preliminary results
-
తెలంగాణ గ్రూప్-1 ప్రిలిమ్స్ ఫలితాలు విడుదల
సాక్షి, హైదరాబాద్: గ్రూప్–1 ప్రిలిమ్స్ ఫలితాలు విడుదలయ్యాయి. ప్రిలిమ్స్ రాసినవారిలో మెయిన్స్ పరీక్షలకు అర్హత సాధించిన అభ్యర్థుల జాబితాను తెలంగాణ స్టేట్ పబ్లిక్ సరీ్వస్ కమిషన్ (టీఎస్పీఎస్సీ) శుక్రవారం అర్ధరాత్రి విడుదల చేసింది. ఒక్కో పోస్టుకు 50 మంది చొప్పున మొత్తంగా 25,050 మందిని మెయిన్స్‌కు ఎంపిక చేసినట్టు వెల్లడించింది. ఈ మేరకు అభ్యర్థుల హాల్‌టికెట్ నంబర్లతో కూడిన జాబితాను టీఎస్పీఎస్సీ వెబ్సైట్లో పెట్టింది. ఈ ఫలితాలకు సంబంధించి ఏవైనా అభ్యంతరాలు, విజ్ఞప్తులు ఉంటే టీఎస్పీఎస్సీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన హెల్ప్ డెస్క్‌కు కార్యాలయ పనివేళల్లో ఫోన్ చేసి సంప్రదించవచ్చని సూచించింది. ఈ ఏడాది జూన్‌లో మెయిన్స్ పరీక్షలు నిర్వహిస్తామని.. ఆ పరీక్ష ప్యాటర్న్‌ను ఈనెల 18న కమిషన్ వెబ్సైట్లో అందుబాటులో ఉంచుతామని తెలిపింది. 503 గ్రూప్–1 ఉద్యోగాలకు.. రాష్ట్ర ప్రభుత్వ శాఖల్లో 503 గ్రూప్–1 ఉద్యోగాల భర్తీకి గత ఏడాది నోటిఫికేషన్ విడుదలైన సంగతి తెలిసిందే. దరఖాస్తులు స్వీకరించిన టీఎస్పీఎస్సీ అక్టోబర్ 16న ప్రిలిమ్స్ పరీక్షను నిర్వహించింది. మొత్తం 2,85,916 మంది పరీక్షకు హాజరయ్యారు. అక్టోబర్ నెలాఖరులో టీఎస్పీఎస్సీ అభ్యర్థుల ఓఎంఆర్ జవాబు పత్రాలను స్కాన్ చేసి వెబ్సైట్లో పెట్టింది. ప్రాథమిక కీ విడుదల చేసి.. అభ్యంతరాలను స్వీకరించింది. ఐదు ప్రశ్నలను తొలగించి తుది కీని ప్రకటించింది. తాజాగా మల్టీజోన్లు, రిజర్వేషన్లు, జెండర్ వారీగా ఒక్కో పోస్టుకు 50 మంది చొప్పున అభ్యర్థులను ఎంపిక చేసింది. అయితే మల్టీజోన్–2 పరిధిలో విజువల్లీ హ్యాండిక్యాప్డ్ (విమెన్), హియరింగ్ ఇంపెయిర్డ్ (జనరల్) కేటగిరీల్లో 1:50 నిష్పత్తిలో అభ్యర్థులు లేకపోవడంతో ఆ రెండు కేటగిరీలను పక్కనపెట్టింది. మొత్తంగా 25,050 మందిని మెయిన్స్‌కు ఎంపిక చేసి జాబితాను వెబ్సైట్లో పొందుపర్చింది. మహిళలకు 33శాతం రిజర్వేషన్లు.. మహిళా రిజర్వేషన్లకు సంబంధించి హైకోర్టు ఉత్తర్వులకు అనుగుణంగా.. నేరుగా 33% రిజర్వేషన్లు కలి్పస్తున్నట్టు టీఎస్పీఎస్సీ వెల్లడించింది. ఒకే మార్కులను ఇద్దరు లేదా అంతకు మించి అభ్యర్థులు సాధిస్తే.. వారి స్థానికత ప్రకారం అర్హతను ఖరారు చేసినట్టు కమిషన్ తెలిపింది. ఒకే మార్కులు సాధించిన వారు ఒకే స్థానికతతో ఉన్నప్పుడు అభ్యర్థుల పుట్టినతేదీ ఆధారంగా ఎక్కువ వయసున్న వారికి హయ్యర్ ర్యాంకు ఇచి్చనట్టు వివరించింది. ఓఎంఆర్ పత్రాల్లో కమిషన్ సూచించిన విధంగా కాకుండా ఇష్టానుసారం బబ్లింగ్ చేసిన వారిని పరిగణనలోకి తీసుకోలేదని కమిషన్ తెలిపింది. వివరాలకు.. టీఎస్పీఎస్సీ వెబ్సైట్: ఠీఠీఠీ.