అనవసరమైన సమాచారం కావాలంటున్నారన్నారు. హెచ్1బీ దరఖాస్తులను పెండింగ్‌లో పెట్టిన ఘటనలు 2016తో పోలిస్తే 20 శాతం పెరిగాయని అమెరికన్ ఇమిగ్రేషన్ లాయర్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ మర్కెటా చెప్పారు. -
స్టార్టప్ పాలసీ పర్యవేక్షణకు కమిటీ
సరికొత్త స్టార్టప్ పాలసీని రూపొందించేందుకు ప్రభుత్వం ఓ కమిటీని ఏర్పాటు చేసింది. ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, కామర్స్ సెక్రటరీ నేతృత్వంలో ఏర్పాటు చేసే ఈ కమిటీలో ఎలక్ట్రానిక్స్‌లోని పలువురు అధికారులను సభ్యులుగా చేర్చింది. ఐటీ విభాగం కార్యదర్శి ప్రద్యుమ్న ఈ మేరకు మంగళవారం జీవో జారీ చేశారు. రాష్ట్రంలో 100 ఇంక్యుబేటర్స్, 5 వేల స్టార్టప్ కంపెనీలు ఏర్పాటు చేయడం ప్రభుత్వ లక్ష్యమని పేర్కొంది. ఒక మిలియన్ చదరపు అడుగుల్లో ఇంక్యుబేషన్ అభివృద్ధి చేయాలని సంకల్పించింది. ఇందుకు అనుగుణం నిపుణుల సలహాలు సూచనలను స్వీకరించి, ప్రభుత్వానికి నివేదిక ఇవ్వాలని కమిటీని ఆదేశించింది. -
ఎమ్మార్ ఎంజీఎఫ్ సెజ్ రద్దు
న్యూఢిల్లీ: ఎమ్మార్ ఎంజీఎఫ్ ల్యాండ్‌కు ఇచ్చిన సెజ్ ఆమోదాన్ని ప్రభుత్వం రద్దు చేసింది. దీంతో పాటు సెయిల్ సెలెమ్ సెజ్, మరో 25 సెజ్ ఆమోదాలను కేంద్రం రద్దు చేసింది. ప్రత్యేక ఆర్థిక మండలాలు(సెజ్‌ల) ఏర్పాటుకు 18 సంస్థలకు మరింత గడువునిచ్చింది. ఈ నిర్ణయాలను గత నెల 24న వాణిజ్య కార్యదర్శి రాజీవ్ ఖేర్ అధ్యక్షతన జరిగిన బోర్డ్ ఆఫ్ అప్రూవల్స్ (బీఓఏ) తీసుకుందని వాణిజ్య మంత్రిత్వ శాఖ వెల్లడించింది. సెజ్ ఆమోదాల రద్దుకు సంబంధించి 43 కేసులను బీఓఏ పరిశీలించిందని పేర్కొంది. డెక్కన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండ్ ల్యాండ్ హోల్డింగ్స్‌కు సంబంధించిన 14కేసులు, ఏపీ మార్క్‌ఫెడ్, డీసీ వీసెజ్‌కు చెందిన ఒక కేసులో సెజ్‌ల రద్దు నిర్ణయాన్ని వాయిదా వేసింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన కారణంగా తలెత్తిన పరిస్థితుల కారణంగా ఈ 15 కేసులను బీఓఏ వాయిదావేసింది. మరింత గడువు పొందిన సెజ్‌ల్లో-డీఎల్ఎఫ్ ఇన్ఫోపార్క్(పుణే), నవీ ముంబై సెజ్, ఇండియాబుల్స్ ఇండస్ట్రియల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, గల్ఫ్ ఆయిల్ కార్పొరేషన్ కర్ణాటక సెజ్‌లు ఉన్నాయి. కాగా సెజ్‌లకు సంబంధించి పునర్వ్యస్థీకరణ కసరత్తును కేంద్రం ప్రారంభించింది. సెజ్‌లకు సంబంధించి విధి, విధానాలను ప్రామాణీకరించడం, నిబంధనలు, ఫీజుల సరీళీకరణ, సమస్యల పరిష్కారం తదితర అంశాలపై కసరత్తును మొదలు పెట్టింది. సెజ్ డెవలపర్లు వివిధ అంశాలకు సంబంధించి ఆన్లైన్లో దరఖాస్తుల సమర్పణకు తగిన ప్రతిపాదనలను సిద్ధం చేస్తోంది.