
సాక్షి, న్యూఢిల్లీ : రైల్వే ఉద్యోగులకు కేంద్ర ప్రభుత్వం తీపి కబురు అందించింది. దసరా సందర్భంగా ఈ ఏడాది కూడా 78రోజులకు బోనస్ ఇవ్వనున్నట్లు తెలిపింది. 2017-18 ఆర్థిక సంవత్సరానికి గాను రైల్వే ఉద్యోగులకు ప్రొడక్టివిటీ లింక్డ్ బోనస్(పీఎల్‌బీ) కింద రూ. 2,044.31 కోట్లు ఇచ్చేందుకు కేబినెట్ ఆమోదం తెలిపిందని మంత్రి రవిశంకర్‌ప్రసాద్ బుధవారం వెల్లడించారు.
నాన్ గెజిటెడ్ రైల్వే ఉద్యోగులకు మాత్రమే ఈ బోనస్ లభించనుంది. దీని కింద ఉద్యోగులు తమ వేతనంతో పాటు రూ.17,951 అదనంగా బోనస్ కింద పొందనున్నారు. పీఎల్‌బీ బోనస్ కింద సుమారు 12.26లక్షల మంది రైల్వే ఉద్యోగులకు లబ్ధి చేకూరనుంది. రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్(ఆర్‌పీఎఫ్), రైల్వే ప్రొటెక్షన్ స్పెషల్ ఫోర్స్(ఆర్‌పీఎస్‌ఎఫ్) ఉద్యోగులకు ఇది వర్తించదు.
Comments
Please login to add a commentAdd a comment