సరికొత్త స్టార్టప్ పాలసీని రూపొందించేందుకు ప్రభుత్వం ఓ కమిటీని ఏర్పాటు చేసింది. ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, కామర్స్ సెక్రటరీ నేతృత్వంలో ఏర్పాటు చేసే ఈ కమిటీలో ఎలక్ట్రానిక్స్‌లోని పలువురు అధికారులను సభ్యులుగా చేర్చింది. ఐటీ విభాగం కార్యదర్శి ప్రద్యుమ్న ఈ మేరకు మంగళవారం జీవో జారీ చేశారు. రాష్ట్రంలో 100 ఇంక్యుబేటర్స్, 5 వేల స్టార్టప్ కంపెనీలు ఏర్పాటు చేయడం ప్రభుత్వ లక్ష్యమని పేర్కొంది. ఒక మిలియన్ చదరపు అడుగుల్లో ఇంక్యుబేషన్ అభివృద్ధి చేయాలని సంకల్పించింది. ఇందుకు అనుగుణం నిపుణుల సలహాలు సూచనలను స్వీకరించి, ప్రభుత్వానికి నివేదిక ఇవ్వాలని కమిటీని ఆదేశించింది.
స్టార్టప్ పాలసీ పర్యవేక్షణకు కమిటీ
Published Tue, Jun 28 2016 7:20 PM | Last Updated on Tue, Sep 4 2018 5:21 PM
Advertisement