ఇటీవల భారత పర్యటనకు వచ్చిన అమెరికా వాణిజ్య కార్యదర్శి గినా రైమోండో భారత ప్రధాని నరేంద్ర మోదీపై ప్రశంసల జల్లు కురిపించారు. మోదీ నమ్మశక్యం కాని గొప్ప దార్శనికుడని, భారత ప్రజల పట్ల ఆయన నిబద్ధత వర్ణించలేనిదని ప్రశంసించారు. ఈ మేరకు రైమోండో ఇండియా హౌస్‌లో భారతీయ అమెరికన్లను ఉద్దేశించి చేసిన ప్రసంగంలో ఈ వ్యాఖ్యలు చేశారు. ఈ సందర్భంగా ఈ ఏడాది భారత్‌లో జరిగిన హోలీ వేడుకలలో తాను పాల్గొన్న విషయాన్ని గుర్తు చేసుకున్నారు. సంస్కృతి, సంప్రదాయ వేడుకల పరంగా భారత్ చాలా అత్యుత్తమమైనదన్నారు.
తాను ఈ హోలీ వేడుకల్లో పాల్గొనడం కోసమే ఒక రోజు ముందుగా భారత్‌కి వచ్చినట్లు తెలిపారు. రక్షణమంత్రి తన కుటుంబంతో కలిసి తనకు ఆతిథ్యమివ్వడం ఎంతో సంతోషంగా అనిపించిందన్నారు. కృత్రిమ మేధలో వస్తున్న విప్లవాన్ని భారత్-అమెరికాలు ముందుండి నడిపిస్తాయని చెప్పారు. అలాగే అక్కడ ప్రధాని మోదీతో జరిగిన సమావేశాన్ని కూడా వివరించారు. ప్రధాని మోదీతో గంటన్నరసేపు గడపడం తనకు లభించిన అద్భుతమైన గొప్ప అవకాశమన్నారు.
అతను అత్యంత ప్రజాదరణ పొందిన ప్రపంచ నాయకుడు, నమ్మశక్యంకాని దూరదృష్టిగలవాడంటూ పొగడ్తల జల్లు కురిపించారు. అందుకు సంబంధించిన వీడియోని భారత రాయబారి తరణ్‌జీత్ సింగ్ సంధు ట్విట్టర్‌లో పోస్ట్ చేశారు. కాగా ఈ ఏడాది ప్రారంభంలో భారత్, యూఎస్‌లు అంతరిక్షం, రక్షణ, సెమీకండక్టర్లు, వంటి సాంకేతిక రంగాల్లో కలిసి పనిచేయడానికి సుముఖత వ్యక్తం చేశాయి.
“He is the most popular wrld leader fr a reason; he is a visionary; & his level of commitment to ppl of🇮🇳is indescribable..his desire to lift ppl out of poverty & move🇮🇳 fwd as a global power is real; & it’s happening” @SecRaimondo on PM @narendramodi pic.twitter.com/SK2oIHpYIK
— Taranjit Singh Sandhu (@SandhuTaranjitS) April 16, 2023
(చదవండి: అల్లాడుతున్న ప్రజలు.. ఏకంగా రూ.10 పెరిగిన పెట్రోల్ ధర)
Comments
Please login to add a commentAdd a comment