న్యూఢిల్లీ: బ్రిటన్‌తో స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం (ఎఫ్‌టీఏ)పై చర్చల్లో ఎంతో పురోగతి ఉన్నట్టు, చర్చలు త్వరలోనే ముగుస్తాయని కేంద్ర వాణిజ్య శాఖ కార్యదర్శి సునీల్ భరత్వాల్ వెల్లడించారు. ఈ నెలలో రెండు దేశాల మధ్య జరిగే ఉన్నతస్థాయి ద్వైపాక్షిక సమావేశంలో అపరిష్కృత అంశాలను కొలిక్కి తీసుకువచ్చేందుకు అవకాశం ఉందని చెప్పారు. ‘‘ఎఫ్‌టీఏలో 26 చాప్టర్లకు గాను, ఇప్పటికే 19 చాప్టర్లపై చర్చలు ముగిశాయి. ఇంకా కొన్ని అంశాలే మిగిలి ఉన్నాయి.
జైపూర్‌లో జరిగే ట్రేడ్ అండ్ ఇన్వెస్ట్‌మెంట్ గ్రూప్ (టీఐడబ్ల్యూజీ) సమావేశానికి బ్రిటన్ బృందం రానుంది. అప్పుడు మిగిలిన అంశాలపైనా ఏకాభిప్రాయానికి వస్తామనే భావిస్తున్నాం’’అని సునీల్ భరత్వాల్ తెలిపారు. రెండు దేశాల మధ్య పెట్టుబడుల విషయమై విడిగా ప్రత్యేక ద్వైపాక్షిక ఒప్పందం ఉంటుందని చెప్పారు. ఇప్పటికే యూకే బృందంలో ఒక వర్గం ఢిల్లీకి చేరుకుందని, మిగిలిన వరు 16వ తేదీ నుంచి వస్తారని భరత్వాల్ వెల్లడించారు. జైపూర్ చర్చల్లో పాల్గొనేందుకు బ్రిటన్ వాణిజ్య మంత్రి డీజీ ట్రేడ్ కూడా రానుండడం గమనార్హం. పెట్టుబడులకు సంబంధించి ఒప్పందం, ఆటో, విస్కీ, మేథో హక్కులు, సేవలకు సంబంధించిన అంశాలు రెండు దశాల మధ్య చర్చకు రానున్నాయి.
వాణిజ్యం కోసమే కాదు..
స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందాలు కేవలం వాణిజ్య కోణంలోనే కాదని, దేశ వ్యూహాత్మక అవసరాలను సైతం దృష్టిలో పెట్టుకుని చేస్తున్నామని సునీల్ భరత్వాల్ స్పష్టం చేశారు. ముఖ్యంగా కీలక ఖనిజాల సరఫరా దీనితో సాధ్యపడుతుందన్నారు. ఎలక్ట్రిక్ వాహనాల బ్యాటరీలకు కీలకమైన మినరల్స్ అవసరమని, వీటి సరఫరా కోసం భారత్ ఆ్రస్టేలియాతో చర్చలు నిర్వహిస్తున్నట్టు చెప్పారు. పెరూ, చిలీలోనూ కీలక ఖనిజాల నిల్వలు దండిగా ఉన్నట్టు పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment