
ఎయిర్‌టెల్ (ఫైల్ ఫోటో)
బ్రాడ్‌బ్యాండు యూజర్లకు ఎయిర్‌టెల్ బంపర్ ఆఫర్ ప్రకటించింది. ఎయిర్‌టెల్ తన బిగ్ బైట్ ఆఫర్‌ను 2018 అక్టోబర్ వరకు పొడిగిస్తున్నట్టు పేర్కొంది. దీని కింద బ్రాడ్‌బ్యాండ్ యూజర్లు అదనంగా 1000జీబీ వరకు బోనస్ డేటా లభించనుంది. తొలిసారి ఈ ఆఫర్ 2017 మేలో లైవ్‌లోకి వచ్చింది. 2018 మార్చి 31తో ఈ ఆఫర్ ముగిసింది. కానీ ఈ ఆఫర్‌ను అక్టోబర్ వరకు పొడిగించనున్నట్టు ఎయిర్‌టెల్ తాజాగా ప్రకటించింది. ఈ ఆఫర్ ఎయిర్‌టెల్ రూ.1099, రూ.1299 ప్లాన్లపై అందుబాటులో ఉంటుంది. బేస్ ప్లాన్‌పై ఎంత స్పీడులో డేటా లభిస్తోందో, బోనస్ డేటా కూడా అదే నెట్ స్పీడును యూజర్లకు అందుబాటులో ఉంటుంది. అదనపు డేటాను ప్రతి నెలా క్యారీ ఫార్వర్డ్ చేయనున్నామని, అలా 2018 అక్టోబర్ 31 వరకు లేదా డేటా ముగిసే వరకు చేస్తామని కంపెనీ ప్రకటించింది.
ఈ ప్లాన్ ధరలు రీజన్ రీజన్‌కు వేరువేరుగా ఉన్నాయి. ఢిల్లీ యూజర్లకైతే రూ.1099 ప్లాన్‌పై 250జీబీ అదనపు డేటాతో పాటు 1000జీబీ బోనస్ డేటా లభిస్తోంది. 100 ఎంబీపీఎస్ స్పీడులో ఈ డేటాను ఎంజాయ్ చేసుకోవచ్చు. అపరిమిత లోకల్, ఎస్టీడీ కాల్స్‌ను కూడా యూజర్లు వినియోగించుకోవచ్చు.రెండో ఎయిర్‌టెల్ ప్లాన్ రూ.1299 కింద అపరిమిత కాల్స్‌ను, 250జీబీ బ్రాడ్‌బ్యాండ్ డేటాను, 1000జీబీ బోనస్ డేటాను యూజర్లు పొందుతారు. దీని స్పీడు కూడా 100ఎంబీపీఎస్.
ఈ 1000 బోనస్ డేటాను పొందడమెలా?
ఈ ఆఫర్‌ను పొందడానికి పేజీని విజిట్ చేసి, ప్లాన్‌ను ఎంపిక చేసుకోవాల్సి ఉంటుంది. అనంతరం మీ వివరాలను నమోదు చేయాలి. ఒక్కసారి ఆ ప్రక్రియంతా అయిపోయిన తర్వాత, అదనపు డేటా ఏడు రోజుల తర్వాత బేస్ ప్లాన్‌కు యాడ్ అవుతుంది. ఈ ఆఫర్ పొండానికి రెండు ప్లాన్లలో(రూ.1099, రూ.1299) ఒకటి కొనుగోలు చేయాల్సి ఉంటుంది.
Comments
Please login to add a commentAdd a comment