సాక్షి, హైదరాబాద్: గ్రూప్–1 ప్రిలిమ్స్ ఫలితాలు విడుదలయ్యాయి. ప్రిలిమ్స్ రాసినవారిలో మెయిన్స్ పరీక్షలకు అర్హత సాధించిన అభ్యర్థుల జాబితాను తెలంగాణ స్టేట్ పబ్లిక్ సరీ్వస్ కమిషన్ (టీఎస్‌పీఎస్సీ) శుక్రవారం అర్ధరాత్రి విడుదల చేసింది. ఒక్కో పోస్టుకు 50 మంది చొప్పున మొత్తంగా 25,050 మందిని మెయిన్స్‌కు ఎంపిక చేసినట్టు వెల్లడించింది. ఈ మేరకు అభ్యర్థుల హాల్‌టికెట్ నంబర్లతో కూడిన జాబితాను టీఎస్‌పీఎస్సీ వెబ్‌సైట్‌లో పెట్టింది. ఈ ఫలితాలకు సంబంధించి ఏవైనా అభ్యంతరాలు, విజ్ఞప్తులు ఉంటే టీఎస్‌పీఎస్సీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన హెల్ప్ డెస్క్‌కు కార్యాలయ పనివేళల్లో ఫోన్ చేసి సంప్రదించవచ్చని సూచించింది. ఈ ఏడాది జూన్‌లో మెయిన్స్ పరీక్షలు నిర్వహిస్తామని.. ఆ పరీక్ష ప్యాటర్న్‌ను ఈనెల 18న కమిషన్ వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచుతామని తెలిపింది.
503 గ్రూప్–1 ఉద్యోగాలకు..
రాష్ట్ర ప్రభుత్వ శాఖల్లో 503 గ్రూప్–1 ఉద్యోగాల భర్తీకి గత ఏడాది నోటిఫికేషన్ విడుదలైన సంగతి తెలిసిందే. దరఖాస్తులు స్వీకరించిన టీఎస్‌పీఎస్సీ అక్టోబర్ 16న ప్రిలిమ్స్ పరీక్షను నిర్వహించింది. మొత్తం 2,85,916 మంది పరీక్షకు హాజరయ్యారు. అక్టోబర్ నెలాఖరులో టీఎస్‌పీఎస్సీ అభ్యర్థుల ఓఎంఆర్ జవాబు పత్రాలను స్కాన్ చేసి వెబ్‌సైట్‌లో పెట్టింది. ప్రాథమిక కీ విడుదల చేసి.. అభ్యంతరాలను స్వీకరించింది. ఐదు ప్రశ్నలను తొలగించి తుది కీని ప్రకటించింది. తాజాగా మల్టీజోన్లు, రిజర్వేషన్లు, జెండర్ వారీగా ఒక్కో పోస్టుకు 50 మంది చొప్పున అభ్యర్థులను ఎంపిక చేసింది. అయితే మల్టీజోన్–2 పరిధిలో విజువల్లీ హ్యాండిక్యాప్‌డ్ (విమెన్), హియరింగ్ ఇంపెయిర్డ్ (జనరల్) కేటగిరీల్లో 1:50 నిష్పత్తిలో అభ్యర్థులు లేకపోవడంతో ఆ రెండు కేటగిరీలను పక్కనపెట్టింది. మొత్తంగా 25,050 మందిని మెయిన్స్‌కు ఎంపిక చేసి జాబితాను వెబ్‌సైట్‌లో పొందుపర్చింది.
మహిళలకు 33శాతం రిజర్వేషన్లు..
మహిళా రిజర్వేషన్లకు సంబంధించి హైకోర్టు ఉత్తర్వులకు అనుగుణంగా.. నేరుగా 33% రిజర్వేషన్లు కలి్పస్తున్నట్టు టీఎస్‌పీఎస్సీ వెల్లడించింది. ఒకే మార్కులను ఇద్దరు లేదా అంతకు మించి అభ్యర్థులు సాధిస్తే.. వారి స్థానికత ప్రకారం అర్హతను ఖరారు చేసినట్టు కమిషన్ తెలిపింది. ఒకే మార్కులు సాధించిన వారు ఒకే స్థానికతతో ఉన్నప్పుడు అభ్యర్థుల పుట్టినతేదీ ఆధారంగా ఎక్కువ వయసున్న వారికి హయ్యర్ ర్యాంకు ఇచి్చనట్టు వివరించింది. ఓఎంఆర్ పత్రాల్లో కమిషన్ సూచించిన విధంగా కాకుండా ఇష్టానుసారం బబ్లింగ్ చేసిన వారిని పరిగణనలోకి తీసుకోలేదని కమిషన్ తెలిపింది.
వివరాలకు..
టీఎస్‌పీఎస్సీ వెబ్‌సైట్: ఠీఠీఠీ.్టటpటఛి.జౌఠి.జీn
టీఎస్‌పీఎస్సీ హెల్ప్‌డెస్క్ నంబర్లు: 040–22445566, 040–23542185, 040–23542187
ఈ–మెయిల్: helpdesk@tspsc. gov. in
Comments
Please login to add a commentAdd a comment