పాల్వంచ(భద్రాద్రి కొత్తగూడెం): కేటీపీఎస్ ఏడో దశ పనుల్లో సరికొత్త రికార్డు సృష్టించింది. ఏడాదిన్నరలోనే కూలింగ్ టవర్‌ను పూర్తి చేసి ఈ రికార్డును సాధించారు. దేశంలోని 800 మెగావాట్ల విద్యుత్ కర్మాగారాల్లో కూలింగ్ టవర్‌ను ఇంత తక్కువ వ్యవధిలో నిర్మించడం విశేషం. రూ.5,200కోట్ల వ్యయంతో 800 మెగావాట్ల విద్యుత్ కర్మాగార పనులను బీహెచ్‌ఈఎల్ కంపెనీ నిర్వహిస్తోంది.
కర్మాగారంలో ప్రాధాన్యత కలిగిన కూలింగ్ టవర్‌ను బీహెచ్‌ఈఎల్ సంస్థ పహార్‌పూర్ కంపెనీకి సబ్ కాంట్రాక్ట్ కింద అప్పగించింది. వాస్తవంగా కేటీపీఎస్ 7వ దశ పనులు 2015 జనవరిలో ప్రారంభం కాగా ఏడాదిన్నర ఆలస్యంగా కూలింగ్ టవర్ పనులు ప్రారంభించారు. ఆలస్యంగా పనులు చేపట్టడంతో కూలింగ్ టవర్ నిర్మాణం వెనుకబడుతుందని అధికారులు ఆందోళన చెందారు. కానీ,2016 జూలై 12న పనులు ప్రారంభించి డిసెంబర్ 30 నాటికి పూర్తి చేశారు.175 మీటర్ల ఎత్తులో విశాలమైన ఈ కట్టడాన్ని ఏడాదిన్నరలోనే పూర్తి చేసి రికార్డ్ సాధించడంతో అధికారులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment