
న్యూఢిల్లీ: ప్రభుత్వ రంగ దిగ్గజం భెల్ ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మూడో త్రైమాసికంలో రూ. 153 కోట్ల నికర లాభం ప్రకటించింది. ఇది అంతక్రితం ఆర్థిక సంవత్సర క్యూ3లో నమోదైన రూ.93 కోట్లతో పోలిస్తే 64 శాతం అధికం. మరోవైపు ఆదాయం రూ. 6,187 కోట్ల నుంచి రూ. 6,494 కోట్లకు పెరిగింది.
2017–18కి గాను 40 శాతం మధ్యంతర డివిడెండు (షేరుకు రూ.0.80) ఇవ్వాలని కంపెనీ బోర్డు నిర్ణయించింది. ఫిబ్రవరి 28న దీన్ని చెల్లిస్తామని కంపెనీ తెలియజేసింది. ప్రాజెక్టులను వేగవంతంగా అమలు చేయడం, వనరులను సమర్థవంతంగా వినియోగించుకోవడం, నిల్చిపోయిన ప్రాజెక్టులను పునరుద్ధరించేందుకు నిర్విరామ కృషి మొదలైనవి సానుకూల ఫలితాలిస్తున్నాయని భెల్ చైర్మన్ అతుల్ సోబ్తి ఈ సందర్భంగా చెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment