రైల్వే ఉద్యోగులకు శుభవార్త!
న్యూఢిల్లీ: రానున్న పండుగల సీజన్ నేపథ్యంలో దేశవ్యాప్తంగా రైల్వే ఉద్యోగులకు కేంద్ర ప్రభుత్వం తీపి కబురు అందించనుంది. గత నాలుగు సంవత్సరాల మాదిరిగానే ఈ సంవత్సరం కూడా బోనస్ ప్రకటించాలని డిమాండ్ చేసినట్టు నేషనల్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ రైల్వే మెన్ ప్రధాన కార్యదర్శి రాఘవయ్య పీటీఐ కి చెప్పారు. రైల్వే శాఖ నష్టాల మూలంగా ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పటికీ ప్రొడక్టవిటీ లింక్డ్ బోనస్ (పీఎల్బీ) కింద 78 రోజుల వేతనాన్ని బోనస్ గా చెల్లించాలని కోరినట్టు తెలిపారు. ఈ మేరకు ప్రభుత్వం ఆమోదం తెలిపే అవకాశం ఉందన్నారు. 78 రోజుల బోనస్ ప్రతిపాద వచ్చే వారం క్యాబినెట్ ఆమోదం పొందనుందని తెలిపారు.
గత నాలుగేళ్లగా దసరా పండుగ ముందు ఏటా సుమారు 12 లక్షల రైల్వే ఉద్యోగులకు ఇలా చెల్లించడం ఆనవాయితీగా వస్తోందని ఆల్ ఇండియా రైల్వే మెన్స్ ఫెడరేషన్ ప్రధాన కార్యదర్శి శివ్ గోపాల్ మిశ్రా తెలిపారు. దీంతో ప్రతి ఉద్యోగి కనీసం రూ .18,000 బోనస్ లభిస్తుందని భావిస్తున్నామన్నారు. దీనికి కేంద్రం ఆమోదం లభిస్తే రైల్వేలకు సుమారు రూ 2000 కోట్ల ఖర్చు అవుతుందని అంచనా వేశారు. గత ఏడాది చెల్లించిన కనీస బోనస్ ఉద్యోగి ప్రతి రూ 8.975 లభించిందనీ, ఈ ఏడాది ఇది రెట్టింపు అయ్యే అవకాశం ఉందన్నారు. బోనస్ చెల్లింపు నిర్ణయం ప్రజా రవాణా మెరుగుదలకు ఉద్యోగులను ప్రోత్సహిస్తుందని తెలిపారు. దేశవ్యాప్తంగా ఉన్న నాన్ గెజిటెడ్ ఉద్యోగులు (ఆర్పీఎఫ్ / ఆర్పీఎఫ్ఎస్ఎఫ్ సిబ్బంది మినహా) ఇది వర్తిస్తుందని మిశ్రా చెప్పారు.
కాగా రైలు ప్రయాణికుల సంఖ్య, లోడింగ్ గణనీయంగా క్షీణించిన కారణంగా రైల్వేసుమారు రూ 10,000 కోట్లను నష్టపోయింది.