France company
-
లేఆఫ్స్ వేళ ఫ్రెంచ్ కంపెనీ సంచలనం.. కొత్తగా 12 వేల మందికి ఉద్యోగాలు!
అన్ని రంగాలకు చెందిన పెద్ద పెద్ద కంపెనీలు లేఆఫ్స్ పేరుతో వేలాదిగా ఉద్యోగులను తొలగిస్తున్న తరుణంలో ఫ్రెంచ్కు చెందిన మల్టీ నేషన్ కంపెనీ థేల్స్ గ్రూప్ సంచలన విషయం వెల్లడించింది. ఏరోస్పేస్, రక్షణ, భద్రత, డిజిటల్ ఐడెంటిటీ, సెక్యూరిటీ రంగాల్లో ఈ ఏడాదిలో 12 మంది కొత్త ఉద్యోగులను నియమించుకోనున్నట్లు పేర్కొంది. కంపెనీ విడుదల చేసిన ప్రకటన ప్రకారం.. ప్రపంచవ్యాప్తంగా మొత్తం 12 వేల మందిని నియమించుకోనుండగా ప్రత్యేకంగా ఫ్రాన్స్‌లో 5,500, భారత్‌లో 550, యునైటెడ్ కింగ్డమ్లో 1,050, ఆస్ట్రేలియాలో 600, అమెరికాలో 540 మంది కొత్త ఉద్యోగులను తీసుకోవాలని భావిస్తోంది. ముఖ్యంగా భారత్‌లో ఇంజినీరింగ్ ఆపరేషన్స్ కోసం ఉద్యోగులను నియమించుకుంటోంది. (ఇదీ చదవండి: Layoffs: నా చిన్నారి పాపకు నేనేం చెప్పను? తొలగించిన గూగుల్ ఉద్యోగిని ఆవేదన!) థేల్స్ గ్రూప్ తన అన్ని వ్యాపార విభాగాల్లోనూ నియామకాలు చేపడుతోంది. భారత్‌లోని నోయిడా, బెంగళూరులో ఉన్న సైట్ల కోసం శాశ్వత, ఒప్పంద ప్రాతిపదికన రిక్రూట్ చేస్తోంది. ముఖ్యంగా హార్డ్‌వేర్ ఇంజనీర్లు, సాఫ్ట్వేర్ ఇంజనీర్లు, సిస్టమ్స్ ఆర్కిటెక్ట్‌లు, డిజిటల్ టెక్నాలజీ నిపుణులు, ప్రాజెక్ట్ మేనేజర్ల కోసం చూస్తోంది. (ఇదీ చదవండి: సీఈవో జీతం తెలిసి యూజర్లు షాక్! దీంతో ఎలా బతుకుతున్నారు సార్?) -
హైదరాబాద్‌కు ‘ఎగిరొచ్చిన’ ప్రపంచంలోనే నంబర్ 1 సంస్థ
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో భారీ పెట్టుబడులు పెట్టేందుకు మరో విదేశీ దిగ్గజ సంస్థ సిద్ధమైంది. విమానయాన రంగ ఉత్పత్తులను తయారుచేసే ఫ్రాన్స్‌కు చెందిన శాఫ్రాన్ రూ.1200 కోట్లతో తన కంపెనీని రాష్ట్రంలో ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. వైమానిక రంగానికి సంబంధించిన మెయింటెనెన్స్, రిపేర్, ఓవర్‌హాల్ (ఎంఆర్ఓ) కేంద్రాన్ని ఏర్పాటు చేసేందుకు హైదరాబాద్‌ను ఎంచుకుంది. భారత్‌లో తన తొలి ఎంఆర్ఓ కేంద్రాన్ని హైదరాబాద్‌లో ఏర్పాటుచేసేందుకు ముందుకొచ్చిన శాఫ్రాన్ నిర్ణయాన్ని ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కె.