నష్టాలోకి జారుకున్న మార్కెట్లు | Nifty below 8950, Sensex slips into red; BHEL, Bharti down | Sakshi
Sakshi News home page

నష్టాలోకి జారుకున్న మార్కెట్లు

Published Wed, Sep 7 2016 9:48 AM | Last Updated on Mon, Sep 4 2017 12:33 PM

Nifty below 8950, Sensex slips into red; BHEL, Bharti down

ముంబై : బ్యాంకింగ్, ఆటో స్టాక్స్ మద్దతుతో మంగళవారం కొత్త శిఖరాల దిశగా దూసుకెళ్లిన్న స్టాక్ మార్కెట్లు, నేడు కూడా అదే ఉత్సాహంతో ముందుకొచ్చాయి. కానీ ఆ ఉత్సాహం ఎన్నో నిమిషాలు నిలవలేదు. దేశీయ సూచీలు వెంటనే నష్టాలోకి జారుకున్నాయి. ప్రస్తుతం సెన్సెక్స్ 24 పాయింట్ల నష్టంతో 28954 వద్ద, నిఫ్టీ 14.80 పాయింట్ల నష్టంతో 8928 వద్ద ట్రేడ్ అవుతున్నాయి. బీహెచ్ఈఎల్, ఏషియన్ పేయింట్స్, భారతీ ఎయిర్ టెల్, యాక్సిస్ బ్యాంకు, హెచ్యూఎల్ నష్టాలు గడిస్తుండగా..ఎస్బీఐ, ఐసీఐసీఐ బ్యాంకు, టాటా స్టీలు, విప్రోలు లాభాల్లో నడుస్తున్నాయి. మార్కెట్లలో నమోదవుతున్న లాభాల వల్ల పెట్టుబడిదారులు నేడు ప్రాఫిట్ బుకింగ్స్ పై ఎక్కువగా మొగ్గుచూపారని ఆ ప్రభావంతో దేశీయ సూచీలు నష్టాలోకి జారుకున్నట్టు విశ్లేషకులు చెబుతున్నారు.
 
నాలుగు నెలల గరిష్టంలో నమోదవుతున్న డాలర్తో రూపాయి మారకం విలువ నేటి ట్రేడింగ్లో కూడా బలపడింది. నిన్నటి ముగింపుకు 16 పైసలు లాభంతో ప్రారంభమైంది. ఫెడ్ రేటు ఆందోళనలు వీడటంతో డాలర్ బలహీనపడిందని, రూపాయి విలువ పెరుగుతున్నట్టు మార్కెట్ విశ్లేషకులు చెబుతున్నారు. ప్రస్తుతం డాలర్తో రూపాయి మారకం విలువ 45 బలపడి 66.38గా ఉంది.  అటు ఎంసీఎక్స్ మార్కెట్లో 10 గ్రాముల బంగారం ధర 393 రూపాయల లాభంతో 31,378గా కొనసాగుతోంది. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement