
ఉద్యోగుల శ్రమను దోపిడీ చేసి ఆదాయాలను పెంచుకునే కంపెనీలనే చూస్తుంటాం. కానీ మంచి లాభాలు వచ్చినప్పుడు దాన్ని ఉద్యోగులకు పంచే యాజమాన్యాలు కూడా కొన్ని ఉంటాయి. పారిస్‌కు చెందిన ప్రముఖ లగ్జరీ బ్రాండ్ హెర్మేస్ (Hermes) గత సంవత్సరం అసాధారణమైన లాభాలు సాధించింది. పరిశ్రమలోనూ దాని స్థానం మెరుగైంది. దీంతో ఉద్యోగులకు బోనస్ (bonus) ఇవ్వాలని కంపెనీ నిర్ణయించింది. 2025 ప్రారంభంలో తమ సంస్థలో పనిచేసే ఒక్కో ఉద్యోగికి రూ. 4 లక్షలు (4,500 యూరోలు) బోనస్ ఇచ్చేందుకు సిద్ధమైంది.
ఈ ఫ్రెంచ్ ఫ్యాషన్ బ్రాండ్ ఏకీకృత ఆదాయం 2024 లో 15.2 బిలియన్ యూరోలను తాకింది. 2023 తో పోలిస్తే స్థిరమైన మారకపు రేట్లలో 15 శాతం, ప్రస్తుత మారకపు రేట్ల వద్ద 13 శాతం పెరుగుదల. హెర్మేస్ దీర్ఘకాలిక అభివృద్ధి వ్యూహం, లోతుగా పాతుకుపోయిన వారసత్వ కళలు కంపెనీని ఇంత దూరం నడిపించాయి. ఈ లగ్జరీ లెజెండ్ ప్రపంచవ్యాప్తంగా తన పంపిణీ నెట్‌వర్క్‌ను బలోపేతం చేసుకుంటూ నమ్మకమైన కస్టమర్ బేస్ సంపాదించుకుంటూ అంతర్జాతీయంగా తన బ్రాండ్‌ను విస్తరించింది.

వ్యాపారం పెరుగుతుండటంతో ఈ ఫ్యాషన్ బ్రాండ్ స్థిరమైన అభివృద్ధితోపాటు శ్రామిక శక్తిని బలోపేతం చేయడంపైనా దృష్టి పెట్టింది. హెర్మేస్ గ్రూప్ 2024 సంవత్సరంలో ఫ్రాన్స్‌లో 1,300 మందితో సహా మొత్తం 2,300 మంది కొత్త ఉద్యోగులను నియమించుకుంది. దీంతో దాని మొత్తం శ్రామిక శక్తి 25,000 మందికి చేరుకుంది. ఫ్యాషన్ యునైటెడ్ నివేదిక ప్రకారం.. సామాజిక నిబద్ధత విధానంలో భాగంగా గ్రూప్ ఉద్యోగులందరికీ ఒక్కొక్కరికి రూ.4 లక్షలు (4,500 యూరోలు) చొప్పున బోనస్‌ను ఆర్థికేడాది ప్రారంభంలోనే కంపెనీ చెల్లించనుంది.
ఇది చదివారా? బీఎస్‌ఎన్‌ఎల్ కొత్త రీచార్జ్ ప్లాన్.. దాదాపు 2 నెలలు అన్‌లిమిటెడ్
జపాన్ మినహా హెర్మేస్ ఈ సంవత్సరంలో 7 శాతం ఆదాయ వృద్ధిని సాధించింది. ఒక్క నాల్గవ త్రైమాసికంలోనే 9 శాతం పెరిగింది. బీజింగ్, షెన్‌జెన్‌లలో అనేక స్టోర్లు తెరిచినట్లు ఫ్యాషన్ యునైటెడ్ నివేదించింది. ఫ్రాన్స్ కాకుండానే యూరప్‌లో గరిష్ట వృద్ధి కనిపించింది. స్థానిక డిమాండ్, ఈ ప్రాంతంలో పర్యాటకుల సంఖ్య పెరగడంతో 19 శాతం వృద్ధి కనిపించింది. లిల్లే, నేపుల్స్‌లో కొత్త బోటిక్‌లను ప్రారంభించడం ఫ్యాషన్ బ్రాండ్ వృద్ధికి, విస్తరణకు తోడ్పడింది.
Comments
Please login to add a commentAdd a comment