తారకరామారావు స్వాగతించారు. మన దేశంలో ఒక విదేశీ సంస్థ ఏర్పాటు చేస్తున్న తొలి విమాన ఇంజన్ల నిర్వహణ కేంద్రం కూడా ఇదేనన్నారు. శాఫ్రాన్ ఎంఆర్ఓ కేంద్రం ఏర్పాటుతో తెలంగాణలోని ఏవియేషన్ పరిశ్రమకు మరింత ఊతం లభిస్తుందని చెప్పారు. శాఫ్రాన్ అతిపెద్ద నిర్వహణ కేంద్రం హైదరాబాద్‌లోనే రాబోతుందన్నారు. పౌర, సైనిక విమానాల కోసం అధునాతన ఇంజన్లు ఉత్పత్తి చేసే అగ్రశ్రేణి కంపెనీల్లో ఒకటైన శాఫ్రాన్ ఏర్పాటుచేస్తున్న ఈ కేంద్రంతో సుమారు వెయ్యి ఉద్యోగాలు వస్తాయని చెప్పారు. భారత్‌తోపాటు విదేశీ వాణిజ్య విమానయాన సంస్థల విమానాల్లో వాడే లీప్–1ఏ, లీప్–1బీ ఇంజన్ల నిర్వహణను హైదరాబాద్‌లోనే చేస్తారన్నారు. ప్రస్తుతం విదేశాల్లోనే ఈ సౌకర్యం అందుబాటులో ఉందని పేర్కొన్నారు. శాఫ్రాన్ పెడుతున్న ఈ భారీ పెట్టుబడితో ఏరోస్పేస్ రంగంలో హైదరాబాద్‌కు తిరుగులేదన్న సంగతి మరోసారి రుజువైందని కేటీఆర్ చెప్పారు. చదవండి👉🏻సర్కార్‌పై ‘వార్’టీఐ! దరఖాస్తుల ద్వారా యుద్ధానికి రాష్ట్ర బీజేపీ సిద్ధం ప్రపంచంలోనే నంబర్ 1 ఫ్రాన్స్‌కు చెందిన శాఫ్రాన్ అంతర్జాతీయంగా హైటెక్నాలజీ గ్రూప్. ఇది వైమానిక, రక్షణ, అంతరిక్ష రంగాల్లో పనిచేస్తుంది. వైమానిక రంగానికి సంబంధించి ప్రొపల్షన్, ఎక్విప్మెంట్, ఇంటీరియర్స్ తయారీల్లో అగ్రశ్రేణి సంస్థ. గగనతల రవాణాకు సంబంధించి సురక్షితమైన, సౌకర్యవంతమైన సహకారాన్ని ప్రపంచానికి అందించడమే ఈ సంస్థ ప్రధాన లక్ష్యం. 2021 సంవత్సరానికి సంబంధించిన గణాంకాల ప్రకారం ఈ సంస్థ పరిధిలో 76,800 మంది ఉద్యోగులు పనిచేస్తుండగా, 15.3 బిలియన్ యూరోల విక్రయాలతో ప్రపంచంలో అగ్రస్థానాన ఉంది. జీఈ సంస్థతో కలిసి వాణిజ్య జెట్ ఇంజన్లకు సంబంధించి ప్రపంచంలోనే నంబర్ 1గా ఉన్న శాఫ్రాన్.. హెలికాప్టర్ టర్బైన్ ఇంజన్లు, లాండింగ్ గేర్ల తయారీల్లో కూడా అగ్రశ్రేణి సంస్థగా ఉంది. నేడు రెండు ప్రాజెక్టుల ప్రారంభం ఇటీవల హైదరాబాద్‌లో శాఫ్రాన్ సంస్థ రెండు మెగా ఏరోస్పేస్ ప్రాజెక్టులను స్థాపించింది. హైదరాబాద్‌లోని అంతర్జాతీయ విమానాశ్రయానికి ఆనుకొని ఏర్పాటు చేసిన ప్రాజెక్టుల్లో ఒకటి శాఫ్రాన్ ఎలక్ట్రికల్ అండ్ పవర్ ఫ్యాక్టరీ. ఇది విమాన ఇంజన్లకు వైర్ హార్నెస్‌లను ఉత్పత్తి చేస్తుంది. రెండోది శాఫ్రాన్ ఎయిర్‌క్రాఫ్ట్ ఇంజన్ ఫ్యాక్టరీ. ఇది కీలకమైన లీప్ ఇంజన్ల కోసం క్లిష్టమైన ఏరో ఇంజన్ భాగాలను తయారు చేయనుంది. ఈ రెండు ఫ్యాక్టరీలను గురువారం మంత్రి కేటీఆర్.. శాఫ్రాన్ గ్రూప్ సీఈవో ఒలివీర్ ఆండ్రీస్, శాఫ్రాన్ ఎయిర్‌క్రాఫ్ట్ ఇంజన్ సీఈవో జీన్‌పాల్ అలరీలతో కలిసి ప్రారంభించనున్నారు. కొత్తగా ఏర్పాటు చేయబోయే ఎంఆర్ఓకు ఇవి అదనం. ప్రపంచస్థాయి ఏరోస్పేస్ సంస్థల నుంచి మెగా పెట్టుబడులను ఆకర్షిస్తూ దేశంలో అత్యంత శక్తిమంతమైన ఏరోస్పేస్ వ్యాలీగా హైదరాబాద్ స్థిరపడనుందని కేటీఆర్ పేర్కొన్నారు. చదవండి👉🏻విధ్వంసాన్ని పసిగట్టే వీడియో వ్యవస్థ -
రస్సోఫోబియా.. ఉక్రెయినీయన్ల ప్రాణాల కంటే ఎక్కువా?
