Wilbur Ross
-
హెచ్1బీ ఫీజుతో అమెరికన్లకు శిక్షణ
వాషింగ్టన్: దేశీయ కంపెనీల్లో నిపుణుల కొరత తీర్చేందుకు హెచ్1–బీ వీసా ఫీజు డబ్బుతో అమెరికన్లకు శిక్షణ కార్యక్రమాలు చేపట్టినట్లు వాణిజ్య మంత్రి విల్బర్ రాస్ తెలిపారు. వివిధ కంపెనీలే అమెరికన్లకు శిక్షణ ఇచ్చేలా ట్రంప్ యంత్రాంగం ‘ఇండస్ట్రీ–రికగ్నైజ్డ్ అప్రెంటిస్‌షిప్ సిస్టం’ అనే విధానం తెచ్చింది. హెచ్1బీ వీసా ఫీజు డబ్బు సుమారు రూ.688 కోట్లను కార్మిక శాఖ 30 రకాల అప్రెంటిస్ షిప్ గ్రాంట్‌గా అందజేసిందన్నారు. ఈ ఫీజును విదేశీ ఉద్యోగులను నియమించుకున్న కంపెనీలే ప్రభుత్వానికి చెల్లించాల్సి ఉంటుంది. ప్రస్తుతం సైబర్ సెక్యూరిటీ, కృతిమ మేథ రంగాల్లో అమెరికన్ నిపుణులకు శిక్షణ ఇస్తున్నామన్నారు. అధికారుల వల్లే ‘హెచ్1బీ’ జాప్యం అమెరికా వలస విభాగం విధానాల కారణంగా హెచ్1–బీ జారీ ప్రక్రియ ఆలస్యమవుతోందని అమెరికా కాంగ్రెస్ సభ్యురాలు సుసాన్ ఎలెన్ లోఫ్గ్రెన్ ఆందోళన వ్యక్తం చేశారు. దరఖాస్తు దారులు ఒకసారి పంపిన వివరాలనే మళ్లీపంపాలని అడుగుతున్నారని, అనవసరమైన సమాచారం కావాలంటున్నారన్నారు. హెచ్1బీ దరఖాస్తులను పెండింగ్‌లో పెట్టిన ఘటనలు 2016తో పోలిస్తే 20 శాతం పెరిగాయని అమెరికన్ ఇమిగ్రేషన్ లాయర్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ మర్కెటా చెప్పారు. -
హెచ్1బీపై చర్చ
అమెరికా వాణిజ్య మంత్రి వద్ద ప్రస్తావించిన జైట్లీ వాషింగ్టన్: భారత ఐటీ రంగానికి షాకిచ్చిన హెచ్1బీ వీసా అంశాన్ని అమెరికా వాణిజ్య మంత్రి విల్బర్ రోస్ వద్ద ఆర్థిక మంత్రి జైట్లీ ప్రస్తావించారు. వీసాల అంశానికి సంబంధించి భారతీయుల ఆందోళనల గురించి అమెరికా దృష్టికి తీసుకెళ్లారు. అమెరికా అర్థిక వ్యవస్థ దూసుకెళ్లడానికి భారత నిఫుణులు చేసిన సేవలు ఎంతగానో ఉపయోగపడ్డాయని జైట్లీ గుర్తుచేశారు. ట్రంప్ అధికార పగ్గాలు చేపట్టిన తర్వాత రెండు దేశాల మ«ధ్య కేబినెట్ స్థాయి చర్చల కోసం జైట్లీ అమెరికాలో పర్యటిస్తున్నారు. ఈ సందర్భంగా అమెరికా వాణిజ్య మంత్రిని జైట్లీ కలిశారు. అమెరికా అభివృద్ధికి భారత నిపుణులు ఎంతగానో తోడ్పాటును అందించారని, ఈ విషయాన్ని దృష్టిలో ఉంచుకుని అమెరికా అధికార యంత్రాంగం తదుపరి నిర్ణయాలు తీసుకుంటుందని ఆశాభావం వ్యక్తం చేశారు. దీనిపై రోజ్ స్పందిస్తూ.. హెచ్1బీ వీసాల విధానంపై సమీక్ష ప్రక్రియ మొదలైందని, వీటిపై ఇంకా ఎటువంటి నిర్ణయం తీసుకోలేదని స్పష్టం చేశారు. చర్చల సందర్భంగా దేశంలో చేపట్టిన ఆర్థిక సంస్కరణలపై రోస్కు జైట్లీ వివరించారు. -
వాణిజ్య మోసాల కట్టడి
రెండు ఉత్తర్వులు జారీ చేసిన ట్రంప్ వాషింగ్టన్: వాణిజ్య మోసాలను కట్టడి చేసే రెండు కార్యనిర్వాహక ఉత్తర్వులపై అమెరికా అధ్యక్షుడు ట్రంప్ సంతకం చేశారు. ఇందులో మొదటిది.. చైనా, భారత్ సహా 16 దేశాలతో అమెరికా చేస్తున్న వాణిజ్యంలో ఏడాదికి 500 బిలియన్ డాలర్ల (సుమారు రూ. 32.40 లక్షల కోట్లు) లోటు రావడంపై సమగ్ర సమీక్ష చేయాలనేది. రెండోది దిగుమతి నిరోధక చట్టాల అమలును కచ్చి తంగా అమలు చేయడం కోసం రూపొం దించారు. ఇవి చైనాను ఉద్దేశించి చేసిన ఉత్తర్వులు కాదని అమెరికా అధికారులు చెబుతున్నారు. ఈ ఉత్తర్వులపై ఒవల్ ఆఫీసులో ట్రంప్ విలేకరులతో మాట్లాడుతూ ‘వారు మోసగాళ్లు. ఇప్పటి నుంచీ నిబంధనలు ఉల్లంఘించిన వారంతా తీవ్ర పరిణామాలను ఎదుర్కోవాల్సి ఉంటుంది’ అని అన్నారు. వాణిజ్య కార్యదర్శి విల్బర్ రాస్ నేతృత్వంలో వాణిజ్య లోటుకు గల కారణాలను విశ్లేషిస్తారన్నారు. అమెరికాకు 16 దేశాలతో అసమతౌల్య వ్యాపారం ఉందని ఆయన చెప్పారు. (చదవండి: ట్రంప్ మరో వివాదాస్పద ఆర్డర్: ఫేస్ బుక్ బ్యాన్)