వాణిజ్య మోసాల కట్టడి | Tightening to the business scams:Trump | Sakshi
Sakshi News home page

వాణిజ్య మోసాల కట్టడి

Published Sun, Apr 2 2017 2:29 AM | Last Updated on Sat, Aug 25 2018 7:52 PM

వాణిజ్య మోసాల కట్టడి - Sakshi

వాణిజ్య మోసాల కట్టడి

రెండు ఉత్తర్వులు జారీ చేసిన ట్రంప్‌  
వాషింగ్టన్‌: వాణిజ్య మోసాలను కట్టడి చేసే రెండు కార్యనిర్వాహక ఉత్తర్వులపై అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ సంతకం చేశారు. ఇందులో మొదటిది.. చైనా, భారత్‌ సహా 16 దేశాలతో అమెరికా చేస్తున్న వాణిజ్యంలో ఏడాదికి 500 బిలియన్‌ డాలర్ల (సుమారు రూ. 32.40 లక్షల కోట్లు) లోటు రావడంపై సమగ్ర సమీక్ష చేయాలనేది. రెండోది దిగుమతి నిరోధక చట్టాల అమలును కచ్చి తంగా అమలు చేయడం కోసం రూపొం దించారు. ఇవి చైనాను ఉద్దేశించి చేసిన ఉత్తర్వులు కాదని అమెరికా అధికారులు చెబుతున్నారు.

ఈ ఉత్తర్వులపై ఒవల్‌ ఆఫీసులో ట్రంప్‌ విలేకరులతో మాట్లాడుతూ ‘వారు మోసగాళ్లు. ఇప్పటి నుంచీ నిబంధనలు ఉల్లంఘించిన వారంతా తీవ్ర పరిణామాలను ఎదుర్కోవాల్సి ఉంటుంది’ అని అన్నారు. వాణిజ్య కార్యదర్శి విల్‌బర్‌ రాస్‌ నేతృత్వంలో వాణిజ్య లోటుకు గల కారణాలను విశ్లేషిస్తారన్నారు. అమెరికాకు 16 దేశాలతో అసమతౌల్య వ్యాపారం ఉందని ఆయన చెప్పారు.
(చదవండి: ట్రంప్ మరో వివాదాస్పద ఆర్డర్: ఫేస్ బుక్ బ్యాన్)

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement