భెల్ నష్టాలు రూ.877 కోట్లు | BHEL FY16 loss at Rs 877cr (provisional), order inflows jump 42% | Sakshi
Sakshi News home page

భెల్ నష్టాలు రూ.877 కోట్లు

Published Fri, Apr 8 2016 12:40 AM | Last Updated on Sun, Sep 3 2017 9:25 PM

భెల్ నష్టాలు రూ.877 కోట్లు

భెల్ నష్టాలు రూ.877 కోట్లు

2015-16 ప్రాథమిక ఫలితాలు వెల్లడించిన కంపెనీ
న్యూఢిల్లీ: కొత్త ఆర్డర్లు భారీగా ఉన్నా, టర్నోవర్ అధికంగా ఉన్నా కూడా గత ఆర్థిక సంవత్సరంలో విద్యుదుత్పత్తి పరికరాలు తయారు చేసే ప్రభుత్వ రంగ సంస్థ, భెల్‌కు రూ.877 కోట్ల నష్టాలు వచ్చాయి. గురువారం జరిగిన కంపెనీ డెరైక్టర్ల బోర్డ్ సమావేశంలో గత ఆర్థిక సంవత్సరపు తాత్కాలిక ఆర్థిక ఫలితాలను ఆమోదించారు. గతేడాది రూ.43,727 కోట్ల కొత్త ఆర్డర్లు వచ్చాయని భెల్ తెలిపింది. అంతకు ముందటి ఆర్థిక సంవత్సరంలో ఆర్డర్లు రూ.30,814 కోట్లుగా ఉన్నాయని,  గత ఐదేళ్లలో ఎన్నడూ రానంతగా ఆర్డర్లు వచ్చాయని వివరించింది. ఇక గతేడాది నాలుగో త్రైమాసికంలో రూ.396 కోట్ల నికర లాభం సాధించామని తెలిపింది. వ్యాపార వాతావరణం  మందకొడిగా ఉండడం, వివిధ కారణాల వల్ల ఆగిపోయిన ప్రాజెక్టులు పట్టాలెక్కకపోవడం వంటి కారణాల వల్ల గత ఆర్థిక సంవత్సరంలో అంతంత మాత్రం ఫలితాలు సాధించామని భెల్ తెలిపింది.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement