భెల్: కార్మికులు ఆరోగ్యంగా ఉన్నప్పుడే విధి నిర్వహణలో బాధ్యతాయుతంగా పనిచేయగలుగుతారని ఏజీఎం హెచ్‌ఆర్ ఆదిశేష్, భెల్ అధికార కార్మిక యూనియన్ అధ్యక్షుడు జి.ఎల్లయ్య పేర్కొన్నారు. బీహెచ్‌ఈఎల్, ఈఎస్‌ఐ సంయుక్త ఆధ్వర్యంలో మంగళవారం జ్యోతి విద్యాలయంలో ఒప్పంద కార్మికులకు ఉచిత వైద్య శిబిరం నిర్వహించారు.
ఈఎస్‌ఐ జాయింట్ డైరక్టర్ సమక్షంలో వైద్య బందం కార్మికులకు ఆరోగ్య పరీక్షలు నిర్వహించి మందులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ భెల్ పరిశ్రమ యాజమాన్యం కాంట్రాక్ట్ కార్మికుల ఆరోగ్యాలను దృష్టిలో ఉంచుకొని ఉచిత వైద్య శిబిరం నిర్వహించిదన్నారు. కార్మికులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.
శిబిరం మరో రెండు రోజుల పాటు కొనసాగింస్తామనిఅధికారులు పేర్కొన్నారు. కార్మికులకు పరీక్షల్లో ఇతరత్ర వ్యాధులు నిర్ధారణ అయితే మెరుగైన వైద్యం కోసం కార్పొరేటర్ ఆస్పత్రులకు తరలిస్తామన్నారు. కార్యక్రమంలో నిర్వాహకులు సత్యబాబు, వైద్యులు, కార్మిక యూనియన్ నాయకులు, హెచ్‌ఆర్ అధికారులు తదితరులు పాల్గొన్నారు.