54 శాతం పెరిగిన బీహెచ్ఈఎల్ లాభం
న్యూఢిల్లీ: బీహెచ్‌ఈఎల్ పనితీరులో యూ టర్న్ తీసుకుంది. జూన్ త్రైమాసికంలో ఆశాజనక ఫలితాలను ప్రకటించింది. కంపెనీ లాభం రూ.77.77కోట్లుగా నమోదైంది. గతేడాది జూన్ త్రైమాసికంలో ఆర్జించిన రూ.50.43 కోట్లతో పోలిస్తే 54.21% వృద్ధి చెందింది. మూడున్నరేళ్ల తర్వాత కంపెనీ ఆదాయాల్లో మళ్లీ వృద్ధి సాధ్యమైంది. గతేడాది జూన్ త్రైమాసికంతో పోలిస్తే ఆదాయం 29% వృద్ధి చెంది రూ.4,421 కోట్ల నుంచి రూ.5,721 కోట్లకు చేరుకుంది.
ఆదాయాల్లో 14 వరుస త్రైమాసికాల క్షీణత తర్వాత తిరిగి వృద్ధి నమోదు కావడం ఇదే. ప్రాజెక్టులను త్వరితగతిన అమలు చేయడమే దీనికి కారణమని బీహెచ్‌ఈఎల్ సీఎండీ అతుల్‌సోబ్తి తెలి పారు. ఆర్డర్‌బుక్ పెంచుకునే చర్యలు చేపట్టినట్టు చెప్పారు. పూర్తి చేయాల్సిన ఆర్డర్ బుక్ రూ.1,08,000 కోట్లుగా ఉంది. ఫలితాల నేపథ్యంలో బీహెచ్‌ఈఎల్ స్టాక్ ఎన్‌ఎస్‌ఈలో 16.66% లాభపడి రూ.160 వద్ద ముగిసింది.