్టటpటఛి.జౌఠి.జీn టీఎస్పీఎస్సీ హెల్ప్‌డెస్క్ నంబర్లు: 040–22445566, 040–23542185, 040–23542187 ఈ–మెయిల్: helpdesk@tspsc. gov. in -
Telangana: ఎస్సై, కానిస్టేబుల్ ప్రిలిమినరీ పరీక్ష ఫలితాలు విడుదల
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో ఇటీవల నిర్వహించిన ఎస్సై, కానిస్టేబుల్ ప్రిలిమినరీ పరీక్ష ఫలితాలు విడుదలయ్యాయి. ఈ మేరకు ఫలితాలను తెలంగాణ స్టేట్ లెవల్ పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు శుక్రవారం విడుదల చేసింది. సివిల్ ఎస్సై ప్రిలిమినరీ పరీక్షలో 46.80 శాతం, సివిల్ కానిస్టేబుల్ ప్రాథమిక పరీక్షలో 31.40శాతం, ట్రాన్స్‌పోర్టు కానిస్టేబుల్ పరీక్షలో 44.84శాతం, ఎక్సైజ్ కానిస్టేబుల్ పరీక్షలో 43.65శాతం మంది ఉత్తీర్ణత సాధించినట్లు పేర్కొంది. కాగా రాష్ట్రంలో ఖాళీగా ఉన్న 554 ఎస్ఐ పోస్టుల భర్తీకి ఆగస్టు 7న రాత పరీక్ష నిర్వహించిన విషయం తెలిసిందే. 15,644 కానిస్టేబుల్, 63 ట్రాన్స్‌పోర్టు కానిస్టేబుల్, 614 ప్రొహిబిషన్, ఎక్సైజ్ కానిస్టేబుల్స్ పోస్టులకు ఆగస్టు 28న పోలీసు నియామక మండలి పరీక్ష నిర్వహించింది. -
అఫ్గానిస్తాన్ పగ్గాలు మళ్లీ ఘనీకే !
కాబూల్: అఫ్గానిస్తాన్ అధ్యక్షుడుగా అష్రాఫ్ ఘనీ మళ్లీ ఎన్నికయ్యారు. ఎన్నికల సంఘం ఆదివారం ప్రాథమిక ఫలితాలను వెల్లడించింది. ఇందులో ఘనీ స్పష్టమైన ఆధిక్యాన్ని సాధించారు. అష్రాఫ్ ఘనీకి 50.64 శాతం ఓట్లు వస్తే, ఆయన ప్రత్యర్థి చీఫ్ ఎగ్జిక్యూటివ్ అబ్దుల్లా అబ్దుల్లాకు 39.52 శాతం ఓట్లు లభించాయి. ఇండిపెండెంట్ ఎన్నికల కమిషన్ (ఈఏసీ) తుది ఫలితాల్ని మరికొద్ది వారాల్లో ప్రకటించనుంది. ఈలోగా ఎన్నికల్లో పోటీ చేసిన అభ్యర్థులెవరైనా ఫలితాలపై తమకేమైనా అభ్యంతరాలుంటే వ్యక్తం చేసే హక్కు ఉంది. ఎన్నికల సంఘానికి ఫిర్యాదు కూడా చేయొచ్చు. ఈ ఎన్నికలు పారదర్శకంగా జరగలేదని, ఫలితాల్ని సవాల్ చేస్తామని అబ్దుల్లా ప్రకటించారు. సెప్టెంబర్ 28న అఫ్గానిస్తాన్‌లో ఎన్నికలు జరిగాయి. అక్టోబర్ 19న ఫలితాల్ని వెల్లడించాల్సి ఉండగా సాంకేతిక సమస్యలు, ఎన్నికల్లో పోటీ చేసిన అభ్యర్థుల ఎన్నికల ప్రక్రియలో అక్రమాలు జరిగాయని పదే పదే ఆరోపించడంతో ఫలితాల ప్రకటనలో తీవ్ర జాప్యం జరిగింది. ఎన్నికల పరిశీలకులు, పోటీ చేసిన అభ్యర్థులు ఈఏసీ సక్రమ మైన పనితీరును కనబరచలేదని ఆందోళన వ్యక్తం చేస్తూనే ఉన్నారు. అయితే 2001లో తాలిబన్ల పాలన అంతం తర్వాత జరిగిన ఈ ఎన్నికలు పారదర్శకంగా జరిగాయని ఐక్యరాజ్య సమితి అంటోంది. జర్మనీ సంస్థ పంపిణీ చేసిన బయోమెట్రిక్ యంత్రాలు బాగా పనిచేశాయని పేరొచ్చింది. కానీ, లక్ష ఓట్ల వరకు గల్లంతైనట్టు ఎన్నికల పరిశీలకులు భావిస్తున్నారు. మరోవైపు తాలిబన్లతో అమెరికా జరిపిన చర్చలతో రాజకీయ అనిశ్చితి నెలకొంది. ఇక వారితో చర్చించడానికేమీ లేదని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ప్రకటిస్తే, అమెరికాతో కుదిరిన ఒప్పందం ప్రకారం అఫ్గానిస్తాన్‌లో ఏర్పడే ప్రభుత్వంతోనే చర్చిస్తామని తాలిబన్లు చెబుతున్నారు. ఈ పరిస్థితుల్లో జరిగిన ఎన్నికలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. ఎన్నికల సంఘం అధ్యక్షురాలు హవా అలామ్ నురిస్తానీ తమకు అప్పగించిన బాధ్యతను నీతి, నిజాయితీ , చిత్తశుద్ధితో నిర్వహించామన్నారు. ఫలితాలు పారదర్శకంగా లేవు: అబ్దుల్లా ఎన్నికల ఫలితాలు వెలువడగానే అబ్దుల్లా కార్యాలయం నుంచి వెలువడిన ప్రకటనలో..‘మాకు ఓటు వేసిన ప్రజలకి, మద్దతుదారులకి, ఎన్నికల సంఘానికి, అంతర్జాతీయ మిత్రులకి మేం ఒకటే చెబుదామనుకుంటున్నాం. ఎన్నికల ఫలితాల్ని మేం అంగీకరించడం లేదు. చట్టపరంగా మేం చేస్తున్న డిమాండ్లు తీర్చాల్సి ఉంది’’అని ఉంది. -
భెల్ నష్టాలు రూ.877 కోట్లు
2015-16 ప్రాథమిక ఫలితాలు వెల్లడించిన కంపెనీ న్యూఢిల్లీ: కొత్త ఆర్డర్లు భారీగా ఉన్నా, టర్నోవర్ అధికంగా ఉన్నా కూడా గత ఆర్థిక సంవత్సరంలో విద్యుదుత్పత్తి పరికరాలు తయారు చేసే ప్రభుత్వ రంగ సంస్థ, భెల్‌కు రూ.877 కోట్ల నష్టాలు వచ్చాయి. గురువారం జరిగిన కంపెనీ డెరైక్టర్ల బోర్డ్ సమావేశంలో గత ఆర్థిక సంవత్సరపు తాత్కాలిక ఆర్థిక ఫలితాలను ఆమోదించారు. గతేడాది రూ.43,727 కోట్ల కొత్త ఆర్డర్లు వచ్చాయని భెల్ తెలిపింది. అంతకు ముందటి ఆర్థిక సంవత్సరంలో ఆర్డర్లు రూ.30,814 కోట్లుగా ఉన్నాయని, గత ఐదేళ్లలో ఎన్నడూ రానంతగా ఆర్డర్లు వచ్చాయని వివరించింది. ఇక గతేడాది నాలుగో త్రైమాసికంలో రూ.396 కోట్ల నికర లాభం సాధించామని తెలిపింది. వ్యాపార వాతావరణం మందకొడిగా ఉండడం, వివిధ కారణాల వల్ల ఆగిపోయిన ప్రాజెక్టులు పట్టాలెక్కకపోవడం వంటి కారణాల వల్ల గత ఆర్థిక సంవత్సరంలో అంతంత మాత్రం ఫలితాలు సాధించామని భెల్ తెలిపింది.