భారత్‌లో ఫ్రాన్స్ భారీ పెట్టుబడులు
న్యూఢిల్లీ: భారత్‌లో ఫ్రాన్స్ కంపెనీలు అధిక మొత్తంలో ఇన్వెస్ట్ చేయనున్నాయని ఫ్రాన్స్ ఆర్థిక మంత్రి మైకెల్ సపిన్ తెలిపారు. వచ్చే ఐదేళ్లలో దాదాపు 10 బిలియన్ డాలర్లకుపైగా పెట్టుబడులు పెట్టనున్నాయని అంచనా వేశారు. ఆయన ఇక్కడ ఫిక్కీ నిర్వహించిన ‘ఇండియా-ఫ్రాన్స్ బిజినెస్ సెషన్’లో మాట్లాడారు. భారత్‌లోని సోలార్ స్థాపక సామర్థ్యంలో ఫ్రాన్స్ కంపెనీలు 10% వాటా కలిగి ఉన్నాయన్నారు. భారత్‌లో ఫ్రాన్స్ 3వ అతిపెద్ద విదేశీ పెట్టుబడిదారని, ఇప్పటి వరకు 400కు పైగా ఫ్రాన్స్ కంపెనీలు దాదాపు 20 బిలియన్ డాలర్లమేర ఇన్వెస్ట్ చేశాయన్నారు.