ఒకవైపు యుద్ధ భయంతో ఉక్రెయిన్ పౌరులు దేశం విడిచిపారిపోతున్నారు. మరోవైపు యుద్ధంలో ఎంతో మంది అమాయకులు బలైపోతున్నారు. సాటి మనిషి ఆపదలో ఉంటే కనీసం స్పందించని కొందరు.. తిన్నది ఆరగక చేస్తున్న నిరసన గురించే ఇప్పుడు చెప్పబోతున్నాం. రష్యాలో ఉన్నత వర్గాలకు చెందిన కొందరు మహిళలు.. తమ లెదర్ హ్యాండ్ బ్యాగులను కత్తిరించి, ఆ వీడియోలను ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసి నిరసనలు వ్యక్తం చేస్తున్నారు. ఇందుకు కారణం లేకపోలేదు. ఫ్రెంచ్(ఫ్రాన్స్) లగ్జరీ ఐటెమ్స్ బ్రాండ్ ‘చానెల్’.. తమ ప్రొడక్టులను రష్యన్ లేడీస్‌కు అమ్మకూడదని నిర్ణయించుకుంది. రష్యాపై ఈయూ ఆంక్షల నేపథ్యంలో చాలా కాలం కిందటే స్టోర్లను సైతం మూసేసింది చానెల్. ఇప్పుడు ఆన్‌లైన్‌లోనూ అమ్మకాలు చేయకూడదని నిర్ణయించుకుంది. ఈ తరుణంలోనే వీళ్లు ఇలా నిరసన వ్యక్తం చేస్తున్నారు. రస్సోఫోభియా-సపోర్టింగ్ బ్రాండ్స్ ట్రెండ్‌కు వ్యతిరేకంగా ప్రముఖ మోడల్ విక్టోరియా బోన్యా, నటి మరినా ఎర్మోష్ఖినా తో పాటు టీవీ సెలబ్రిటీలు, డిస్కో జాకీలు ఈ నిరసనల్లో పాల్గొంటున్నారు. కత్తెరతో తమ దగ్గరున్న చానెల్బ్యాగులను ముక్కలుగా కత్తిరించేస్తున్నారు. View this post on Instagram A post shared by Екатерина Гусева (@djkatyaguseva) ‘మాతృదేశం కోసం..’ అంటూ వాళ్లు చేస్తున్న పనికి కొంత అభినందనలు దక్కుతున్నా.. విమర్శలే ఎక్కువగా వినిపిస్తున్నాయి. ఒకవైపు ఉక్రెయిన్ పౌరులు ప్రాణ భయంతో దేశం విడిచిపోతున్నారు. తినడానికి తిండి కూడా దొరక్క ఇబ్బంది పడుతున్నారు. అన్నింటికి మించి రష్యా బలగాలు.. ఉక్రెయిన్ గడ్డపై మారణహోమానికి తెగపడుతున్నాయి. ఇందులో ఏ ఒక్క అంశంపై స్పందించేందుకు ధైర్యం లేని వీళ్లు, కనీసం సాటి మనుషులకు సంఘీభావం తెలపని వీళ్లు.. ఇలా బ్యాగులను చింపేస్తూ నిరసన తెలపడం నిజంగా విడ్డూరం అనే కామెంట్లు వినిపిస్తున్నాయి. -
భారత్‌లో ఫ్రాన్స్ భారీ పెట్టుబడులు
న్యూఢిల్లీ: భారత్‌లో ఫ్రాన్స్ కంపెనీలు అధిక మొత్తంలో ఇన్వెస్ట్ చేయనున్నాయని ఫ్రాన్స్ ఆర్థిక మంత్రి మైకెల్ సపిన్ తెలిపారు. వచ్చే ఐదేళ్లలో దాదాపు 10 బిలియన్ డాలర్లకుపైగా పెట్టుబడులు పెట్టనున్నాయని అంచనా వేశారు. ఆయన ఇక్కడ ఫిక్కీ నిర్వహించిన ‘ఇండియా-ఫ్రాన్స్ బిజినెస్ సెషన్’లో మాట్లాడారు. భారత్‌లోని సోలార్ స్థాపక సామర్థ్యంలో ఫ్రాన్స్ కంపెనీలు 10% వాటా కలిగి ఉన్నాయన్నారు. భారత్‌లో ఫ్రాన్స్ 3వ అతిపెద్ద విదేశీ పెట్టుబడిదారని, ఇప్పటి వరకు 400కు పైగా ఫ్రాన్స్ కంపెనీలు దాదాపు 20 బిలియన్ డాలర్లమేర ఇన్వెస్ట్ చేశాయన్నారు.