సాక్షి, న్యూఢిల్లీ: కొత్త కొత్త టారిఫ్‌లతో రిలయన్స్ జియో, బీఎస్ఎన్ఎల్, ఎయిర్‌టెల్ వినియోగదారులను ఆకట్టుకోవడంలో పోటీ పడుతున్నాయి. డేటా ప్రయోజనాలను అందించడంలో టెలికాం ఆపరేటర్లు జోరుగా కదులుతున్నాయి. తాజాగా ఎయిర్‌టెల్ కొత్త ప్రీ పెయిడ్ ప్లాన్‌ను తీసుకొచ్చింది. ముఖ్యంగా జియో, బీఎస్‌ఎన్‌ఎల్‌కు దీటుగా రూ. 499 ధరలో కొత్త ప్రీపెయిడ్ ప్లాన్ ప్రారంభించింది.
తాజాగా లాంచ్ చేసిన రూ. 499 ప్లాన్‌లో రోజుకు 2జీబీ హై-స్పీడ్ డేటా అందిస్తుంది. యూజర్లు అన్ లిమిటెడ్, లోకల్, రోమిండ్ కాల్స్ ఉచితంగా పొందవచ్చు. రోజుకు 100 ఎస్‌ఎంఎస్‌లు ఉచితం. ఈ ప్లాన్ 82 రోజులు చెల్లుతుంది. దీని అర్థం, ఎయిర్‌టెల్ మొత్తం 164జీబీ డేటాను అందిస్తుందన్నమాట. బీఎస్ఎన్ఎల్ రూ.248కే 51 రోజుల పాటు రోజూ 3జీబీ డేటా ఆఫర్ ప్రకటించగా, జియో మాత్రం రూ.251 ప్లాన్ లో రోజూ 2జీబీ డేటాను 51 రోజుల పాటు అందిస్తున్న సంగతి తెలిసిందే.
Comments
Please login to add a commentAdd a comment