భారతదేశంలోకి ప్రాంతీయ పెట్టుబడులను సులభతరం చేసే లక్ష్యంతో కేంద్ర వాణిజ్య, పరిశ్రమల శాఖ మంత్రి 'పీయూష్ గోయల్' ఆదివారం సింగపూర్‌లో ఇన్వెస్ట్ ఇండియా కొత్త కార్యాలయాన్ని ప్రారంభించారు. సింగపూర్‌లో ఇటీవలి పర్యటించిన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, సిటీ-స్టేట్‌లో ఇన్వెస్ట్ ఇండియా కార్యాలయాన్ని ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించిన తర్వాత ఈ కార్యాలయం ప్రారంభించారు.
సింగపూర్‌లో ఇన్వెస్ట్ ఇండియా కొత్త కార్యాలయాన్ని ప్రారంభించిన పీయూష్ గోయల్.. దీనికి సంబంధించిన ఫోటోలను కూడా తన సోషల్ మీడియాల్ ఖాతాలో షేర్ చేశారు. ఇన్వెస్ట్ ఇండియా కార్యాలయం ఇక్కడ ప్రారంభించడం చాలా ఆనందంగా ఉందని, భారత్.. సింగపూర్ మధ్య ఆర్థిక సంబంధాలను బలోపేతం చేయడానికి ఇది చాలా సహాయపడుతుందని ఆయన అన్నారు.
ఇన్వెస్ట్ ఇండియా మొదటి విదేశీ కార్యాలయంగా.. ఇది పెట్టుబడులను ఆహ్వానించడానికి ఇది ఎంతగానో ఉపయోగపడుతుంది. భారత్‌కు సింగపూర్ కీలకమైన వ్యూహాత్మక భాగస్వామి. ఇప్పుడు ఇది ఆర్థిక సంబంధాలను బలోపేతం చేయడంలో మాత్రమే కాకుండా ఇండియా, సింగపూర్ మధ్య విస్తారమైన పెట్టుబడి అవకాశాలను అన్‌లాక్ చేయడంలో కీలక పాత్ర పోషిస్తుంది.
ఇదీ చదవండి: భారత్ వృద్ధికి కీలక చర్చలు: పీయూష్ గోయల్
ఇన్వెస్ట్ ఇండియా అనేది 'నేషనల్ ఇన్వెస్ట్‌మెంట్ ప్రమోషన్ అండ్ ఫెసిలిటేషన్ ఏజెన్సీ ఆఫ్ ఇండియా'. దీనిని భారత ప్రభుత్వంలోని వాణిజ్య, పరిశ్రమల మంత్రిత్వ శాఖ లాభాపేక్ష లేని చొరవగా స్థాపించింది. "మేక్ ఇన్ ఇండియా" ప్రచారంలో భాగంగా, ఇన్వెస్ట్ ఇండియా భారతదేశంలో తమ వ్యాపారాలను ప్రారంభించడం, నిర్వహించడం, విస్తరించడంలో పెట్టుబడిదారులను అనుమతిస్తుంది.
Investing in a stronger partnership 🇮🇳 🤝 🇸🇬
Proud to inaugurate the @InvestIndia Singapore office today. This marks a pivotal moment in strengthening economic ties and further unlocking vast investment opportunities between India and Singapore.
It is a significant step… pic.twitter.com/OATmvrrj1x— Piyush Goyal (@PiyushGoyal) September 22, 2024
Comments
Please login to add a commentAdd a comment